భాగమతి హిట్. ఇందులో ఎలాంటి సందేహాలు లేవు. ఇప్పటికే సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్ళింది. తొలివారం సోలోగా కుమ్మేసింది అనుష్క. సంక్రాంతి సినిమాలు ఆకట్టుకోలేకపోవడంతో మంచి సినిమా కోసం ఎదురుచూసిన ప్రేక్షకులు భాగమతిని బాగానే ఆదరించారు. ఇప్పుడు రెండో వారం. ఈ వారం వచ్చిన ”టచ్ చేసి చూడు”, ”ఛలో సినిమాల్లో ”టచ్ చేసి చూడు” లో విషయం లేదని తేలిపోయింది. ఛలో మీడియం సినిమా. టాక్ బావుంది. అయితే అనుష్క క్రేజ్ ను బీట్ చేసేటంత స్టామినా ఛలోకి లేదు. ఇవి తప్పితే మరో సినిమాలేదు. దీంతో రెండో వారం కూడా కుమ్మేయడానికి పక్కా ప్లాన్ చేసింది యువీ క్రియేషన్స్. ఇందుకోసం స్పెషల్ ప్రమోషనల్ ఈవెంట్స్ ను ప్లాన్ చేసింది.
రేపు ఈ సినిమా యూనిట్ విజయవాడ, ఏలూరు, రాజమండ్రిలో పర్యటించనుంది. అక్కడ భాగమతి ఆడుతున్న థియేటర్లకు వెళ్లి సందడి చేయనుంది అనుష్క. మహిళా ప్రేక్షకులతో కాసేపు ఆమె సినిమా చూడబోతుంది. ఈ ప్రమోషనల్ ఈవెంట్ తో సినిమా ఖచ్చితంగా మరో వారం జనాల నోట్లో నానుతుంది. ఇదే కాదు ఇప్పటికే అనుష్క పై స్పెషల్ ఇంటర్వ్యూ లు షూట్ చేశారు. ఇవి మీడియాలో తెగ హాల్ చల్ చేస్తున్నాయి. అనుష్క లైవ్ లో వచ్చి మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. అయితే భాగమతి కోసం కొన్ని టీవీ స్టూడియోలకు కుడా వెళ్ళింది అనుష్క. అంతేకాదు.. మంచు లక్ష్మి నిర్వహిస్తున్న ‘మేము సైతం’లో కూడా భాగమైయింది. సెలబ్రిటీలతో పని చేయించి, వారి అభిమానుల నుంచి డబ్బులు వసూలు చేసి ఓ కుటుంబాన్ని ఆదుకోవడం ఈ కార్యక్రమం ఉద్దేశం. భాగమతి ప్రమోషనల్ లో బాగంగా .. అనుష్క పెట్రోలు బంకులో పనిచేసి, అక్కడ వచ్చిన డబ్బును మేముసైతం కు వచ్చేలా ఓ షూటింగ్ కూడా చేస్తుంది. అదీ ఈ రోజే.
మీడియాకి, పబ్లిక్ కి దూరంగా వుండే సెలబ్రేటీల్లో అనుష్క కూడా చేర్చవచ్చు. చాలా తక్కువగా బయటికికనిపిస్తుంటుంది అనుష్క. తన సినిమా ఆడియో ఫంక్షన్, ఓ మీడియా మీట్ తప్పితే అనుష్క బయటికి వచ్చే సందర్భాలు కనిపించవు. ఇంటర్వ్యూ లు కూడా తక్కువ. అలాంటి అనుష్క.. ఇప్పుడు భాగమతి ప్రమోషన్ విషయంలో ఇలా ప్రత్యేక శ్రద్ద చూపించడం మెచ్చుకొదగ్గ విషయమే. ఈ విషయంలో యువీ నిర్మాతలకు అనుష్క నుండి బోలెడంత సహకారం లభిస్తుందని ప్రమోషన్స్ చూస్తుంటే అర్ధమౌతుంది.