వైరస్ గురించి చెప్పారని చంద్రబాబుపై క్రిమినల్ కేసులు..!

ప్రతిపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు కాలు కదిపితే.. నోరు మెదిపితే కేసు అన్నట్లుగా ఏపీ సర్కార్ వ్యవహరిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఎన్‌-440కే పుట్టిందని… అది శరవేగంగా విస్తరిస్తోందని… ఈ విషయాన్ని సీసీఎంబీ ప్రకటించిందని… చంద్రబాబు ప్రెస్‌మీట్లలో చెప్పారు. ఇంగ్లిష్ మీడియాలోనూ పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. సీసీఎంబీ రిపోర్టులతో తెలుగు రాష్ట్రాల ప్రజలు నెగెటివ్ రిపోర్టులు ఉంటే మాత్రమే తమ రాష్ట్రాల్లోకి రావాలని ఆంక్షలు విధించాయి. అయితే అలాంటి వేరియంట్ ఏదీ లేదని.. అంతా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ సర్కార్ చంద్రబాబుపై ఎదురుదాడికి దిగింది.

అది సరిపోలేదని అనుకున్నారేమో కానీ.. ఏకంగా క్రిమినల్ కేసులు పెట్టేసింది. సుబ్బయ్య అనే వ్యక్తి ఫిర్యాదు ఇచ్చారంటూ చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసారు. కర్నూలులో ఎన్‌-440కే వైరస్‌ ఉందన్న చంద్రబాబు వ్యాఖ్యలతో.. సామాన్య జనాలు భయాందోళనకు గురవుతున్నారని సుబ్బయ్య ఆందోళనగా వచ్చి ఫిర్యాదు చేయడంతో.. ఐపీసీ 155, 505(1)(బి)(2) సెక్షన్ల కింద చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేసేశారు. చంద్రబాబుపై 2005 ప్రకృతి వైపరీత్యాల చట్టంలోని సెక్షన్‌ 54 కింద కేసు పెట్టారు. చంద్రబాబుపై ఎఫ్ఐఆర్‌ రిజిస్టర్ చేసేశారు. టీడీపీ నేతలను కేసులు పెట్టి వేధించడానికి కర్నూలు వైసీపీ నేతలకు బాగా అచ్చి వచ్చినట్లుగా ఉంది.

ఇప్పటికే దేవినేని ఉమపై కేసు పెట్టారు. ఇప్పుడు చంద్రబాబుపై కేసు పెట్టారు. రాజధాని భూముల విషయంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారని ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేసిన పోలీసులు ఈసారి.. వైరస్ గురించి మాట్లాడినందుకు కేసులు పెట్టేశారు. ఏపీలో టీడీపీ నేతలపై సాగుతున్న కేసుల పరంపరంలో ఇదొక మచ్చు తునకేనని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close