ఏపీ ఉద్యోగులకు దీపావళి సందర్భంగా డీఏలు మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎన్ని డీఏలు మంజూరు చేస్తారన్నది నేడో రేపో క్లారిటీ వచ్చే వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగసంఘాల నేతలతో మంత్రుల బృందం చర్చలు జరుపుతోంది. సానుకూలంగా స్పందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి ఇప్పటికే సూచించారు. అందుకే వారికి డీఏలు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్ లో ఉన్నాయి. వాటిలో రెండు అయినా మంజూరు చేస్తారని అనుకుంటున్నారు. పీఆర్సీ ఏర్పాటు చేయాలని కూడా ఉద్యోగసంఘాలు కోరుతున్నాయి. కానీ ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 2014లో ఏకంగా 43శాతం ఫిట్ మెంట్ ఇచ్చింది. మళ్లీ 2019లో 27 శాతం ఐఆర్ ఇచ్చి ఎన్నికలకు వెళ్లింది. కానీ ఉద్యోగులు వ్యతిరేకంగా పని చేశారు. అదే సమయంలో జగన్ వచ్చాక..ఆ ప్రభుత్వానికి ఉద్యోగసంఘాల నేతలు ఊడిగం చేశారు. ఫిట్ మెంట్ తగ్గించినా.. డీఏలు ఎగ్గొట్టినా ఏమీ మాట్లాడలేకపోయారు.
కానీ ఈ ప్రభుత్వం వచ్చాక మళ్లీ డిమాండ్లు వినిపిస్తున్నారు. కానీ ప్రభుత్వం.. వైసీపీ ప్రభుత్వంలా బెదిరింపులకు పాల్పడటం లేదు. పూర్తిగా వారి మొర ఆలకిస్తోంది. ప్రభుత్వానికి ఉన్న వెసులుబాటు ప్రకారం వారికి మేలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంలో పెట్టి పోయిన బకాయిలను చెల్లిస్తున్నారు.