పేరు గ్లోబల్ సమ్మిట్… ప్రచారం అంతా లోకల్లోనే !

హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వం ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ రోడ్ షో పేరుతో   స్టార్ హోటల్లో భారీగా ఖర్చుతో ఓ సమావేశం నిర్వహించింది. ఇందులో  టీవీ చానళ్లలో బ బూతులు మాట్లాడే రవిచంద్రారెడ్డి అనే పెద్ద మనిషి , కోడి గుడ్డు కథలు చెప్పే గుడివాడ అమర్నాథ్ , ఇన్వెస్టర్లను మోసం చేయడానికి ఒకే రాజధాని అని చెబుతామని నేరుగా చెప్పే బుగ్గన రాజేంద్రనాత్ ెడ్డి పాల్గొన్నారు.  చెప్పాల్సింది చాలా చెప్పారు.. కానీ వారు చెప్పింది మొత్తం విశాఖ గురించే. విశాఖలో పెట్టుబడులకు రావాలని పిలుపునిచ్చారు. ప్రపంచ స్థాయి నగరంగా విశాఖను మారుస్తామని పెట్టుబడులు పెట్టాలని అంటున్నారు. వీరి తీరు చూసి..  విశాఖకే పెట్టుబడులు కోరడం ఏమిటని పారిశ్రామికవేత్తలు కూడా విస్తుపోవాల్సి వచ్చింది.

విశాఖలో  ఇన్వెస్టర్స్ సమ్మిట్ పెడుతున్నారంటే.. అర్థం విశాఖలో పెట్టుబడులు పెట్టాలని కాదు.  ఏపీ మొత్తానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు విశాఖలో సమ్మిట్ ఏర్పాటు చేస్తున్నారు.  ఏపీలో గొప్ప  మౌలిక సదుపాయాలు ఉన్నాయని చెబుతారు కానీ.. చివరికి విశాఖలోనే పెట్టుబడిపెట్టండని పిలుపునిస్తున్నారు. ప్రభుత్వానికి అసలు ఇన్వెస్టర్ల సమ్మిట్ ఉద్దేశం ఏమిటో కూడా స్పష్టత లేదన్న అభిప్రాయం  హైదరాబాద్ సమావేశానికి వచ్చిన చాలా మంది పారిశ్రామిక వేత్తలకు ఏర్పడిపోయింది.

ఏపీలో ఏం జరుగుతుందో ముంబై , ఢిల్లీ పారిశ్రామికవేత్తలకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ తెలంగాణలో ఉన్న వారందరికీ తెలుసు.  వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  అస్మదీయులైన పారిశ్రామికవేత్తలు ఆలోచన ఉన్నా లేకపోయినా జగన్ పాలన మెచ్చామని ప్రకటించేసి… కొన్ని పెట్టుబడులు ప్రకటించకుండా ఉండరు. అయినా ఎందుకు  హైదరాబాద్‌ లో రోడ్ షో పెట్టి విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని పిలుపునిచ్చారన్నది కూడా సస్పెన్స్ గానే మిగిలింది. అసలు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అని చెప్పి…. ఇక్కడిక్కడే ప్రచారం చేయడం ఏమిటనే సందేహాలు కూడా అందరికీ వస్తున్నాయి. ఈ ప్రభుత్వం ఆలోచనా పరిధి అంతే ఉందని సరి పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నిప్పుల కుంపటిలా తెలంగాణ..

తెలంగాణ నిప్పుల కొలిమిలా మారింది. రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు మరింత ముదురుతున్నాయి. భానుడు ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరో నాలుగైదు రోజులపాటు వేసవి తీవ్రత ఇలాగే ఉంటుందని.. ఎండతోపాటు వడగాడ్పులు వీస్తాయని వాతావరణ...

రేవంత్ కు హైకమాండ్ అభినందనలు..ఎందుకంటే..?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ ప్రశంసల జల్లు కురిపించినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో రేవంత్ లేవనెత్తుతోన్న అంశాల ఆధారంగా కాంగ్రెస్ గ్రాఫ్ జాతీయ స్థాయిలో పెరుగుతోందని రేవంత్ పని తీరును...

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close