ఎక్ల్‌క్లూజీవ్‌: ‘క‌న్న‌ప్ప‌’లో అనుష్క

‘క‌న్న‌ప్ప‌’ సినిమాని భారీ హంగుల‌తో, రూ.100 కోట్ల బ‌డ్జెట్ తో రూపొందిస్తాం అని మంచు విష్ణు అంటుంటే కామెడీ గా తీసుకొన్నారు చాలామంది. కానీ ఈ సినిమాని నిజంగానే అనుకొన్న‌దానికంటే మిన్న‌గా తీసేందుకు విష్ణు చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు, ఖ‌ర్చు పెడుతున్నాడు. క‌నీవినీ ఎరుగ‌ని స్టార్స్‌కాంబోని ఈ సినిమా కోసం తీసుకొస్తున్నాడు. ఇప్ప‌టికే అనుష్క‌, మోహ‌న్ లాల్‌, న‌య‌న‌తార‌, కృతిస‌న‌న్‌, శివ‌రాజ్ కుమార్‌.. ఇలా భారీతారాగ‌ణాన్ని ‘క‌న్న‌ప్ప‌’ కోసం రంగంలోకి దించాడు. ఇటీవ‌లే… అక్ష‌య్ కుమార్ సైతం ఈ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు అనుష్క కూడా… ఓ కీల‌క పాత్ర చేయడానికి అంగీకారం తెలిపింద‌ని స‌మాచారం. ఇన్ సైడ్ వ‌ర్గాల ప్ర‌కారం అక్ష‌య్ శివుడిగా, అనుష్క పార్వ‌తిగా క‌నిపించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. పార్వ‌తి పాత్ర‌కు ముందు కంగ‌నాను అనుకొన్నారు. అయితే.. ఆ స్థానంలో సౌత్ స్టార్ ఉంటే బాగుంటుంద‌న్న ఆలోచ‌న‌తో అనుష్క‌ని సంప్ర‌దించారు. ఇటీవ‌ల న్యూజీలాండ్ లో ఓ భారీ షెడ్యూల్ పూర్తి చేశారు. శివ రాజ్ కుమార్‌, బ్ర‌హ్మానందం, మోహ‌న్ లాల్ .. వీళ్లంతా ఇప్ప‌టికే షూటింగ్ లో పాలుపంచుకొన్నారు. ప్ర‌భాస్‌, న‌య‌న‌తార, అనుష్క వీళ్లపై త్వ‌ర‌లోనే స‌న్నివేశాల్ని పూర్తి చేస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భ‌ళా బెంగ‌ళూరు..ప్లే ఆఫ్‌లో చోటు

ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే.. అందులో 7 ఓట‌ములు. పాయింట్ల ప‌ట్టిక‌లో చిట్ట చివ‌రి స్థానం. ఇలాంటి ద‌శ‌లో బెంగ‌ళూరు ప్లే ఆఫ్‌కి వెళ్తుంద‌ని ఎవ‌రైనా ఊహించి ఉంటారా? కానీ బెంగ‌ళూరు అద్భుతం...

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close