“పీపీఏ” ఊబిలో ఏపీ సర్కార్..! బయటపడేదెలా..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించిన మొదటి టార్గెట్ పీపీఏలు. అంటే పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లు. వీటిల్లోవేల కోట్ల అవినీతి జరిగిందని.. సమీక్షించి రద్దు చేసి.. తాము వేల కోట్లు మిగిలిస్తామని ప్రమాణస్వీకార వేదిక నుంచే ఘనంగా ప్రకటించారు. ఆ తర్వాత ఆ దిశగా ముందడుగు వేసి.. ఇప్పుడు…ఆ వివాదం నుంచి ఎలా బయటపడాలా.. అని తీవ్రంగా ఆలోచిస్తున్నారు. విద్యుత్ కంపెనీలు న్యాయపరమైన చర్యలు తీసుకోకుండా… ఎలా ఆపాలి..? తమ విధానంపై కేంద్రానికి ఏమని సమాధానం చెప్పాలి..? అన్న అంశంపై.. ఇప్పుడు ప్రధానంగా చర్చలు జరుపుతున్నారు.

విద్యుత్ కంపెనీలు కోర్టుకెళ్తే ఏం చేయాలి..?

పీపీఏలపై జగన్ నియమించిన ఉన్నత స్థాయి సోమవారం గోప్యంగా సమావేశమయింది. ఈ సమావేశానికి డీజీపీ, విజిలెన్స్, న్యాయ విభాగాల అధిపతుల్ని కూడా పిలిపించినట్లు సమాచారం. ఈ భేటీ ఎజెండాలో ప్రధానంగా.. విద్యుత్ సంస్థలు.. పవర్ ట్రిబ్యునల్‌లో కేసులు వేస్తూండటం… త్వరలో.. ఏపీ సర్కార్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేస్తూండటంపై తీవ్రమైన చర్చ జరిగింది. విద్యుత్ కంపెనీలు పంపిన హెచ్చరిక లేఖలను.. పరిశీలించిన అధికారులు… ఘర్షణ వైఖరితో వెళ్తే మొదటికే మోసం వస్తుందని ఆందోళన చెందారు. అందుకే.. అన్ని కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం ఏమిటో సవివరంగా చెబుతూ.. లేఖ రాయాలనుకుంటున్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యానే సమీక్షలు చేస్తున్నామనే వాదనను లేఖలో వివరించాలని నిర్ణయించుకున్నారు. విద్యుత్ సంస్థలు తీసుకునే అవకాశం ఉన్న న్యాయ, చట్టపరమైన చర్యలపైనా సమావేశంలో చర్చ జరిగింది. ఎలా ముందుకెళ్లాలో అధఇకారులు చర్చించారు.

చేతనయింది చేసుకోమంటున్న విద్యుత్ కంపెనీలు..!

ఏపీ సర్కార్‌తో పీపీఏలు కుదుర్చుకున్న విద్యుత్ కంపెనీలను.. కొద్ది రోజులుగా ఉన్నత స్థాయి కమిటీ సమీక్షకు పిలుస్తోంది. వచ్చిన వారిని… ధరలు తగ్గించాలని ఒత్తిడి చేస్తున్నారు. చంద్రభాషలో చెప్పాలంటే.. పులివెందుల పంచాయతీల తరహాలో.. విద్యుత్ కంపెనీల ప్రతినిధులకు.. ధరలు తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా సమీక్షకు రావాలని నోటీసులు అందుకున్న కంపెనీల్లో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఉన్నాయి. ఇవి కేంద్ర ప్రభుత్వ కంపెనీలు. ఈ కంపెనీలు ఏపీ సర్కార్ పరువు తీసేలా లేఖలు పంపాయి. రెండు సంస్థలు తాము సమీక్షకు హాజరయ్యే ప్రసక్తేలేదని స్పష్టం చేశాయి. అంతే కాదు.. సమీక్ష జరిపితే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించాయి. ఈ ప్రతిస్పందన ఊహించలేని ఏపీ సర్కార్ షాక్‌కు గురయింది.

ఎలా బయటపడాలో ఆలోచిస్తున్న ఏపీ సర్కార్..?

ఇప్పటికే పీపీఏలు కుదుర్చుకున్న కొన్ని ప్రైవేటు సంస్థలు కేంద్ర విద్యుత్ ట్రిబ్యునల్ కు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం పీపీఏలపై సమీక్షించటాన్ని సవాల్ చేశాయి. దీంతో ట్రిబ్యునల్ విచారించి సంస్థల టారిఫ్ పై సమీక్షించటాన్ని నిలిపివేయాల్సిందిగా స్టే ఇచ్చింది. మూడు సంస్థలకు ఈ విధంగా స్టే లభించింది. పైగా ట్రిబ్యునల్ తన ఉత్తర్వుల్లో పీపీఏల టారిఫ్ నిర్ణయం ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీ పరిధిలో ఉంటుందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధంలేదని పేర్కొనడంతో, పీపీఏలను కుదుర్చుకున్న మిగతా కంపెనీలు కూడా సమీక్షకు వచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. కేంద్రం రెండు సార్లు హెచ్చరించినా.. జగన్ మొండిపట్టుదలకు పోవడంతో.. వివాదంలో ఇరుక్కుపోతున్న పరిస్థితి కనిపిస్తోందని.. ఏపీ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడీ.. వివాదం నుంచి బయటకు రావడం అంత తేలిక కాదంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close