నిశ్శ‌బ్దం ట్రైల‌ర్‌: సౌండ్ ఎక్కువే ఉంది

థియేట‌ర్‌లు మూత‌బ‌డ‌డంతో… ఓటీటీవైపు చూసిన మ‌రో సినిమా `నిశ్శ‌బ్దం`. భారీ బ‌డ్జెట్ సినిమా కావ‌డం, అనుష్క, మాధ‌వ‌న్ లాంటి స్టార్లు ఉండ‌డంతో ఈ సినిమాపై జ‌నాల ఫోక‌స్ పెరిగింది. గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితిలో ఓటీటీలో వ‌స్తోంది త‌ప్ప‌, థియేట‌ర్ రిలీజ్ కోసమే చివ‌రి వ‌ర‌కూ పాకులాడింది. అయితే అక్టోబ‌రు 2న ఈ సినిమా అమేజాన్ లో రాబోతోంది. ఇప్పుడు ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

ఇదో థ్రిల్ల‌ర్. ఓ హాంటెడ్ హౌస్‌లో.. ఓ పెయింటింగ్ కోసం అన్వేషిస్తూ ఓ జంట వ‌స్తుంది.ఆ ఇంట్లో జ‌రిగిన ప‌రిణామాలేంటి? అన్న‌దే ఆ త‌దుప‌రి క‌థ‌. అనుష్క ఈ చిత్రంలో మాట‌లు రాని యువ‌తి పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. ఆ ఇంట్లో జ‌రిగిన ప‌రిణామాల‌కు, అనూహ్య సంఘ‌ట‌న‌ల‌కు తానే సాక్ష్యం. ఇన్వెస్టిగేష‌న్‌, హార‌ర్‌, ధ్రిల్ల‌ర్‌.. ఇవ‌న్నీ మేళ‌వించిన క‌థ ఇది. అంజ‌లి ఓ కీల‌క పాత్ర పోషిస్తోంది. షాట్స్ క‌ట్ చేసిన విధానం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చూస్తే… ఓ మంచి థ్రిల్ల‌ర్ ని చూడ‌బోతున్నామ‌న్న ఫీలింగ్ వ‌స్తోంది. తెలుగుతో పాటు మిగిలిన ద‌క్షిణాది భాష‌ల్లోనూ ఒకేసారి ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close