ఏపీలో నో.. తెలంగాణలో ఎస్..! న్యూ ఇయర్‌కి వెల్కం కిక్..!

ఏడాది అంతా ఇబ్బంది పెట్టిన 2020కి నీరసంగా కాకుండా.. ఆనందంగా గుడ్ బై చెప్పే చాన్స్ ఇవ్వాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. సూక్ష్మంలో మోక్షంలో ఆదాయం కూడా చూసుకంది. కొత్త సంవత్సర వేడుకలు ప్రభుత్వం పరోక్షంగా అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం అనూహ్యమైన ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 31వ తేదీన మద్యం దుకాణాల సమయాన్ని పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. పన్నెండు గంటల వరకు దుకాణాలను తెరుచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. అలాగే క్లబ్‌లు, పబ్‌లు.. కూడా.. ఒంటి గంట వరకూ తెరుచుకునేందుకు ఉత్తర్వులిచ్చింది. దీంతో నూతన సంవత్సర వేడుకలని నిర్వహించుకోవడానికి ప్రభుత్వం పరోక్షంగా అవకాశం కల్పించిటన్లయింది.

నిజానికి ఎలాంటి ఈవెంట్లు నిర్వహించకూడదని పోలీసులు వారం రోజులుగా… క్లబ్‌లు, పబ్‌లతో పాటు హోటళ్ల నిర్వాహకులందరికీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. స్టార్ హోటళ్లలో రోజువారీ కార్యకలాపాలకు మాత్రమే అనుమతి ఉంటుందని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ఇలాంటి అనుమతి ఇలా ఇవ్వగానే.. అలాగే వివిధ ఈనెంట్లు నిర్వహించే వారు మార్కెటింగ్ ప్రారంభించారు. ప్రభుత్వం ఈవెంట్లకు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదు. కేవలం మద్యం అమ్మకాల వరకే పర్మిషన్ ఇచ్చింది. కానీ.. అలా ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్‌ను.. హోటళ్లు, పబ్‌లు, క్లబ్‌ల యాజమాన్యాలు.. ఈవెంట్‌ కు అనుగుణంగా మార్చుకునేందుకు కసరత్తు ప్రారంభించారు.

ఏపీ ప్రభుత్వం మాత్రం.. న్యూ ఇయర్ కోసం.. ప్రత్యేకంగా రిలాక్షేషన్ ఇవ్వాలని అనుకోవడం లేదు. నిజానికి ఏపీ సర్కార్ కరోనా కారణంగా… మద్యం అమ్మకాల్ని బంద్ చేయించాలనుకుంది. కానీ ఆదాయం పడిపోతుంది కాబట్టి.. వద్దనుకుంది. మామూలు సమయాల్లో మద్యం అమ్మాలని నిర్ణయించింది. దీన్ని పెంచితే.. విమర్శలు వస్తాయని… మద్యం అమ్మకాల సమయాన్ని పెంచాలని అనుకోవడం లేదు. దాంతో.. ఏపీ యూత్ జోష్ కూడా హైదరాబాద్‌లో నే జరగనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్: నిన్న ఐటీఐఆర్.. ఇవాళ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ..!

ఎమ్మెల్సీ ఎన్నికల పుణ్యమా అని తెలంగాణ రాజకీయాల్లో రోజుకో అంశం హైలెట్ అవుతోంది. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానం గురించి బీజేపీపై విమర్శలు చేసేటప్పుడు ఐటీఐఆర్ ప్రాజెక్టును హైలెట్ చేసిన కేటీఆర్.. వరంగల్‌కు పోయి.....

ఏపీ డీజీపీపై కేంద్ర హోంశాఖ విచారణ చేయిస్తున్న రఘురామరాజు..!

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తన నియోజకవర్గం నర్సాపురం వెళ్తే దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేయించాలని ప్లాన్ చేస్తున్నారని అనుమానిస్తున్నారు. అందుకే ఆయన ఉంటే ఢిల్లీ లేకపోతే హైదరాబాద్‌నే ఎంచుకుంటున్నారు. కానీ నర్సాపురం...

బెజవాడకు టీడీపీ హైకమాండ్ కేశినేనినే..!

బెజవాడకు తానే హైకమాండ్ అని ప్రకటించుకున్న ఎంపీ కేశినేని నాని చివరకు తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసుకుంటున్నారు. తన కుమార్తె శ్వేతను మేయర్ అభ్యర్థిగా ప్రతిపాదించారు. హైకమాండ్ ఆమోదముద్ర వేసేలా చూసుకున్నారు. తాను...

కొత్త త‌ప్పుల్ని చేస్తానేమో.. పాత‌వి రిపీట్ చేయ‌ను – రాజ్ త‌రుణ్‌తో ఇంట‌ర్వ్యూ

ద‌ర్శ‌కుడ‌వ్వాల‌నుకుని వ‌చ్చి - అనుకోకుండా హీరో అయిపోయిన వాడు రాజ్ త‌రుణ్‌. అదే త‌న‌కు బాగా క‌లిసొచ్చింది. ఉయ్యాల జంపాలా, కుమారి 21 ఎఫ్‌, సినిమా చూపిస్త మావ‌.. ఇలా హ్యాట్రిక్ సినిమాల‌తో...

HOT NEWS

[X] Close
[X] Close