తెలుగు రాష్ట్రాలకు దండిగా నిధులిచ్చిన కేంద్రం..!

కరోనాపై పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడా నిర్లక్ష్యం చూపకుండా.. నిధుల సమస్య అనే మాట వినపడకుండా.. కేంద్రం జాగ్రత్తలు తీసుకుంటోంది. గత ఆర్థిక సంతవత్సరం ముగింపు సందర్భంగా.. పధ్నాలుగో ఆర్థిక సంఘం నిధులతో పాటు.. పెండింగ్ నిధులన్నింటినీ రాష్ట్రాలకు ఇచ్చేసింది. తాజాగా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే కరోనాను ఎదుర్కొనేందుకు భారీగా నిధుల్ని విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలకు కలిపి రూ. పదకొండు వేల కోట్లపైగానే ఈ నిధులు విడుదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక నిధులు లభించాయి. విపత్తు నివారణ కోసం ప్రత్యేకంగా ఏపీకి రూ.559.5 కోట్లు, తెలంగాణకు 224.5 కోట్లు విడుదల చేసింది కేంద్రం. ఇది మొదటి విడతేనని తెలిపింది. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న కారణంగా క్వారంటైన్‌, శాంపిల్స్‌ సేకరణ, పరీక్షా కేంద్రాలు, సిబ్బంది కోసం.. నిధులను విడుదల చేస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

అలాగే.. 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు.. 14 రాష్ట్రాలకు రూ. 6,195 కోట్లను విడుదల చేసింది. లోటు ఉన్న రాష్ట్రాలకు ఈ మొత్తం పంచుతారు. ఏపీకి రూ.491.14 కోట్లు విడుదలయ్యాయి. తెలంగాణ లోటు ఉన్న రాష్ట్రం కాదు కాబట్టి.. ఎలాంటి సాయమూ లభించలేదు. మొత్తంగా.. ఏపీకి.. రూ. వెయ్యి కోట్ల వరకూ సాయం అందింది. తెలంగాణకు మాత్రం రూ. అందులో పావు వంతు మాత్రమే లభించింది. కరోనా కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్నామంటూ కొన్ని రాష్ట్రాలు ప్రధానమంత్రికి మొరపెట్టుకున్నాయి.అదే సమయంలో.. కరోనాను ఎదుర్కొనే విషయంలో రాష్ట్రాలు సొంత ఖర్చులు ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా.,. మొత్తం కేంద్రమే… పెట్టుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

జాతీయ విపత్తుగా ప్రకటించారు కాబట్టి.. విపత్తు నిధి కింద మొత్తం.. కేంద్రమే భరించబోతోంది. లాక్ డౌన్ కారణంగా రాష్ట్రాలకు ఆదాయం పడిపోయింది. దాన్ని కూడా భర్తీ చేయాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. ముందుగా కరోనాను తరిమికొట్టిన తర్వాత.. ఆర్థిక పరిస్థితులపై కేంద్రం దృష్టి సారించే అవకాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డాక్టర్ సుధాకర్‌పైనా సీబీఐ కేసు..!

నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసు దర్యాప్తులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. సీబీఐ ఆయనపైనా కేసు నమోదు చేసింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు, బాధ్యత కలిగిన ఓ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ...

మ‌రో బ‌యోపిక్ మిస్ చేసుకున్న నిత్య‌మీన‌న్‌

ఒక‌ప్పుడు తెలుగు నాట నిత్య‌మీన‌న్ హ‌వా బాగా న‌డిచింది. కాస్త ప్ర‌త్యేక‌మైన క‌థానాయిక పాత్ర‌లు ఆమె చుట్టూ చేరిపోయాయి. గ్లామ‌ర్ మాటెలా ఉన్నా, స‌ర‌దా న‌ట‌న‌తో ఆక‌ట్టుకునేది. అయితే ఇప్పుడు త‌న‌ని అంతా...

ప్ర‌భాస్ సినిమా: దేవుడు Vs సైన్స్‌

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ‌తో ఓ సినిమా చేస్తున్నాడు. 'జాన్‌', 'రాధే శ్యామ్‌' పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. న‌వంబ‌రు నుంచి వైజ‌యంతీ మూవీస్‌కి డేట్లు ఇచ్చాడు. ఈ చిత్రానికి నాగ అశ్విన్ నిర్మాత‌. పాన్...

ఫ్లాష్ బ్యాక్‌: సూప‌ర్ స్టార్స్ అడిగితే సినిమా చేయ‌నన్నారు

ఓ స్టార్ హీరో పిలిచి - ఓ కొత్త ద‌ర్శ‌కుడికి అవ‌కాశం ఇస్తే, కాదంటాడా? చేయ‌నంటాడా? ఎగిరి గంతేస్తాడు. త‌న ద‌గ్గ‌ర క‌థ లేక‌పోయినా అప్ప‌టిక‌ప్పుడు వండేస్తాడు. మీతో సినిమా చేయ‌డంతో నా జ‌న్మ ధ‌న్యం అంటాడు....

HOT NEWS

[X] Close
[X] Close