పాపం ఆఫీసర్స్..! నాడు కేసులు.. ఇప్పుడు అంతకంటే..!

ఆంధ్రప్రదేశ్‌లో సివిల్ సర్వీస్ అధికారుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్లుగా మారింది. ప్రభుత్వ పెద్దలు చెప్పిన పని చేయకపోయినా.. వీరి పేరుతో వారు చేసేసినా కామ్‌గా ఉండకపోయినా శంకరగిరి మాన్యాలు పడతాయి. అలాగని వారు చెప్పినట్లుగా వింటే… ఏమవుతుందో.. కళ్ల ముందు కనిపిస్తోంది. గతంలో చాలా మంది ఐఏఎస్ అధికారులు కేసుల పాలయ్యారు. జైలుకెళ్లారు. తాజాగా.. గోపాలకృష్ణ ద్వివేదీ, గిరిజాశంకర్ లాంటి వారు.. అభిశంసనకు గురయ్యారు. ఎవరైనా ఐఏఎస్ అధికారి రాజ్యాంగ వ్యవస్థ చేతిలో అభిశంసనకు గురయ్యారంటే… అంతకంటే అవమానం ఉండదు. భవిష్యత్‌లో వారికి ఎలాంటి అవకాశాలు రావు.

ప్రభుత్వ పెద్దల మాట విని అభిశంసనకు గురైన ద్వివేదీ, గిరిజాశంకర్..!

ద్వివేదీ, గిరిజాశంకర్‌లను అభిశంసస్తూ… ఎస్‌ఈసీ సర్వీస్ రికార్డుల్లో నమోదు చేయించిన వివరాలు చిన్నవి కావు. సివిల్ సర్వీస్ అధికారి హోదాలో ఉండి.. భారత ప్రజస్వామ్యాన్ని బలహీనం చేసేలా…ఉద్దేశపూర్వకంగా ఓటర్ల జాబితాను ప్రచురించలేదని ఆయన చెబుతున్నారు. దీన్ని ఎవరూ తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. మాములుగా ఓటర్ల దినోత్సవం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ…ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. కానీ ఈ సారి కోర్టుకు హమీ ఇచ్చి కూడా… ద్వివేదీ, గిరిజాశంకర్‌లు నిర్లక్ష్యం ప్రదర్శించారు. ప్రభుత్వ పెద్లు అంగీకరించకపోవడం… వారిని కాదని.. తాము ఎలాంటి చర్యలు తీసుకోలేని నిస్సహాయత వల్లే ఆ పని వారు చేయలేదు. ఒక వేళ నారిని కాదని ఓటర్ల జాబితా ప్రచురిస్తే.. తర్వాత సస్పెన్షన్ వేటు వేసి కేసులు పెట్టినా పెడతారని భయపడి ఉంటారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో కొంత మంది సివిల్ సర్వీస్ అధికారులపై అలాగే కేసులు పెట్టారు. ఆ కేసులు పెట్టడంలోనూ ఈ సివిల్ సర్వీస్ అధికారుల పాత్రే ఉంది. ఇప్పుడు అలాంటి ప్లాన్ … వారిపైనే అమలు చేసినా ఆశ్చర్యం ఉండదు. అందుకే వారంతా భయపడుతున్నారు.

కోర్టు ధిక్కరణకు పాల్పడిన అధికారుల లెక్క చాలా ఎక్కువే..!

ప్రస్తుతం బాధితులుగా గోపాలకృష్ణ ద్వివేదీ, గిరిజాశంకర్‌లు మాత్రమే ఉన్నారు. కానీ ముందు ముందు మరింత సివిల్ సర్వీస్ అధికారులు తీవ్ర వివాదాల్లో చిక్కుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే లెక్కలేనన్ని కోర్టు ధిక్కరణ చర్యలకు అధికారులు పాల్పడ్డారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే… డీజీపీకే హైకోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసేంత దుర్భరంగా మారిపోయింది. అయినా అధికారులు కళ్లు తెరవలేకపోతున్నారు. తాము ఏం ఏం చేస్తున్నామో.. ఏం చేయకూడదో అంచనా వేయలేని స్థితికి వెళ్లిపోయారు. అదే వారికి ముందు ముందు అనేక ఇక్కట్లను తెచ్చి పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ప్రభుత్వం వారిని ఎలా కాపాడుతుంది..!?

