నిర్మల చెప్పిన కరెంట్ వద్దంటున్న ఏపీ సర్కార్..!

కరెంట్‌ యూనిట్‌ను తాము రూ. 2.70కి ఇస్తూంటే.. ఏపీ సర్కార్ రూ. తొమ్మిదికిపైగానే ప్రజలకు అమ్ముకుంటోందంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ సర్కార్‌కు మంట పుట్టించాయి. రాజకీయంగా ఆమె చేసిన విమర్శలను.. రాజకీయంగా ఏ ఒక్కరూ… ఖండించలేకపోయారు. కానీ సలహాదారుడు… కల్లాం అజేయరెడ్డిని మాత్రం తెర ముందుకు తీసుకు వచ్చి.. కొన్ని లెక్కలు చెప్పించారు. కానీ.. అవేమీ ప్రజల్లోకి వెళ్లలేదు. దీంతో.. కేంద్రానికి ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించుకున్న ఏపీ సర్కార్.. కొత్త దారిలో వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. అసలు కేంద్రం ఇస్తున్న కరెంట్ వద్దని.. లేఖ రాసింది. దీనికి కారణంగా.. ఆ కరెంట్ యూనిట్‌కు తమకు రూ. పది రూపాయలనే ఖర్చు అవుతోందని.. అంత కంటే తక్కువకే మార్కెట్లో తమకు దొరుకుతోందని రాష్ట్రం చెబుతోంది.

కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పినట్లుగా కాకుండా.. చాలా ఎక్కువ మెత్తానికి కేంద్రం కరెంట్ ఇస్తోందని చెప్పడానికి ఏపీ సర్కార్ ఈ వ్యూహం పన్నినట్లుగా విద్యుత్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం విద్యుత్‌ వాడకం తగ్గిపోయినందున కేంద్ర ప్రభుత్వరంగ ఎన్టీపీసీ ద్వారా రాష్ట్రానికి కేటాయించిన థర్మల్‌ విద్యుత్‌ భారంగా మారినందువల్ల ఆ కేటాయింపును రద్దు చేయాలని కేంద్రానికి ట్రాన్స్‌కో వినతులు పంపింది.కర్ణాటక, తమిళనాడుల్లోని రెండు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నుంచి విద్యుత్‌ కొనుగోలుకు 2008, 2010 సంవత్సరాల్లో పీపీఏలు అప్పటి ప్రభుత్వాలు చేసుకున్నాయి. వాటి నుంచి తీసుకొనే విద్యుత్‌ ధర ఒక యూనిట్‌ రూ.10 పడుతోందని..ఇది బాగా భారం అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అందుకే పీపీఏల నుంచి మేము వైదొలగాలని అనుకొంటున్నామని అనుమతించాలని కోరారు.

విద్యుత్ రంగం … లెక్కలు సంక్లిష్టతలతో ఉంటాయి. విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ల మార్గదర్శకత్వంలో కంపెనీలతో పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లు చేసుకుంటారు. వాటిని మధ్యలో మార్చడం.. వైదొలగడం సాధ్యం కాదు. ఆ ఒప్పందాల ప్రకారం స్థిర చార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏపీ సర్కా‌ర్ అధికారంలోకి రావడంతోనే.. సౌర విద్యుత్ సంస్థల పీపీఏలు రద్దు చేయాలని ప్రయత్నించింది. ఇప్పుడు ఏకంగా.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీపీఏలనే రద్దు చేయాలని కోరుతోంది. ఏపీ సర్కార్ విజ్ఞప్తిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వెబ్ సిరీస్‌లు మ‌నకెక్కుతాయా?

ఇప్పుడు ఎవ‌రు చూసినా వెబ్ సిరీస్ ల గురించే మాట్లాడుతున్నారు. స్టార్లంతా అటువైపే చూస్తున్నారు. సినిమాకి మ‌రో గ‌ట్టి ప్ర‌త్యామ్నాయం వ‌చ్చింద‌ని బ‌లంగా న‌మ్ముతున్నారు. నిర్మాణ సంస్థ‌లు అటువైపే, హీరోల చూపూ అటుకేసే....

రద్దయ్యే మండలిలో ఎవరికి పదవులు ఇస్తే ఏంటి..!?

వైసీపీలో శాసనమండలి పదవుల చర్చ నడుస్తోంది. మొత్తం నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినప్పటికీ.. ఒక స్థానం సమయం కేవలం 9 నెలలు మాత్రమే ఉండటంతో..ఎన్నిక జరగదు. మరో మూడు స్థానాల్లో రెండు...

న్యూ ఐడియా: ట్రైల‌ర్‌కీ టికెట్టు

ఎడారిలో ఇసుక అమ్మే తెలివితేట‌లు అచ్చంగా రామ్ గోపాల్ వ‌ర్మ సొంతం. ఓ సీ గ్రేడ్ షార్ట్ ఫిల్మ్ తీసి, దానికి వంద‌, రెండొంద‌లు టికెట్టు పెట్టి, ప్రేక్ష‌కుల నుంచి ఎంతో కొంత...

ఆర్ఆర్ఆర్ మరో లేఖ : భవన నిర్మాణ కూలీలకు సాయం ఏదీ..?

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం పేరుతో.. వారికి సంబంధించిన సొమ్మును ప్రభుత్వం రూ. 1364 కోట్లు వసూలు చేసిందని... అయినా ఈ సంక్షోభ సమయంలో.. వారిని ఎందుకు ఆదుకోవడం లేదని.. నర్సాపురం ఎంపీ...

HOT NEWS

[X] Close
[X] Close