రివ్యూ: అన్యస్ టుటోరియల్ (ఆహా వెబ్ సిరీస్‌)

హారర్‌ ఎవర్ గ్రీన్ జోనర్‌. భయం కూడా కమర్షియల్ ఎలిమెంటే. బడ్జెట్ విషయంలో కూడా నిర్మాతలకు కలిసొచ్చే జోనర్ ఇది. అందుకే తరచూ హారర్ కంటెంట్ ప్రేక్షకులని పలకరిస్తూనే వుంటుంది. ఓటీటీ ప్రభావం పెరగడంతో ఫిల్మ్ మేకర్స్ ఈ జోనర్ పై మరింత ద్రుష్టి పెట్టారు. ఇప్పుడు బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్ ఓ హారర్ వెబ్ సిరిస్ ని ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. అదే ‘అన్యస్ టుటోరియల్’. రెజీనా, నివేదిత సతీష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ వెబ్ సిరిస్ ‘ఆహాలోకి వ‌చ్చింది.

పల్లవి గంగిరెడ్డి ఈ వెబ్ సిరిస్ కు దర్శకురాలు. బాహుబలి బ్యానర్ ఇమేజ్ తో రూపొందిన ‘అన్యస్ టుటోరియల్’ కథలోకి వెళితే..

అన్య(నివేదిత సతీష్) మధు( రెజినా) అక్కా చెల్లెళ్లు. అన్య ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌. మధు ఫ్రీలాన్స్ ట్రాన్స్‌లెట‌ర్‌. వీరిద్దరికీ ఓ దారుణమైన గతం వుంటుంది. మధు వల్ల‌ మానసికంగా క్రుంగిపోతున్నాని ఫీలైన అన్య.. మధు నుండి దూరంగా ఓ అపార్ట్మెంట్ లో అద్దెకు దిగుతుంది. సరిగ్గా అప్పుడే కరోనా లాక్ డౌన్ మొద‌లవుతుంది. ఆపార్ట్మెంట్ లో తను తప్ప ఎవరూ లేరనే సంగతి వచ్చిన రోజు రాత్రే అన్యకి తెలుస్తుంది. అన్య వుండే ఇల్లు ఒక దయ్యాల కొంపలా వుంటుంది. విచిత్రమైన సౌండ్లు, స్విచ్ వేయకుండానే ఫ్యాన్ తిరగడం, బల్బులు పేలిపోవడం, వింత వింత‌ ఆకారాలు కనిపించడం..ఇలా విచిత్రంగా సాగుతుంటుంది. విషయం తెలుసుకున్న మధు.. తిరిగి వచ్చేమని అన్యని కోరుతుంది. అన్య అంగీకరించదు. అక్క దగ్గర వుండటం కంటే దెయ్యంతో వుండటమే బెటర్ అని చెబుతుంది. ఆ ఇంటి నుండే ఇన్‌స్టాగ్రామ్ లో టుటోరియల్స్ చేస్తుంది. అన్య ఒక వీడియో చేస్తుండగా తన వెనుక ఒక దెయ్యం ఆకారం వీడియోలో కనిపిస్తుంది. ఆ వీడియో వైరల్ అవుతుంది. ఒక్కసారిగా అన్య ఫాలోవర్స్ పెరిగిపోతారు. అయితే ఆ వీడియోలో కనిపించింది దెయ్యం కాదని, తనే ఇంట్లో వుండే వస్తువులతో ఒక దెయ్యం ఆకారాన్ని తయారుచేసినట్లు మధుకి ఫోన్ లో చెబుతుంది అన్య. మధు ఆ కాల్ రికార్డ్ లీక్ చేస్తుంది. దీంతో అన్య ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఒక్కసారిగా తగ్గిపోతారు. దీనికి కౌంటర్ అన్య, తన అక్క మధు తనకి చేసిన టార్చర్ గురించి తన ఫాలోవర్స్ కి చెబుతుంది. దీంతో మళ్ళీ అన్యకి ఫాలోవర్స్‌ పెరుగుతారు. అయితే అన్య వీడియోస్ చూస్తున్న ఆడియన్స్ లో కూడా కొన్ని పారానార్మల్ యాక్టివిటీ లక్షణాలు కనిపిస్తాయి. అర్జున్ అనే ఓ కుర్రాడు భయంతో వణికిపోయి మంచాన పడతాడు. మరికొందరికి కూడా ఇదే జరుగుతుంది. దీంతో దెయ్యల కొంపలో వుంటున్న అన్య వీడియోలని బ్యాన్ చేయాలని టీవీలో సోషల్ మీడియా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. లైవ్ లో దెయ్యాన్ని చూపించే విధంగా అన్యతో ఇంట్లో ఒక తంత్రం వేయిస్తారు. తర్వాత ఏం జరిగింది ? లైవ్ లో దెయ్యం కనిపించిందా ? దెయ్యాల కొంప నుంచి అన్య బయటపడిందా? అన్య వీడియోలు చూస్తున్న జనాలు ఎందుకు వింతగా ప్రవర్తించారు? అన్య, మధుల గతం, వారి మధ్య వున్న వైరం ఏమిటి ? అనేది మిగతా కథ.

