గవర్నర్ ప్రభుత్వం వైపా..? హైకోర్టు వైపా..?

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పునర్‌నియామకం కోసం.. గవర్నర్‌ని కలిసి అభ్యర్థించబోతున్నారు. హైకోర్టు స్వయంగా ఈ విషయంలో దిశానిర్దేశం చేయడంతో.. ఆయనకు 20వ తేదీన రాజ్‌భవన్ అపాయింట్‌మెంట్ ఇచ్చింది. గతంలోనే నిమ్మగడ్డ.. హైకోర్టు ఆదేశాలను అమలు చేయడంతో.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. తనను విధులు నిర్వహించకుండా అడ్డుకుంటోందని.. గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే గవర్నర్ కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పుడు హైకోర్టు ఆదేశించడంతో.. నేరుగా గవర్నర్‌నే కలిసి.. హైకోర్టు తీర్పును వివరించి.. తనను బాధ్యతలు తీసుకోవాలనే విషయంలో.. సహకరించాలని కోరనున్నారు.

నిమ్మగడ్డ విషయంలో ప్రభుత్వానికే అండగా నిలిచిన గవర్నర్..!

నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకం పూర్తిగా గవర్నర్ చేతుల మీదుగానే జరుగుతుంది. ఎస్‌ఈసీ పదవి రాజ్యాంగబద్ధమైనది. ప్రభుత్వాలు సిఫార్సు చేసినా.. దాన్ని ఆమోదించాలన్న నిబంధన ఏమీ లేదు. అలాంటి అధికారాలు గవర్నర్‌కు ఉండటం వల్లే.. చంద్రబాబు హయాంలో.. ఇతర అధికారికిని సిఫార్సు చేసినప్పటికీ.. అప్పటి గవర్నర్ నరసింహన్.. తన వద్ద చాలా కాలం పని చేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను నియమించారు. కొద్ది రోజుల కిందట.. నిమ్మగడ్డను తొలగించిన ఆర్డినెన్స్‌ మీద సంతకం చేసిన.. గవర్నర్.. అదే సమయంలో.. కనగరాజ్‌ను కొత్త ఎస్‌ఈసీగా నియమిస్తూ.. తెచ్చిన ఉత్తర్వులపైనా సంతకం పెట్టారు. ఇవన్నీ వివాదాస్పదమయ్యాయి.

నిమ్మగడ్డ ఫిర్యాదుపైనా ఇప్పటి వరకూ సైలెంట్..!

రమేష్‌కుమార్‌ను పునర్‌నియమించాలని హైకోర్టు ఆదేశించడం.. ప్రభుత్వం పట్టించుకోకపోతూంటంతో… ఇప్పుడు బంతిని హైకోర్టు గవర్నర్ వద్దకు నెట్టింది. అయితే.. రమేష్ కుమార్ ఎపిసోడ్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ తీరు మొదటి నుంచి వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని.. సాదాసీదా రాజ్యాంగ పరిజ్ఞానం ఉన్న వారికి కూడా తెలుస్తుందని.. కానీ గవర్నర్ మాత్రం.. కనీసం న్యాయసలహా కూడా తీసుకోకుండా… గంటల వ్యవధిలోనే సంతకం పెట్టి ఆమోదించారనే విమర్శలు వస్తున్నాయి. అలాగే కనగరాజ్ నియామకం విషయంలో గవర్నర్.. ఆలస్యం చేయలేదు. ప్రభుత్వం ఫైల్ పంపిన నిమిషాల్లోనే సంతకం చేశారు. అదే సమయంలో… హైకోర్టు తీర్పు అమలు చేయడం లేదని.. నిమ్మగడ్డ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసినా స్పందించలేదు.

గవర్నర్‌ న్యాయవ్యవస్థను గౌరవిస్తారా..? రాజకీయాన్నా..?

ప్రస్తుతం బంతి గవర్నర్ కోర్టులోనే ఉంది. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా నడుచుకుంటారా లేక.. ప్రభుత్వ అభిప్రాయం ప్రకారం.. ముందుకెళ్తారా.. అన్నది చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు తీర్పును గవర్నర్ దాటకూడదని.. యనమల వంటి వారు ముందుగానే చెబుతున్నారు. ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న బిశ్వభూషణ్ హరిచందన్.. ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నదే ఇప్పుడు చర్చ. నిమ్మగడ్డ విజ్ఞాపన పత్రం తీసుకుని సైలెంట్‌గా ఉండిపోతారా.. లేక హైకోర్టు తీర్పును అమలు చేయమని.. ప్రభుత్వానికి సూచిస్తారా.. అన్నది ఆసక్తికరంగా మారుతోంది. అందుకే.. అందరి చూపూ రాజ్‌భవన్‌ వైపు మళ్లుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close