దివీస్‌పై పవన్‌కు కౌంటర్ ఇవ్వలేకపోతున్న ఏపీ సర్కార్..!

దివీస్ పరిశ్రమ విషయంలో పవన్ కల్యాణ్ వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా పరిస్థితి మారిపోతోంది. దివీస్ పరిశ్రమ విషయంలో పవన్ కల్యాణ్ సూటిగా విమర్శలు చేస్తున్నారు. ప్రశ్నిస్తున్నారు. అయితే.. ప్రభుత్వం తరపున మంత్రి గౌతం రెడ్డి సంబంధం లేకుండా… ఇతర అంశాలను ప్రస్తావిస్తూ.. “సుత్తి” సమాధానాలు చెబుతున్నారు. దీనికి పవన్ కల్యాణ్ ఆగకుండా కౌంటర్ ఇస్తున్నారు. మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడం మానేయాలని తేల్చి చెప్పారు. చంద్రబాబు హయాంలో అనుమతులు ఇస్తే.. ఇప్పుడు ఎందుకు పవన్ పోరాటం చేస్తున్నారనేది గౌతంరెడ్డి విమర్శ. చంద్రబాబు అనుమతిస్తే.. మీరు ఆపలేరా అనేది పవన్ సూటి కౌంటర్. చంద్రబాబు ప్రారంభించారు అన్న కారణంగా.. అన్నింటినీ ఆపేసినప్పుడు.. ఒక్క దివీస్ మాత్రమే ఎందుకు ముద్దొస్తుందనే అంశాన్ని పవన్.. ప్రజల్లోకి తీసుకెళ్లేలా విమర్శలు చేశారు.

దివీస్‌ను బంగాళా ఖాతంలో కలుపుతామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన జగన్.. సీఎం అయ్యాక మారిపోయారు. అప్పట్లో ఆ పరిశ్రమను కాలుష్య కాసారంగా చెప్పారు. ఇప్పుడు సీఎం అయ్యాక… నీతులు చెప్పడం ప్రారంభించారు. ప్రజల ఆందోళన తగ్గించడానికన్నట్లుగా కొన్ని సూచనలను దివీస్ పరిశ్రమకు చేశారు.అన్ని సమస్యలు పరిష్కరించాకే దివీస్‌ విషయంలో ముందుకెళ్లాలని సూచించారు. దివీస్‌ యాజమాన్యం ముందు కొన్ని ప్రతిపాదనలు కూడా చేశారు. దివీస్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన వారిపై తక్షణమే మోపిన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని , కాలుష్యం విషయంలో మత్స్యకారుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని.. వారితో సమావేశమై దివీస్‌ యాజమాన్యం చర్చలు జరపాలని, దివీస్‌ పరిశ్రమలో తప్పనిసరిగా స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని సూచించింది.

అయితే ఇవన్నీ ప్రభుత్వం చెబుతున్న మోసపూరిత మాటలుగానే అక్కడి బాధితులు నమ్ముతున్నారు. ఎందుకంటే.. యూటర్న్ చరిత్ర స్పష్టంగా కళ్ల ముందు కనిపిస్తోంది. ప్రస్తుతం దివీస్ పరిసరాల్లో వందల మంది పోలీసుల్ని మోహరించారు. ఎవరు వ్యతిరేకంగా గళమెత్తినా వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. చెబుతున్న దానికి చేస్తున్న దానికి పొంతన లేకపోవడం.. పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు కౌంటర్ వేయడం కూడా.. సరిగ్గా చేతకాక పోవడంతో ప్రభుత్వం మరింత ఇబ్బందుల్లో పడినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిదే దేశద్రోహం కాదు..! మరి రక్షణ దేశంలో ఉందా..!?

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన దేశ ద్రోహం కిందకు రాదని సుప్రీం కోర్టు తేల్చేసింది. జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై దాఖలైన కేసులో కోర్టు ఈ మేరకు కీలక తీర్పు చెప్పింది....

ఏపీలో పోర్టులన్నీ ఆదాని పరం..!

ఆంధ్రప్రదేశ్ ప్లస్ పాయింట్ సుదీర్ఘ తీరమని.. పోర్టులతో తట్టుకోలేనంత అభివృద్ధి చేస్తామని గత ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం కూడా.. చాలా చాలా మాటలు చెబుతూ ఉంటాయి. కానీ.. వాస్తవానికి కొత్త...

“అన్యాయ మాటలు”.. సీజేఐ వైదొలగాలనే డిమాండ్లు..!

చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే భారత రాజ్యాంగం, చట్టాల పట్ల సంపూర్ణమైన అవగాహనతో ఉంటారని అనుకుంటారు. నిన్నామొన్నటి వరకూ సీజేఐ బోబ్డేపై అలాంటి అభిప్రాయమే ఉండేది. అయితే.. మహారాష్ట్రకు చెందిన...

శశికళ రిటైర్డ్ హర్ట్ మాత్రమే..రిటైర్మెంట్ కాదు..!

శశికళ అమ్మ జయలలిత సమాధి మీద శపథం చేశారు. జైల్లో ఓపిగ్గా శిక్ష అనుభవించారు. రిలీజై వచ్చిన తర్వాత రాజకీయాల్లో తేల్చుకుంటానన్నారు. అయితే హఠాత్తుగా రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమించుకుంటున్నానని ప్రకటించారు. ఇది...

HOT NEWS

[X] Close
[X] Close