ఏపీ సర్కార్ నిమ్మగడ్డకు ధరఖాస్తు చేసుకోవాల్సిందే..!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నుంచి సవరణ తెచ్చుకోవాలనుకున్న ఏపీ సర్కార్‌కు ఎదురు దెబ్బ తగిలింది. మొదటి సారి స్థానిక ఎన్నికలను ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వాయిదా వేసినప్పుడు ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ సందర్భంగా.. కోడ్ ఎత్తివేస్తూ.. సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే.. .అభివృద్ధి పనుల విషయంలో మాత్రం ఎస్‌ఈసీ అనుమతి తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలను సవరించాలంటూ.. ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.   ఏపీ సర్కార్ తరపున  ముకుల్ రోహత్గీ వాదించారు. ఎన్నికల సంఘం ఏమైనా అభివృద్ధి పనులను ఆపిందా అని ధర్మాసనం రోహత్గీని ప్రశ్నించింది.
ఎలాంటి అభివృద్ధి పనులు ఆపలేదు కానీ… కొత్తగా ఎన్నికల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని రోహత్గి కోర్టుకు తెలిపారు. అసలు కోడ్ అమలులో లేనప్పుడు ఈసీ అనుమతిని  ప్రభుత్వం ఎలా తీసుకుంటుందని రోహత్గి  ప్రశ్నించారు. అయితే.. ఎన్నికలు రద్దు చేయలేదని ..   వాయిదా మాత్రమే వేశామని ఈసీ తరపు లాయర్‌ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న సుప్రీం కోర్టు అభివృద్ధి పనులకు ఈసీకి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. అనుమతి ఇవ్వకపోతే సుప్రీంకోర్టులో అప్లికేషన్ దాఖలు చేసుకోవాలని సలహా ఇచ్చింది.తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఏపీ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి పనులకు కానీ.. స్కీమ్స్‌కు కానీ..  ఎస్‌ఈసీ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అసలు అలాంటి పర్మిషన్ తీసుకుంటున్న అంశంపైనా స్పష్టత లేదు. అయినప్పటికీ.. ఏపీ సర్కార్ ఏదో ఆశించి సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇప్పుడు తప్పనిసరిగా ఎస్‌ఈసీ నుంచి అన్నింటికీ ఆమోదం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘విశ్వంభ‌ర‌’లో ప‌వ‌న్‌.. అంత సీన్ ఉందా?

చిరంజీవి న‌టిస్తున్న సోషియో ఫాంట‌సీ చిత్రం 'విశ్వంభ‌ర‌'. వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో త్రిష క‌థానాయిక‌. ఈ చిత్రంలో చిరంజీవి భీమ‌వ‌రం దొర‌బాబుగా, ఐదుగురు చెల్లెమ్మ‌ల‌కు అన్న‌య్య‌గా క‌నిపించ‌నున్నారు. దాదాపు 40...

రివర్స్ ప్రచారం : మేనిఫెస్టో గురించి చెప్పుకోలేని జగన్ !

అధికార పార్టీ నేతగా.. సీఎంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న జగన్ ప్రచారసభల్లో ఏం చెబుతున్నారు ?. మళ్లీ గెలిస్తే ఏం చేస్తానో చెబుతున్నారా ?. తన మేనిఫెస్టో...

కడప లోక్ సభ రివ్యూ : కొంగు సెంటిమెంట్ ఫలిస్తే సంచలనమే !

కడప లోక్ సభ బరిలో " ఎలగైనా అవినాష్ రెడ్డే గెలుస్తారు " అని వైసీపీ నేతలు ధీమాగా చెప్పుకుంటున్నారు. ఎలాగైనా అనే పదం వాడతూ వ్యక్తం చేస్తున్న...

‘స‌లార్ 2’… రెడీ టూ షూట్‌!

ప్ర‌భాస్ మూడ్ మొత్తం సినిమాల‌పైనే ఉంది. ఏమాత్రం గ్యాప్ లేకుండా, షూటింగులు చేసుకొంటూ వెళ్లిపోతున్నాడు. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ 'క‌ల్కి'తో బిజీగా ఉన్న ప్ర‌భాస్‌, ఆ త‌ర‌వాత 'రాజాసాబ్' కు కొన్ని డేట్లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close