‘అన్వేషిప్పిన్‌ కండెతుమ్’ రివ్యూ: మ‌రో మంచి క్రైమ్ థ్రిల్ల‌ర్ (నెట్‌ఫ్లిక్స్‌)

ఈ ఏడాది మలయాళ సినిమాలకి మంచి ఆరంభం దక్కింది. అక్కడ చెప్పుకోదగ్గ సినిమాలు వచ్చాయి. మంజుమ్మెల్ బాయ్స్, భ్రమయుగం, ప్రేమలు… లాంటి చిత్రాలు మిగతా పరిశ్రమల ద్రుష్టిని కూడా ఆకర్షించాయి. టొవినో థామస్‌ హీరోగా నటించిన ‘అన్వేషిప్పిన్‌ కండెతుమ్‌’ కూడా థియేటర్స్ లో సత్తా చాటిన సినిమానే. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్‌ లోకి వచ్చింది. నేరపరిశోధన నేపధ్యంలో సాగిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చింది? ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌ ఆసక్తికరంగా సాగిందా?

అది1993. లవ్లీ అనే అమ్మాయి దారుణంగా హత్యకు గురౌతుంది. ఎస్సై ఆనంద్‌ (టొవినో థామస్‌) నిజాయితీ గల అధికారి. మొదట లవ్లీ కేసుని తనే విచారిస్తాడు. అయితే పైఅధికారులు అసలైన నేరస్తుడిని కాకుండా ఎవరో ఒక అమాయకుడ్ని కేసులో ఇరికించేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తారు. అధికారుల తీరు నచ్చక కేసుని తానే పరిష్కరించి నిజమైన నేరస్తులకు శిక్షపడేలా చూడాలని అనధికారికంగా విచారణ చేపడతాడు. తన విచారణలో ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడు? అసలు లవ్లీని చంపినదెవరు? చివరికి ఆనంద్, నేరస్తుడిని పట్టుకున్నాడా లేదా? ఈ కేసు కారణంగా ఆనంద్ వృత్తి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనేది మిగతా కథ.

తెరపై జరుగుతున్నది ఓ కల్పిత కథ అని తెలిసినప్పటికీ అది నిజమేనేమో అనే మాయ చేయడమే సినిమాటిక్ మ్యాజిక్. ఈ విషయంలో మలయాళ ఫిల్మ్ మేకర్స్ మంచి పట్టుసాధించారు. సహజత్వమే వారి సినిమాలకి శ్రీరామ రక్ష. ‘అన్వేషిప్పిన్‌ కండెతుమ్‌’లో కూడా అదే సహజత్వం కనిపించింది. ‘కన్నూర్ స్క్వాడ్’లా ఇది కూడా ఓ పోలీసు బృందం కథ. ఎస్సై ఆనంద్‌ ఈ బృందానికి లీడర్. ఎలాంటి ఎలివేషన్స్ లేకుండా హీరో పాత్రని పరిచయం చేసిన తీరు, తర్వాత అతని గతం మెల్లమెల్లగా కథలోకి తీసుకెళ్తాయి. ఎప్పుడైతే లవ్లీ మిస్సింగ్ కంప్లయింట్ తెరపైకి వస్తుందో.. అక్కడి నుంచి ప్రేక్షకుడిని తన గ్రిప్ లోకి లాగేసుకుంటాడు దర్శకుడు డార్విన్‌ కురియకోస్‌. ఈ కేసు సంగతి ఏంటో చూద్దామనే ఆసక్తి ప్రేక్షకుడిలో పెరిగిపోతుంది. కేసులో అనుమానాలు రేకెత్తించడానికి కొన్ని పాత్రలు చుట్టూనడిపిన సన్నివేశాలు రొటీన్ గా అనిపించినప్పటికీ.. ఎప్పుడైతే చర్చి ఫాదర్ నేపధ్యం తెరపైకి వస్తుందో అక్కడి నుంచి ఆసక్తిగా మారుతుంది. చర్చ్ ఫాదర్ ఎపిసోడ్ లో వచ్చిన ట్విస్ట్, నేరస్థుడిపట్టుకునే తీరు ఆకట్టుకునేలా తీయగలిగారు. నిజానికి ఇంటర్వెల్ లోనే ఈ కథ అయిపోతుంది.