హారర్ అనేసరికే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. హారర్ ని ఇష్టపడే ఆడియన్స్ మెప్పించడం కూడా అంత సులువు కాదు. కేవలం భయపెడితే వర్క్ అవుట్ కాదు.. సర్ ప్రైజ్, సస్పెన్స్, థ్రిల్, ట్విస్ట్ ఇవన్నీ కథలో కుదరాల్సిందే. దర్శకురాలు పల్లవి గంగిరెడ్డి ‘అన్యస్ టుటోరియల్’ సిరిస్ కోసం ఎత్తుకున్న పాయింట్ బావుంది. కొత్తగా సైబర్ యాంగిల్ కూడా యాడ్ చేసి సైబర్ హారర్ థ్రిల్లర్ గా ‘అన్యస్ టుటోరియల్’ తీర్చిదిద్దారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కూడా ఒక దెయ్యం కథ చెప్పొచ్చనే ఆలోచన కొత్తగా వుంది. నేపధ్యం కూడా చక్కగా కుదిరింది. ఊరికి దూరంగా ఇల్లు, ఒంటరిగా అమ్మాయి ఇంట్లో విచిత్రమైన సౌండ్లు, ఎఫ్ఫెక్ట్ లు భయంకరమైన కలలు.. ఇవన్నీ హారర్ మూడ్ ని క్రియేట్ చేశాయి. ఒక చక్కని సౌండ్ సిస్టంలో చూస్తే కనుక చాలా సార్లు చెవులు మూసుకునే టెర్రిఫిక్ సన్నివేశాలు కొన్ని కుదిరాయి. అయితే ఏడు ఎపిసోడ్లు గల ఈ వెబ్ సిరిస్ ముందుకు వెళుతున్న కొద్ది సర్ప్రైజ్ థ్రిల్ సస్పెన్స్ ని పెంచడంలో మాత్రం కాస్త తడబడింది.