తప్పుడు పనులు చేయించి.. తాము అండగా ఉన్నామని.. ఎన్నికలైపోయిన తర్వాత ఎస్‌ఈసీ నిర్ణయాలను సమీక్షిస్తామని… మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స అధికారులకు హామీ ఇస్తున్నారు. కానీ.. వారికి తెలియని విషయం ఏమిటంటే.. రాజ్యాంగ వ్యవస్థలు చేసిన నిర్ణయాలను వారు ఎప్పటికీ సమీక్షించలేరు. ఎస్‌ఈసీ తీసుకున్న అభిశంసన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడం సాధ్యం కాదు. తర్వాత ప్రభుత్వం నియమించే ఎస్‌ఈసీ కూడా ఉపసంహరించుకోలేరు. న్యాయస్థానాలు ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటే వాటిని అమలు చేయాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందేమో కానీ.. చర్యలు మాత్రం ఖాయం. కానీ మంత్రులు ఇలాంటి ప్రకటనల ద్వారా ఐఏఎస్ అధికారుల ద్వారా లేని పోని లబ్దిని రాజకీయంగా పొంది.. వారిని బలిపశువులు చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా స్పష్టంగానే తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉమెన్స్ డే రోజూ అమరావతి మహిళా రైతులకు దెబ్బలే..!

మహిళా దినోత్సవం రోజునా అమరావతి మహిళా రైతులకు ఎలాంటి గౌరవం లభించలేదు సరి కదా.. పోలీసులు చేతిలో దెబ్బలు తినాల్సి వచ్చింది. ఓ వైపు మహిళలకు అండగా నిలబడతామని పెద్ద పెద్ద ప్రకటనలు...

తొలి 10 నిమిషాలు ముందే చూపించేస్తార్ట‌!

మంచు విష్ణు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం మోస‌గాళ్లు. ఇదో వైట్ కాల‌ర్ మోసం చుట్టూ తిరిగే క‌థ‌. టెక్నాల‌జీని వాడుకుంటూ... మోస‌గాళ్లు ఎలా రెచ్చిపోతున్నారో చెప్పే క‌థ‌. ట్రైల‌ర్ ఇటీవ‌లే విడుద‌లైంది. కాజ‌ల్,...

బాల‌య్య రైట్ హ్యాండ్‌.. జ‌గ్గూ భాయ్‌

లెజెండ్‌తో.. జ‌గ‌ప‌తిబాబులోని విల‌న్ విశ్వరూపం చూపించాడు. ఆ సినిమాతో జ‌గ‌పతి బాబు కెరీర్ ట‌ర్న్ అయిపోయింది. హీరోగా ఎంత సంపాదించాడో తెలీదు గానీ, విల‌న్ గా మారాక మాత్రం జ‌గ‌ప‌తి ఆస్తులు పెరిగాయి....
video

మ‌హిళా శ‌క్తి @ విరాట ప‌ర్వం

https://www.youtube.com/watch?v=dQ9S_uy-5sM విరాట‌ప‌ర్వం... ఈ సినిమా పేరు చెప్ప‌గానే ఓ ప్రేమ‌క‌థో, ఓ విప్ల‌వ గాథో, ఓ అభ్యుద‌య చిత్ర‌మో, ఓ సామాజిక స్పృహ ఉన్న ప్ర‌య‌త్న‌మో... అనిపిస్తోంది. పోస్ట‌ర్లూ అలానే ఉన్నాయి. అయితే.....

HOT NEWS

[X] Close
[X] Close