సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు, మెత్తబడ్డ ఉద్యోగ సంఘాలు

ఏపీ పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఎన్నికలు ఇప్పుడు నిర్వహించాలంటూ కోర్టుకెక్కిన ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలకు సుప్రీంకోర్టు నిర్ణయం ఝలక్ అని చెప్పవచ్చు. అయితే దీని కంటే ముఖ్యంగా సుప్రీంకోర్టు ఉద్యోగ సంఘాలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే

ఎన్నికల కమిషనర్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నట్లుగా గత కొద్ది నెలలుగా జరుగుతున్న ఈ వివాదంలోకి ఇటీవల ఉద్యోగ సంఘాలు కూడా చొరబడ్డాయి. రాజకీయ పార్టీలకు సమానం గా ఎన్నికల కమిషనర్ ని టార్గెట్ చేస్తూ ఉద్యోగ సంఘాలు తీవ్ర వ్యాఖ్యలు చేశాయి. రాష్ట్రంలో కరోనా ఉన్న నేపథ్యంలో నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహించరాదంటూ ఉద్యోగ సంఘాలు ఆయనపై మండిపడ్డాయి. అవసరమైతే తాము మెరుపు సమ్మెకు దిగుతామంటూ ఎన్నికల కమిషనర్ ను బెదిరించే ప్రయత్నం చేశాయి. హైకోర్టు ఎన్నికల నిర్వహించుకోవచ్చు అని తీర్పు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం తో సమానంగా ఉద్యోగ సంఘాలు కూడా సుప్రీంకోర్టు కెక్కాయి.

అయితే సుప్రీంకోర్టు ఉద్యోగ సంఘాల పై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. ఎన్నికలు నిర్వహించడం అనేది ఎన్నికల కమిషనర్ యొక్క రాజ్యాంగ విధి అని ప్రస్తావిస్తూ, అసలు ఇందులో ఉద్యోగ సంఘాలకు ఏం సంబంధం ఉందని, ఎన్నికల కమిషనర్ ని టార్గెట్ చెయ్యాల్సిన అవసరం ఉద్యోగ సంఘాలకు ఎందుకు వచ్చిందని ఉద్యోగ సంఘాల పై తీవ్ర విమర్శలు చేసింది ధర్మాసనం. ఉద్యోగ సంఘాలు అప్పటికీ, కేరళలో ఎన్నికలు జరిగిన తర్వాత కరోనా కేసులు పెరిగాయని సుప్రీంకోర్టుకు గుర్తు చేయడానికి ప్రయత్నించాయి. దీని పై మండిపడ్డ ధర్మాసనం కేరళ లో కరోనా కేసులు పెరగడానికి ఎన్నికలు మాత్రమే కారణం అని మీరు ఎలా చేయగలరు అంటూ వారిని తిరిగి ప్రశ్నించింది. ఉద్యోగ సంఘాలతో పాటు అనేక సంఘాలు ఎన్నికల కమిషనర్ ను టార్గెట్ చేయడాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పు పట్టింది. అందరూ కలిసి మూకుమ్మడిగా ఎన్నికల కమిషనర్ టార్గెట్ చేయడం సబబు కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.

సుప్రీంకోర్టు తీర్పుకు ముందు ఎంతో ఆవేశంగా మాట్లాడిన ఉద్యోగ సంఘాలు, తీర్పు తర్వాత కాస్త మెత్తబడ్డట్టు కనిపించాయి. సుప్రీంకోర్టు తీర్పు రావడానికి ముందు, అవసరమైతే మెరుపు సమ్మెకు దిగుతామని ప్రగల్భాలు పలికిన ఉద్యోగ సంఘాలు, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మాత్రం తాము ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకం కాదు అని, అయితే ఎవరిని బలవంతం పెట్టవద్దు అని మాత్రమే తాము కోరుకుంటున్నామని, బలవంతంగా ఉద్యోగులని ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా చేయవద్దని ఉద్యోగ సంఘాల నాయకులు వ్యాఖ్యానించారు. ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని ఎన్నికల డ్యూటీ నుండి మినహాయించాలని మాత్రమే తాము కోరుతున్నాం అని ఉద్యోగ సంఘాలు వ్యాఖ్యానించాయి. నిజానికి ఆంధ్రప్రదేశ్లో చిన్న పిల్లలు స్కూల్ లకు సైతం ఇప్పటికే వెళున్నారు. ఉద్యోగుల ఉద్యోగ బాధ్యతలు, రెవెన్యూ రిజిస్ట్రేషన్లు వంటి అనేక అంశాలు యధావిధిగా జరుగుతూ ఉన్నాయి. ఇందులో వేటికి అడ్డురాని కరోనా సమస్య కేంద్రం ఎన్నికలకు మాత్రమే అడ్డు వస్తుందా అనే భావన ప్రజల్లో కూడా ఇప్పటికే ఉంది.

ఏది ఏమైనా ఇటీవలి కాలంలో ఉద్యోగ సంఘాల నాయకులు తమ ఉద్యోగం కంటే కూడా రాజకీయాల పట్ల ఆసక్తి ప్రదర్శించడం, అవసరమైతే రిటైర్మెంట్ అయ్యేలోపే ఎమ్మెల్సీ వంటి రాజకీయ పదవులు పొందు కోవడం పరిపాటిగా మారింది. మరి సుప్రీం కోర్టు తీర్పు తర్వాత అయినా ఉద్యోగ సంఘాలు , ఎన్నికల విషయంలో తమ విధులు తాము నిర్వహిస్తాయా అన్నది వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close