సైబర్ యాంగిల్ లో డీల్ చేసిన ట్రీట్మెంట్ కాస్త ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఎప్పుడైతే పాత హారర్ సినిమాల్లో చూపినట్లు సామాన్లు, మనుషులు గాల్లో ఎగరడం, ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్ష మవ్వడం మొదలైయిందో లాజిక్ అందని ఫాంటసీలోకి వెళ్ళిపోయి ఫాంటసీ హారర్ గా టర్న్ తీసుకోవడం సైబర్ యాంగిల్ కి దెబ్బకొట్టింది. ఈ క‌థ‌ని లాక్ డౌన్ లో సెటప్ చేశారు. దానికి తగ్గట్టే కథ కూడా ముందుకు వెళ్ళకుండా అక్కడిక్కడే తిరుగుతుంది. నిజానికి ప్రధాన పాత్రలు అన్య, మధు, మదర్ పాత్రలకు వున్న గతం వెన్నులో వణుకు పుట్టించేలా వుంటుంది. ఇంటికి అద్దె చెల్లించలేని పరిస్థితిలో శ్మాసనం దగ్గర శవాలు ఉంచే ఓ ఇంట్లో తన ఇద్దరి పిల్లలతో వుంటుంది తల్లి. అలాంటి చోట పెరిగిన అన్య, మధులకు బాల్యం అంతా మాటల్లో చెప్పలేని భయం. అన్యతో ఒక ఆత్మ మాట్లాడుతూ వుంటుంది. ఇలాంటి నేపధ్యం వున్నప్పుడు దాన్ని ఇంకా టెర్రిఫిక్ గా చూపించే అవకాశం వుంది. అయితే ఈ పాయింట్ ని అంత బలంగా వాడుకోలేదు దర్శకురాలు. ఆ గతంతో చెప్పిన కథలో కూడా క్లారిటీ వుండదు. బహుశా సెకండ్ సీజన్ లో దీనిన్ని వివరంగా చెప్తారేమో.

వెబ్ సిరిస్ ని ఆసక్తికరంగా నడపడానికి ఒక టెక్నిక్ కావాలి. ప్రతి ప్రధాన పాత్రకూ ఒక కథ వుండాలి. ఆ కథ అసలు కథకి లింక్ అవ్వాలి. అంటే ప్రతి ఎపిసోడ్ కి ఒక లాగ్ లైన్ వుండి ఆ లైన్ నెక్స్ట్ ఎపిసోడ్ ని లీడ్ చేయాలి. ‘అన్యస్ టుటోరియల్’ ఇది కనిపించదు. ఎపిసోడ్ కి ముందు భయంకరమైన సీన్ ఒకటి వుంటుంది. తీరా అది కల తెలుస్తుంది. ఇది ఒక ఎపిసోడ్ కి చేస్తే ఓకే. కానీ ప్రతి ఎపిసోడ్ కి ఇదే తంతు కనిపించడం సిరియస్ నెస్ ని దెబ్బకొడుతుంది.

సిరిస్ దాదాపు గా అన్య పాత్ర చుట్టే తిరుగుతుంది. ఇన్ స్టా వీడియోల తంతు మొదట్లో కాస్త కొత్తగా అనిపించినా… తర్వాత అదీ బోరింగ్ ఎలిమెంట్ గా మారిపోతుంది. ఎప్పుడైతే అన్యలో దెయ్యం ప్రవేశించిందో తర్వాత సీన్లు అన్నీ ఫాంటసీగానే వుంటాయి. కొన్ని అస్సలే లాజిక్ కి అందవు. హారర్ కథలు చెప్పేటప్పుడు వేసిన ముడులు ఒకొక్కటి విప్పుకుంటూ రావాలి. ఒకొక్క ముడి విప్పడంలో ప్రేక్షకుడు థ్రిల్ ఫీలవ్వాలి. కానీ ‘అన్యస్ టుటోరియల్’ లో ఎక్కడి ముడి అక్కడ ఉండగానే సిరిస్ ముగించేశారు. పోలీసులు వచ్చి అన్య వాడుతున్న కెమెరాని షాకింగ్ గా చూడటంతో సీజన్ 1 ముగిసిపోతుంది. ఆ షాక్ ఏమిటో రెండో సీజనే చెప్పాలి.

