‘సైరా’ క్లైమాక్స్ అంతా స్వీటీదే!

‘సైరా’ సెన్సార్ అయిపోయింది. ఇక విడుద‌లే త‌రువాయి. అక్టోబరు 2 కోసం మెగా అభిమానులంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈలోగా `సైరా` క్లైమాక్స్‌పై ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్ట‌డం మొద‌లెట్టాయి. ‘సైరా’ క్లైమాక్స్‌లో చిరంజీవి క‌నిపించ‌డ‌ని, త‌ను లేకుండానే అర‌గంట సేపు క‌థ‌ని న‌డిపార‌ని వార్త‌లొస్తున్నాయి.

బ్రిటీష్ వారిపై పోరాటం చేసిన‌ ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి ని తెల్ల‌దొర‌లు ఉరితీస్తారు. అప్ప‌టికీ త‌మ ప్ర‌తీకారం తీర‌క‌పోవ‌డంతో, ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి త‌ల‌ని కోట గుమ్మానికి వేలాడ‌దీస్తారు. ఆ త‌ల కొన్నేళ్ల పాటు అలానే ఉండిపోయింది కూడా. ‘సైరా’ క్లైమాక్స్ కూడా అంతే. చిరంజీవిని ఉరితీయ‌డంతో ఈ సినిమా ముగిసిపోవాలి. కానీ.. అలా ముగిస్తే ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి పంచిన స్ఫూర్తి ఎలాంటిదో ఈత‌రానికి అర్థం కాదు. అందుకే మ‌రికొన్ని స‌న్నివేశాల పాటు సినిమాని న‌డిపించాల్సివ‌చ్చింది. సిపాయిల తిరుగుబాటుకు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి పోరాటం ఎలాంటి స్ఫూర్తినిచ్చిందో, అది భార‌త స్వాతంత్ర్య ఉద్య‌మానికి నాంది ఎలా అయ్యిందో చెబుతూ ఈ క‌థ‌ని ముగించారు. ప‌తాక స‌న్నివేశాల్లో ఝాన్సీల‌క్ష్మీబాయ్‌గా అనుష్క ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. ఝాన్సీ ల‌క్ష్మీబాయ్‌గా అనుష్క ఎంట్రీ ఇచ్చి, బ్రిటీష్‌వారిపై పోరాటం సాగించ‌డంతో ఈ క‌థ ముగియ‌బోతోంది. బ‌య‌ట ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్టు చిరంజీవి లేకుండా అర‌గంట సినిమాన‌డ‌ప‌లేదు గానీ, చివ‌రి 5 నిమిషాల్లో మాత్రం చిరు క‌నిపించ‌డు. ఆ సంద‌ర్భంలో వ‌చ్చే స‌న్నివేశాల కోస‌మే ప‌వ‌న్ క‌ల్యాణ్ వాయిస్ ఓవ‌ర్ ఇచ్చాడు. అంటే `సైరా` క్లైమాక్స్ అంతా అనుష్క‌, ప‌వ‌న్‌ల‌దే అన్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close