సెకండ్ హాఫ్ నుంచి శ్రీదేవి హత్య కేసు మొదలౌతుంది. నిజానికి ఒక సినిమాలో ఇలా రెండు కథలు రావడం, ఒక కథకు మరో కథకు లింక్ లేకపోవడం.. సాధారణంగా ప్రేక్షకులకు అంతగా రుచించని వ్యవహారం. సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత అదే ఫీలింగ్ వస్తుంది. కానీ దర్శకుడు చాలా తెవివిగా ప్రేక్షకుల ఆసక్తిని తనవైపు తిప్పుకునేలా శ్రీదేవి మర్డర్ మిస్టరీ కేసుని మొదలుపెట్టాడు. ఆరేళ్ళగా పరిష్కారం కానీ కేసు. సరైన క్లూ వుండదు. గ్రామస్తులు సహకరించరు. ఇలా చాలా సవాళ్ళతో కూడిన ఈ కేసుని ఆనంద్ టీం ఎలా చేధిస్తుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో తొలి సన్నివేశాల్లోనే కలిగించగలిగారు. కేసు విచారణ కూడా చాలా సహజంగా వుంటుంది. అప్పటికే రెండు బృందాలు ఈ కేసుని విచారించి వుంటాయి. వారిచ్చిన స‌మాచారంతో ఓ లీడ్ పట్టుకొని ఒకొక్క సన్నివేశాన్ని నేర్పుగా నడిపిన విధానం ఆకట్టుకుంటుంది

సెల్ ఫోన్స్ కమ్యునికేషన్ లేని రోజుల్లో జరిగిన ఆ ఘటనకు.. ఉత్తరాలు ఆధారంగా కేసుని విచారించి అందులో నుంచే నేరస్తులని పట్టుకున్న తీరు మెప్పిస్తుంది. ఈ కేసులో కూడా అసలు నేరస్థుడు ఎవరనేది ప్రేక్షకుల ఊహకు చివరి వరకూ అందదు. క్లైమాక్స్ సహజంగా, కొత్తగా కుదిరింది. నిజానికి ఇలాంటి రెండు కేసులు వున్నప్పుడు ప్రేక్షకులు బోర్ ఫీల్ అవ్వాలి. కానీ మొదటి కేసుకు రెండో కేసు విచారణలో ఏ మాత్రం పొంతన లేకపోవడం, రెండు కేసుల విచారణ పూర్తిగా భిన్నం కావడంతో కథతో సంబంధం లేకుండా కేవలం విచారణ జరిపిన తీరుతోనే ప్రేక్షకులని లీనం చేయగలిగారు.

ఎస్సై ఆనంద్‌ పాత్రలో టొవినో థామస్‌ కొత్తగా కనిపించారు. తన గెటప్ లో చేసిన మార్పులు బావున్నాయి. పాత్ర పరిధి దాటకుండా అందులోనే ఉంటూ చివరి వరకూ ప్రేక్షకులని ద్రుష్టి మరలకుండా తన సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. తన టీంలో కనిపించినవారంతా పరిధి మేరకు నటించారు. లవ్లీ, శ్రీదేవి పాత్రలో కనిపించిన నటులు, వారి కళ్ళలో అమాయకత్వం కథకు ఉపయోగపడ్డాయి. మిగతా నటీనటులంతా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. కెమెరాపనితనం నీట్ గా వుంది. సంతోష్ నారాయణ్ అందించిన నేపధ్య సంగీతం కథలోని మూడ్ ని ఎలివేట్ చేసింది. దర్శకుడు రెండు కేసులని ఒక పోలీస్ క్యారెక్టర్ కథకు జోడించిన తీరు బావుంది. సినిమా ఓటీటీలో వుంది కాబట్టి సహత్వంతో కూడిన ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్ చూడాలనుకునే ఆడియన్స్ కు ఈ సినిమా మంచి ఆప్షనే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close