నివేదిత సతీష్ నటన బాగుంది. రెజీనా కంటే ఆమెకే ఎక్కువ స్క్రీన్ స్పేష్ దక్కింది. మిస్టిరియస్ గా కనిపించి భయం పుట్టించగలిగింది. మధు పాత్రలో కనిపించిన రెజీనా పాత్ర నిడివి తక్కువ. మధు వైపు నుంచి కూడా కథని నడుపుంటే ఇంకాస్త ఆసక్తికరంగా వుండేది. తల్లి పాత్రలో కనిపించిన ప్రమోధిని పమ్మి హారర్ సినిమాలకి యాప్ట్. ఎక్కువగా మాట్లాడకుండా కేవలం కళ్ళతోనే నటించేలా ఆమె పాత్ర డిజైన్ చేశారు. ఆ పాత్రని చూస్తే ఆమెకు ఒక బ్యాక్ స్టొరీ వున్నట్లనిపిస్తుంది కానీ ఈ సీజన్ లో ఆ పాత్రకి సరైన ముగింపు లేకుండానే ముగించేశారనే భావన కలుగుతుంది. అర్జున్ పాత్రలో కనిపించిన కుర్రాడు ఓకే. చిన్ననాటి అన్య, మధు పాత్రలు వేసిన చైల్డ్ ఆర్టిస్ట్ లు కూడా చక్కగా చేశారు. ఆర్జే హేమంత్ ఒక్క సీన్ కే పరిమితమయ్యాడు. మిగతా పాత్రలు ఓకే.

ఈ వెబ్ సిరిస్ కి మ్యూజిక్ చేసిన అర్రోల్ కొరెల్లిని మెచ్చుకోవాలి. అతను అందించిన నేపధ్య సంగీతం అడుగడుగునా భయపెట్టగలిగింది. సౌండ్ ఎఫ్ఫెక్ట్స్ అద్భుతంగా వున్నాయి. సౌండ్ డిజైన్ చేసిన గౌతమ్ నాయర్ కి కూడా మంచి మార్కులు పడతాయి. బడ్జెట్ డిసైడ్ చేసిన తర్వాతే ఈ కథని సెటప్ చేసినట్లుగా వుంది. ఫస్ట్ లాక్ డౌన్ టైమ్ లో కథని సెట్ చేశారు. దగ్గినా హోం క్వారెంటైన్ స్టాంప్ వేసే కాలంలో జరిగే కథ ఇది. లాక్ డౌన్ లో బయటికి వచ్చి అన్య వున్నట్టు అపార్ట్మెంట్ వెదకడం కష్టం అనే లాజిక్ ని జస్టిఫికేషన్ చేసుకోవడానికి ఈ నేపధ్యం వాడినట్లున్నారు. హ్యాకర్ తో లొకేషన్ కనిపించకుండా జాగ్రత్తపడినపుడు లాక్ డౌన్ వున్నా లేకపోయినా ఒకటే. వెబ్ సిరిస్ అంటే ఎంత లాగ్ వున్నా పర్లేదనే పద్దతి చాలా సీన్స్ లో కనిపించింది. వాటర్ బాటిల్ అందుకొని వాటర్ తాగి దానికి మూత పెట్టి డస్ట్ బిన్ లో విసరడానికి 30 సెకన్లు తీసుకున్నారు. ఇంత ఓపిక తెచ్చుకొని చూసే సీన్లు చాలా వున్నాయి ఇందులో. హారర్ మూడ్ ని అచీవ్ చేయడంలో టెక్నికల్ టీమ్ సక్సెస్ అయ్యింది. కెమెరాపనితనం బావుంది. రైటింగ్ టీమ్ వెబ్ సిరిస్ ఫార్మేట్ పై మరింత కసరత్తు చేసి హారర్ తో పాటు సర్ ప్రైజ్, సస్పెన్స్, థ్రిల్, ట్విస్ట్ లు యాడ్ చేసివుంటే ‘అన్యస్ టుటోరియల్’ మరింత ఆసక్తికరంగా వుండేది. ఓటీటీలోనే వుంది కాబట్టి హారర్ ని ఇష్టపడే ఆడియన్స్ సమయం కుదిరినపుడు ఓసారి ‘అన్యస్ టుటోరియల్’ని ఓపెన్ చేయొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close