ప్రభుత్వం పరువు తీస్తున్న ఓటీఎస్ ! ఇప్పటికైనా గుర్తిస్తారా ?

ఓటీఎస్ కింద పేదల దగ్గర రూ. పది వేలు.. పట్టణ ప్రాంతాల్లో రూ. ఇరవై వేలు వసూలు చేస్తున్న ప్రభుత్వం వాటిని కట్టలేకపోతున్న పేదల్ని వదిలి పెట్టడం లేదు. అయితే అప్పు ఇస్తాం.. అంటోంది…లేకపోతే వాయిదాల పద్దతిలో కట్టుకోమని సలహాలిస్తోంది. ఈ మేరకు కేబినెట్‌లోనూ నిర్ణయం తీసుకున్నారు. అంత వరకూ బాగానే ఉన్నా..అసలు ఓటీఎస్ వసూలు చేసేందుకు సిబ్బంది పేదల ఇళ్లపైకి వెళ్తున్న తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు కారణం అవుతోంది. ఇటీవల ఓటీఎస్ విషయంలో వరుసగా వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి.

ఈ వీడియోల్లో డబ్బులు ఎక్కడ కడతామని పేదలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం పక్కన పెడితే.. అసలు డబ్బు వసూలు చేయడానికి కనీసం పది మంది వెళ్లడమే అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు.. చివరికి మహిళా పోలీసును కూడా తీసుకెళ్తున్నారు. వడ్డీ వ్యాపారుల తరహాలో పేదలను వేధిస్తున్నారు. ఇవ్వాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నారు. ఎంత చెప్పినా ఇవ్వకపోతే.. మళ్లీ వస్తాం.. ఇలాంటి వేధింపులే ఉంటాయి.. డబ్బు రెడీ చేసుకోమని చెప్పి వెళ్తున్నారు. ఈ తరహా డబ్బుల వసూలు ప్రక్రియ నిరుపేదల్ని సైతం తీవ్ర అవమానాలకు గురయ్యేలా చేస్తోంది.

ఎప్పుడో ఇరవై ఏళ్ల కింద ఇచ్చి.. పట్టించుకోని రుణాలకూ ఇప్పుడు ఇలా వసూళ్లు చేయడం కాకుండా.. పది మందికిపైగా ఇంటిపైకి పంపడం ఏమిటన్న చర్చ.. ఆ గ్రామం మొత్తం సాగుతోంది.నిజానికి ఓటీఎస్ స్వచ్చందమని సీఎం జగన్ చెప్పారు. దీంతో చాలా మంది తమ దగ్గర డబ్బుల్లేవంటున్నారు. కానీ స్వచ్చందం కాదు నిర్బంధమని ఇలా పది మందికిపైగా పేదల ఇళ్ల మీదకు వెళ్లి రచ్చ చేస్తున్నారు. నిరుపేదల్ని ఇంత దారుణంగా పీడించి డబ్బు వసూలు చేసి ప్రభుత్వం ఏం సాధిస్తుందన్న చర్చ వైసీపీ నేతల్లోనే సాగుతోంది. ఇలాంటి వీడియోలు.. ఇలా డబ్బులు వసూలు చేసే పద్దతి ప్రభుత్వ పరువు తీస్తోందని గగ్గోలు పెడుతున్నారు. కానీ వినిపించుకునే పరిస్థితిలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలోనూ మసీదులు తవ్వుదామంటున్న బండి సంజయ్ !

బండి సంజయ్ ఏ మాత్రం మొహమాటలు పెట్టుకోవడం లేదు. ముందూ వెనుకా ఆలోచించడం లేదు. తన రాజకీయం తాను చేస్తున్నారు. యూపీలో జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడిందని.. తెలంగాణలోనూ అదే వాదన...

అనంతబాబు సస్పెన్షన్ – గౌతంరెడ్డిని చేసినట్లుగానేనా!?

ఎమ్మెల్సీ అనంతబాబును చేయలేక.. చేయలేక సస్పెండ్ చేశారు వైఎస్ఆర్‌సీపీ అగ్రనేతలు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే నిజంగానే సస్పెండ్ చేశారో లేకపోతే.. గతంలో వంగవీటి రంగాపై...

మా పార్టీ నేతలపై దాడులు చేసుకుంటామా ?: సజ్జల

అమలాపురం దాడుల వెనుక వైసీపీ నేతల కుట్ర ఉందన్న తీవ్ర ఆరోపణలు వస్తూండటంతో ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెరపైకి వచ్చారు. విపక్షాల విమర్శలు చూస్తుంటే... నవ్వొస్తుంది... అధికార పార్టీ నేతలప ఇళ్లపై...

మళ్లీ జగన్‌ను దారుణంగా అవమానించిన టీఆర్ఎస్ మంత్రి !

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దావోస్‌లో కేటీఆర్‌తో భేటీ అయి... తమ మధ్య మంచి ర్యాపో ఉందని నిరూపిస్తూంటే తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ నేతలు దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close