ఒక వేదికపై బీజేపీ, టీడీపీ !

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిన్న నిర్ణయం తీసుకుంటే ఇవాళ ఆ పార్టీ నేతల్ని మర్యాదపూర్వకంగా కలిసేందుకు ద్రౌపది ముర్ము అంగీకరించారు. ముందుగా మద్దతు ప్రకటించిన వైసీపీ నేతలతో భేటీ కోసం .. కిషన్ రెడ్డితో కలిసి ద్రౌపది ముర్ము అమరావతి వచ్చారు. సీఎం జగన్ ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయిన తర్వాత ఓ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. తనకు మద్దతు ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. ఓ హోటల్లో ముగ్గురు టీడీపీ ఎంపీలు..ఇరవై మంది ఎమ్మెల్యేలులతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి బీజేపీ నేతలు కూడా హాజరయ్యారు.

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా వేదిక మీద కూర్చున్నారు. కిషన్ రెడ్డి చంద్రబాబు ముర్ము అందరూ మాట్లాడారు. గిరిజన మహిళకు మద్దతు ప్రకటించడం అదృష్టమని అచ్చెన్నాయుడు ప్రకటించారు. సామాజిక న్యాయానికి టీడీపీ కట్టుబడి ఉందని చంద్రబాబు తెలిపారు. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు అంటూ సోము వీర్రాజు మాట్లాడారు. వైసీపీ ఏర్పాటు చేసినమద్దతు సమావేశం కన్నా ఎక్కువ మంది దృష్టి తెలుగుదేశం పెట్టిన సమావేశంపైనే ఉంది. చివరి క్షణంలో మద్దతు ప్రకటించడం.. టీడీపీ సమావేశానికి రావడం వైసీపీ వర్గాలను కూడా ఆశ్చర్య పరిచింది.

అయితే ద్రౌపతి ముర్ముకు మద్దతు ఇవ్వాలని టీడీపీ ముందుగానే నిర్ణయించిందని… ఆమె రాష్ట్రానికి వచ్చినప్పుడు టీడీపీ సమావేశంలో కూడా పాల్గొంటుందని తెలిస్తే వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుందన్న ఉద్దేశంతో చివరి క్షణం వరకూ బయటకు తెలియకుండా ఉంచారని అంటున్నారు. బీజేపీ వ్యూహకర్తలు కూడా గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని టీడీపీతో మీటింగ్ ఉంటుందని చివరి క్షణం వరకూ బయట పెట్టలేదంటున్నారు. మొత్తానికి ముర్ము .. అతి స్వల్ప ఓట్లు ఉన్న టీడీపీ విషయంలోనూ అదే సానుకూలత ప్రకటించడం వైసీపీ నేతలకు కాస్త ఇబ్బందికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఔట్ సోర్సింగ్‌లో పని లేనోళ్లనే తీసేస్తున్నారట !

సీఎం జగన్‌కు కోపం వచ్చిందంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎందుకంటే.. పదేళ్ల లోపు సర్వీస్ ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందర్నీ తొలగించాలని ఇచ్చిన ఆదేశాలను చూసి ఆయనకు కోపం వచ్చిందట. అదేంటి.. ఇంత...

పేరు సీమగర్జన – వినిపించింది చంద్రబాబుపై తిట్ల దండకం !

సీమగర్జన పేరుతో వైసీపీ నాయకులు కర్నూలులో చేసిన హడావుడి ప్రహసనంగా మారింది. పరిస్థితి అర్థమయిందేమో కానీ కర్నూలుకు వచ్చి ప్రసంగిస్తానని గట్టి హామీ ఇచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సమావేశానికి హాజరు...

బాల‌య్య హీరోయిన్ దొరికేసిన‌ట్టేనా..?

బాల‌కృష్ణ తో సినిమా అంటే ద‌ర్శ‌కుల‌కు పండ‌గే. ఎందుకంటే..ఆయ‌న డైరెక్ట‌ర్ల హీరో. సెట్లో ద‌ర్శ‌కుడు ఏం చెబితే అది చేసేస్తారాయ‌న‌. అందుకే ద‌ర్శ‌కులంతా బాల‌య్య‌తో ప‌నిచేయ‌డానికి ఎదురు చూస్తుంటారు. కాక‌పోతే... బాల‌య్య సినిమా...

సాయిధ‌రమ్ టైటిల్‌… ‘విరూపాక్ష‌’?

రిప‌బ్లిక్ త‌ర‌వాత సాయిధ‌ర‌మ్ తేజ్ సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. రోడ్డు ప్ర‌మాదం కార‌ణంగా.. సాయి కొన్నాళ్లు సినిమాల‌కు, షూటింగుల‌కు దూరంగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే కోలుకొని.. మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌స్తున్నాడు. వ‌రుస‌గా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close