ఇప్పుడు బాబు డిల్లీ వెళ్ళినా ఆశల్లేవు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం డిల్లీ చేరుకొన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన డిల్లీలో జరిగే ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశంలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రేపు వరుసగా పర్యాటక శాఖ, రైల్వే శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, ఆర్ధిక శాఖ మంత్రులతో రేపు చంద్రబాబు నాయుడు వరుసగా సమావేశం అవుతారు. రేపు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడితో సమావేశం అవుతారు.

చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో డిల్లీ వెళ్తే దానిపై రాష్ట్ర ప్రజలు కోటి ఆశలు పెట్టుకొనేవారు. ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజి, రైల్వే జోన్, పోలవరం, పరిశ్రమలు, ప్రాజెక్టులు వంటివేవో ఆయన సాధించుకు వస్తారని అందరూ ఆశగా ఎదురుచూసేవారు. ప్రధాని నరేంద్ర మోడి కూడా రాష్ట్రానికి చాలా హామీలు ఇచ్చి ఉన్నారు కనుక ఆయన తప్పకుండా ఏదో ఒక బారీ సహాయం చేస్తారని ప్రజలందరూ చాలా ఆశగా ఎదురుచూసేవారు. ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత మాట తప్పినా ఆంధ్ర ప్రజలు పరిస్థితులు అర్ధం చేసుకొని ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజితో సర్దుకుపోయేందుకు మానసికంగా సిద్దపడ్డారు. కానీ అదివ్వడానికి కూడా కేంద్రానికి చేతులు రావడం లేదు!

అమరావతి శంఖుస్థాపన సమయంలో ప్రధాని మోడీ డిల్లీ నుండి నీళ్ళు, మట్టి తెచ్చి చంద్రబాబు చేతిలో పెట్టి వెళ్ళిపోయినప్పటి నుండి రాష్ట్ర ప్రజల భ్రమలు పూర్తిగా తొలగిపోయాయి. అప్పటి నుండే కేంద్రంపై పూర్తిగా ఆశలు వదిలేసుకొన్నారు. కనుక ఇప్పుడు చంద్రబాబు డిల్లీ వెళ్ళినా ఇదివరకులాగ మీడియా కూడా దానిని పెద్దగా హైలైట్ చేయడం లేదు. పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు.

రెండు సం.లు పూర్తి కాక మునుపే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై భ్రమలన్నీ తొలగిపోతున్నాయి. నరేంద్ర మోడీని చంద్రబాబు పొగుడటం… చంద్రబాబుని వెంకయ్య నాయుడు పొగడటం…ఇలాగ ఒకరినొకరు పొగుడుకొంటూ కాలక్షేపం చేసేస్తున్నారు తప్ప ఎన్నికలలో హామీ ఇచ్చినట్లుగా  రాజధాని, పోలవరం, మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణం వంటి పనులేవీ మొదలుపెట్టనేలేదు.

ఈ 21 నెలలలో కాగితాల మీద, గాలిలో మేడలు కట్టుకొని అవి చూసి భుజాలు చరుచుకోవడం తప్ప కొత్తగా చేసిందేమీ కనబడటం లేదు. అప్పుడే చూస్తుండగానే రెండేళ్ళు పూర్తయిపోతున్నాయి. చూస్తుండగానే మిగిలిన మూడేళ్ళు కూడా పూర్తయిపోవచ్చును. ఇంతకాలంగా జరగనిది మిగిలిన ఆ మూడేళ్ళలో జరిగిపోతుందని ఆశించలేము కూడా.

రాష్ట్ర ప్రభుత్వం చేతిలో డబ్బు లేకపోవడం వలన అది నిస్సహాయ పరిస్థితిలో ఉందని సర్ది చెప్పుకోవచ్చును. కానీ కేంద్రప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు బారీ ఆర్ధిక ప్యాకేజీలు ప్రకటిస్తూ ఒక్క ఆంధ్రప్రదేశ్ పట్లనే ఎందుకు నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బోల్డ్ గా భయపెట్టిన లైగర్

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్ షూటింగ్ దాదాపు పూర్తయింది. తాజగా లైగర్ నుండి ఒక స్టన్నింగ్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఈ...

ఎన్టీఆర్ కథ గోపిచంద్ కు

దర్శకుడు హరి మాస్ సినిమాల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. 'సింగం' ఆయన సక్సెస్ఫుల్ సిరిస్. ఈ సిరిస్ కి తెలుగులో కూడా ఆకట్టుకుంది. హరికి ఎప్పటి నుండో నేరుగా ఒక తెలుగు...

సీఎం జగన్ పేరుతో సైబర్ నేరాలు !

అప్పుడెప్పుడో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. కోట్లు కొట్టేయడానికి దర్జాగా కోల్‌కతా సూట్ కేస్ కంపెనీల పేరుతో చెక్‌లు జమ చేశారు. ఆ కేసు ఇంత వరకూ తేలలేదు. కానీ ఇప్పుడు...

ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ – పబ్లిసిటీ బడ్జెట్ కోట్లకు కోట్లే !

సోషల్ మీడియా సంస్థలకు.. మీడియా సంస్థలకు పండగ లాంటి సమయం ఇది. వద్దంటే రాజకీయ పార్టీలు కుప్పలు కుప్పలుగా ప్రకటనలు ఇస్తున్నాయి. రూ. కోట్లకు కోట్లు ఆదాయం తెచ్చి పెడుతున్నాయి. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close