పవన్ సూచనకు ఓకే చెప్పిన ఏపీ సర్కార్!

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి భూసేకరణకోసం భూసేకరణ చట్టాన్ని ఉపయోగించొద్దని పవన్ కళ్యాణ్ నిన్న ట్విట్టర్ ద్వారా చేసిన సూచనకు టీడీపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రాజధాని నిర్మాణానికి అవసరమయ్యే భూమిని రైతులకు ఇబ్బందిలేని పద్ధతుల్లోనే సేకరిస్తామని రాష్ట్ర పురపాలకశాఖమంత్రి నారాయణ స్పష్టంచేశారు. జనసేన అధినేత చేసిన సూచనను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. అమరావతి నిర్మాణంపై ఈ ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధాని సలహా మండలితో విజయవాడలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత నారాయణ మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కోరినట్లే రైతులెవరికీ ఇబ్బంది కలగనిరీతిలోనే ల్యాండ్ పూలింగ్ చేపడతామని చెప్పారు. ఈనెల 20వ తేదీలోగా ల్యాండ్ పూలింగ్‌కు రైతులు ముందుకు రావాలని సూచించారు. ఇప్పటివరకు రాజధానికోసం 34వేల ఎకరాలు సేకరించామని, మరో 2,200 ఎకరాలు అవసరమని తెలిపారు. రాజధాని ప్రకటన తర్వాత భూమి ధర భారీగా, 20 రెట్లు పెరిగిందని చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎర్రబెల్లి సైలెన్స్ ఎందుకబ్బా..!!

బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కు అత్యంత సన్నితుడిగా పేరొందిన ఎర్రబెల్లి దయాకర్ ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఆ మధ్య ఆయన కాంగ్రెస్ లో చేరుతారని జోరుగా...

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close