స్వీటీ కెరీర్ అగ‌మ్య గోచ‌రం

బాహుబ‌లి త‌ర‌వాత అనుష్క చేసిందేమిటి? అంటే పెద్ద‌గా స‌మాధానాలు దొర‌క‌వు. 2019లో ఆమె స్కోరు సున్నా. సినిమాలు ఒప్పుకున్న‌వి, వ‌రుస‌గా విడుద‌లౌతున్న‌వీ అంటూ ఏమీ లేవు. ఒక్క నిశ్శ‌బ్దం మాత్ర‌మే త‌న చేతిలో ఉన్న సినిమా. అదెప్పుడో పూర్త‌యిపోయింది. కానీ… విడుద‌ల తేదీనే వాయిదాలు ప‌డుతూ వస్తోంది. ఈనెల 31న ఈసినిమాని తీసుకొద్దామ‌నుకున్నారు. ఏమైందో ఏమో… అంత‌లోనే మ‌ళ్లీ వాయిదా ప‌డింది. ఆ సినిమాకి ప్ర‌మోష‌న్లు కూడా ఏమీ లేవు. చేతిలో ఉన్న ఒక్క సినిమానే విడుద‌ల‌కు కుస్తీ పాట్లు ప‌డుతోందంటే… ప‌రిస్థితిని అర్థం చేసుకోవొచ్చు.

తెలుగు చిత్ర‌సీమ దాదాపుగా అనుష్క‌ని మ‌ర్చిపోయే స్థితికి వెళ్లిపోయింది. ఈ ప‌రిస్థితికి అనుష్క కూడా ఓ కార‌ణ‌మే. త‌న‌కొచ్చిన అవ‌కాశాల్ని లైట్ తీసుకుంది. ఫిజిక్‌పై శ్ర‌ద్ధ చూపించ‌లేదు. కొంత‌కాలం సినిమాల‌కు దూరంగా ఉండాల‌న్న కఠిన నిర్ణ‌యం తీసుకుంది. దాంతో ఆమె చేయాల్సిన పాత్ర‌లు మ‌రొక‌రి చేతిలోకి వెళ్లిపోయాయి. తీరా ఇప్పుడు స్వీటిని ప‌ట్టించుకునే నాధుడే క‌రువ‌య్యాడు. నిశ్శ‌బ్దం విడుద‌లై.. ఆ సినిమా హిట్ట‌యితే, అప్పుడు మ‌ళ్లీ త‌న కెరీర్‌కి ఊపొస్తుంద‌ని భావిస్తోంది. కానీ ఆ సినిమా ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తుందో తెలీదు. పైగా నిశ్శ‌బ్దంకి ఎలాంటి బ‌జ్ లేదు. ఈ సినిమా విడుద‌ల విష‌యంలో స్వీటీ కూడా టెన్ష‌న్ ప‌డుతుంద‌ని తెలుస్తోంది. ఎప్పుడూ త‌న సినిమా రిలీజ్ డేట్ విష‌యంలో ఆలోచించ‌ని అనుష్క‌.. ఈ సినిమా రిలీజ్ డేట్ విష‌యంలో నిర్మాత‌ల‌పై ఒత్తిడి తీసుకొస్తుంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికీ ఈ చిత్ర నిర్మాత‌ల‌కూ, అనుష్క‌కీ మ‌ధ్య గ్యాప్ వ‌చ్చేసింద‌ట‌. ప్ర‌మోష‌న్ల‌లో అనుష్క క‌నిపించే అవ‌కాశాలూ అంతంత మాత్ర‌మే అని సినీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అదే జ‌రిగితే… నిశ్శ‌బ్దం కూడా నిశ్శ‌బ్దంగా వ‌చ్చి వెళ్లిపోతుంది. అలా జ‌రిగితే ఈ సినిమాపై ఆశ‌లు పెట్టుకున్న అనుష్క ప‌రిస్థితి ఏమిటో??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫిన్‌సెన్‌ లీక్స్ : వెలుగులోకి కేవీపీ, అదాని సహా ప్రముఖుల “బ్లాక్” హిస్టరీ..!

ఫిన్‌సెన్ లీక్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రపంచంలో కుబేరులనే పేరు సంపాదించిన వారి బ్యాంకుల్లో ఎలాంటి అనుమానాస్పద లావాదేవీలు నిర్వహించారో ఈ ఫిన్‌సెన్ లీక్స్ బయట పెడుతోంది. వికిలీక్స్, పనామా...

సోము వీర్రాజు సై..! తిరుపతి లోక్‌సభ బరిలో బీజేపీ..!

భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. దూకుడు మీద ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం చేపడుతామంటున్న ఆయన తమ బలం ఎంత ఉందో... క్రమంగా చూపించాలని నిర్ణయించారు. ఈ...

అమిత్‌షాతో భేటీ సాయిరెడ్డి, మిధున్ రెడ్డిలు దూరం..! ఏం జరిగింది..?

ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సరికొత్త వ్యూహంతో భేటీలు నిర్వహిస్తున్నారు. ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా జగన్మోహన్ రెడ్డి వెంట అసాంతం ఉండేది విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలు మాత్రమే. కానీ ఈ సారి...

ఏజీతో ఢిల్లీకి జగన్..! అమిత్‌షాతో గంట భేటీ..!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. హోంమంత్రి అమిత్ షాతో దాదాపుగా యాభై నిమిషాల సేపు జగన్ సమావేశమయ్యారు. సమావేశంలో పీఎంవో కీలక అధికారి మిశ్రా కూడా వీడియో...

HOT NEWS

[X] Close
[X] Close