ఏపీ సర్కార్ వారి రహస్య జీవోల పరంపర..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారదర్శకతకు పెద్ద పీట వేశామని చెబుతోంది…కానీ పాలనలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. కేవలం.. ఆరు అంటే.. ఆరు నెలల్లో రహస్య జీవోలు పెద్ద ఎత్తున రిలీజ్ చేయడమే దీనికి కారణం. జీవో రిలీజ్ చేసినట్లుగా..ఆ జీవో నెంబర్ ఉంటుంది కానీ.. అందులో ఉన్న మ్యాటర్ ఏంటో మాత్రం.. కాన్ఫిడెన్షియల్‌గా ఉంచుతున్నారు. ఇప్పటికీ… ఆ జీవోల వివరాలేమిటో బయటకు రావడం లేదు.

రెవిన్యూలోనే రహస్యాలు ఎక్కువ..!

ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విడుదలైన రహస్య జీవోల్లో అత్యధికం.. రెవిన్యూ శాఖ నుంచే వచ్చాయి. ఈ శాఖ దాదాపుగా 31 జీవోల్లోని వివరాలను కాన్ఫిడెన్షియల్‌గా పేర్కొంది. అంటే.. సగటున.. నెలకు ఐదు జీవోలు ఇలా కాన్ఫిడెన్షియల్‌గా ఉన్నాయి. ఆ తర్వాత పంచాయతీరాజ్ శాఖలో పది, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో మరో పది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో మరో పది జీవోలు కాన్ఫిడెన్షియల్‌గా రిలీజ్ చేశారు. వాటిలో ఏముందోఇంత వరకూ బయటకు తెలియలేదు. కానీ ఆ ఆదేశాల ప్రకారం… ప్రభుత్వ పెద్దలు తాము చేయాలనుకున్నవి చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

రంగులు, అస్మదీయులకు మేళ్లు, ఖజానా దుబారా జీవోలా..?

సాధారణంగా ప్రభుత్వం జీవోలను రహస్యంగా ఉంచదు. అలా జీవోలు ఉంచారంటే.. అందులో కచ్చితంగా… విమర్శల పాలయ్యే.. ఆదేశాలు ఏవో ఉన్నాయనే అర్థం. తమ నిర్ణయాలు ప్రజలకు తెలియాలనే ప్రభుత్వాలు అనుకుంటాయి. కానీ… ఇలా పెద్ద సంఖ్యలో స్వల్ప కాలంలోనే రహస్య జీవోలు జారీ చేశారంటే… అందులో.. ప్రజాప్రయోజనాలకు విఘాతుం కలిగేలా… తమ ప్రయోజనాలు చూసుకుంటూ.. పాలకులు…. ఆదేశాలు జారీ చేసుకున్నారన్న అభిప్రాయం అందరిలోనూ ఏర్పడుతుంది. రెవిన్యూ శాఖలోనే అత్యధికంగా జీవోలు జారీ కావడం వెనుక కూడా.. భారీ లోగుట్టు ఉందని అంటున్నారు. ప్రభుత్వం.. రంగుల కోసం.. రూ. రెండువేల కోట్లు ఖర్చు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. అలా బిల్లుల చెల్లింపులోనూ.. ఖజానా దుబారా చేయడంలోనూ… కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమయ్యే అవకాశం ఉందన్న కారణంగా.. వీటిని కాన్ఫిడెన్షియల్‌గా ఉంచారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రహస్య జీవోలు చెల్లవని కోర్టు తీర్పులు..!

ఏ ప్రభుత్వమైనా.. తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజల ముందు ఉంచాలని… కోర్టులు చెబుతున్నాయి. కొద్ది రోజుల కిందట.. కేంద్ర ప్రభుత్వం కూడా.. అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి రహస్య జీవోలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ.. రహస్యాలు ఉండకూడదని..జీవోలు పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని ఆదేశించింది. తెలంగాణలోనూ ఇలాంటి రహస్య జీవోలు భారీగా ఉండటంతో.. పేరాల శేఖర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే జీవోల విషయంలో పారదర్శకత ఉండాలని, రహస్య జీవోలు చెల్లవని వాటన్నిటిని పబ్లిక్ డొమైన్ లో ఉంచాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఈ ఆదేశాలు అన్ని ప్రభుత్వాలకూ వర్తిస్తాయి. కానీ ఏపీ సర్కార్ మాత్రం… రహస్య జీవోల్లో కొత్త పుంతలు తొక్కుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేరళ ఎయిర్‌పోర్టులో విమానం రెండు ముక్కలు..!

కేరళలోని కోజికోడ్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ సమయంలో..విమానం స్కిడ్ అయి రెండు ముక్కలు అయింది. ఓ ముక్క చాలా దూరంగా పడిపోయింది. మరో ముక్క రన్ వే పై ఉండిపోయింది....

రికవరీ తక్కువ.. మృతులు ఎక్కువ..! ఏపీలో “డెడ్లీ” కరోనా..!

ఏపీలో కరోనా మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో కరోనాతో 89 మంది చనిపోయారు. కేసులు కూడా.. మరోసారి పదివేలకు పైగా నమోదయ్యాయ. దీంతో ఏపీలో కరోనా బారిన...

మూడు నెలల్లో కొత్త జిల్లాల విభజన సిఫార్సులు..!

మూడు నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల సందడి ప్రారంభమవనుంది. గత కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు..రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ సర్కార్ ఆదేశాలు...

జేసీ ప్రభాకర్ రెడ్డి అండ్ సన్ మళ్లీ అరెస్ట్..!

గురువారం సాయంత్రమే కడప జిల్లా జైలు నుంచి విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. పాత కేసులేవీ అరెస్ట్ చేయడానికి లేకపోవడంతో... ...

HOT NEWS

[X] Close
[X] Close