స్మశానాల్లో ఇళ్లు వద్దని కోర్టు చెప్పాలా !?

ఏపీ సర్కార్ నిర్వాకాలు వింటూంటే.. ఇలా కూడా చేస్తారా అన్న సంభ్రమాశ్చర్యలకు లోను కావాల్సిన పరిస్థితి. ఎస్సీ స్మశాన వాటికల్లో సెంటు స్థలాలను ఏపీ సర్కార్ పంపిణీ చేసింది. దాంట్లో ఇళ్లు కట్టుకోవాలని లబ్దిదారులపై ఒత్తిడి తెస్తోంది. అయితే స్మశానాల్లో ఇళ్ల స్థలాలేమిటని కొంత మంది కోర్టుకెళ్లారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపింది హైకోర్టు.శ్మశాన వాటికల్లో ఇళ్ల నిర్మాణం దారుణమని పిటిషనర్‌ తరఫు న్యాయవాది జడ శ్రావణ్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. న్యాయవాది శ్రవణ్‌ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. ఎస్సీ శ్మశాన వాటికల్లో ఆర్బీకేలు, జగనన్న ఇళ్ల నిర్మాణాలు చేపట్టవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.

ఏపీ ప్రభుత్వ స్మశానాలనే కాదు.. ఏ స్థలం దొరికితే ఆ స్థలాన్ని.. సెంట్ స్థలాలుగా మార్చింది. ప్రైవేటు స్థలాలను ఎందుకు కొరగాని వాటిని.. మునిగిపోయేవాటిని.. మౌలిక సదుపాయాలు కల్పించని వాటిని పంపిణీ చేసింది. అందుకే అలాంటి స్థలాల్లో ఎవరూ ఇళ్లు కట్టుకోవడం లేదు. ఇప్పటికే చాలా వివాదాస్పదమైన భూముల్లో కేటాయింపులకు.. హైకోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు శ్మశానాల్ోల ఇళ్ల కేటాయింపును కూడా హైకోర్టు అడ్డుకుంది. అయినా అసలు హైకోర్టు అడ్డుకోవడం సరే కానీ.. అలాంటి చోట్ల ఏ ప్రభుత్వమైనా పేదలకు స్థలాలు ఇవ్వాలని ఎందుకుని అనుకుంటుందనేది ఇప్పుడు అందరికీ వస్తున్న సందేహం.

ఓటు బ్యాంక్‌ను పటిష్టం చేసుకోవడానికి సెంట్ స్థలం అంటూ పంపిణీ చేసిన ప్రభుత్వం సగం మందికి స్థలాలు చూపించలేదు. మిగిలిన సగం చోట్ల నిర్మాలు ప్రారంభం కాలేదు. తామే కట్టిస్తామన్న ప్రభుత్వం చివరికి చేతులెత్తేసింది. లబ్దిదారులే కట్టుకోవాలని చెబుతోంది. చివరికి వారికి స్మశానాల్లోనూ కేటాయించారు. ప్రభుత్వానికి పేదల పట్ల కనీస బాధ్యత ఉన్నా.. ఇలా చేయరన్న వాదన వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close