తెలంగాణ చిహ్నంతో ఏపీ ప్రభుత్వ ప్రకటన, తప్పుపట్టిన నెటిజన్లు, జనసేన ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ అనేక పత్రికలలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చింది. ” ఇవి పార్టీ రహిత ఎన్నికలు, పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఎన్నికలు, మన పంచాయతీ ఎన్నికలు. పంచాయతీలు ఏకగ్రీవం చేసుకుందాం, గ్రామాభివృద్ధికి సోపానాలు వేసుకుందాం” అంటూ సాక్షి సహా అనేక పత్రికలలో వచ్చిన ప్రకటన ఇప్పటికే విమర్శలకు తావిచ్చింది. మొదటిగా పంచాయతీలను ఎన్నుకునే అధికారాన్ని ప్రజల చేతుల్లో పెట్టకుండా ఏకగ్రీవం పేరుతో అధికార పార్టీ తమకు అనుకూలమైన అభ్యర్థులను ఎన్నిక చేయించుకోవడానికి ప్రయత్నిస్తోందని ఇతర పార్టీల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే దానితో పాటు, గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎంబ్లెమ్ కూడా సరి చూసుకోకుండా ప్రకటన ఇవ్వడం మరొక విమర్శకు తావిచ్చింది. వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలో పంచాయతీలకు సంబంధించిన చిహ్నాన్ని మూడు చోట్ల వాడారు. వీటిల్లో పై రెండింటిలో సరిగానే ఉన్నప్పటికీ, మూడవ ఎంబ్లెమ్ మాత్రం తెలంగాణకు చెందిన గ్రామ పంచాయతీ కార్యాలయానికి సంబంధించిన లోగోని వాడారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ, లక్షల్లో జీతాలు తీసుకుంటున్న మీడియా సలహాదారులు కనీసం ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ చిహ్నం ఏదో కూడా తెలియకుండా పనిచేస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు. జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ కూడా దీనిపై సోషల్ మీడియాలో స్పందిస్తూ, “కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏపీ ప్రభుత్వం వారు ఇచ్చిన ప్రకటనలో తెలంగాణ కు చెందిన గ్రామ పంచాయతీ కార్యాలయ ఫోటో ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? ఆ పంచాయతీ కార్యాలయ చిహ్నంలో తెలంగాణ ప్రభుత్వం చిహ్నం మీరే చూడండి. అంటే పబ్లిసిటీ చేసుకోవడానికి అధికారులకి ఏపీలో గ్రామ పంచాయతీ భవనాల ఫోటోలే దొరకలేదంటారా??” అని రాసుకొచ్చారు.

టీవీ చానల్స్ లో దీనిపై కథనం ని ప్రసారం చేయకపోయినప్పటికీ, అనేక మంది జర్నలిస్టులు కూడా ఈ ప్రకటన చూసి నవ్వుకుంటున్నారు. కనీసం ఆంధ్రప్రదేశ్ చిహ్నానికి, తెలంగాణ చిహ్నానికి తేడా కూడా తెలియకుండా అధికారులు, మీడియా సలహాదారులు పని చేస్తున్నారంటూ వారు విమర్శిస్తున్నారు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close