తిరుమ‌ల వెంక‌న్న‌కే శ‌ఠ‌గోపం… ధ‌ర్మారెడ్డిపై స‌ర్కార్ విచార‌ణ‌!

వ‌డ్డీకాసుల వాడిగా పేరున్న తిరుమ‌ల వెంక‌న్న‌కే శ‌ఠ‌గోపం పెట్టార‌న్న ఆరోప‌ణ‌లు మాజీ ఈవో ధ‌ర్మారెడ్డిపై ఎన్నోసార్లు వ‌చ్చాయి. ఈవోగా అద‌న‌పు బాధ్య‌త‌లు చూసుకుంటూ… టీటీడీ నిధులు ప‌క్క‌దారి ప‌ట్టించ‌టంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించార‌న్న ఆరోప‌ణ‌ల‌తో స‌ర్కార్ విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది.

శ్రీ‌వాణి ట్ర‌స్ట్ టికెట్ల వ్య‌వ‌హ‌రంలో అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని… శ్రీ‌వాణి ట్ర‌స్ట్ కు విరాళం ఇచ్చే పారిశ్రామికవేత్త‌ల‌తో ఏర్పాటైన ప‌రిచ‌యంతో వైసీపీకి విరాళాలు సేక‌రించేందుకు ప్ర‌య‌త్నించార‌న్న ఆరోప‌ణ‌లు ధ‌ర్మారెడ్డిపై గుప్పుమ‌న్నాయి. దీంతో కూట‌మి స‌ర్కార్ రాగానే ధ‌ర్మారెడ్డిని సెల‌వుపై పంపి ఆ త‌ర్వాత ఇప్పుడు విజిలెన్స్ విచార‌ణ‌కు స‌ర్కార్ ఆదేశించింది.

స్వామి వారి బంగారు డిపాజిట్ల‌ను అనుకూల బ్యాంకుల్లో పెట్ట‌డం… స్వామి వారికి పెట్టే నైవేద్యాలు, ప్ర‌సాదాల త‌యారీ ముడి సరుకుల స‌ర‌ఫ‌రాలో అవినీతికి పాల్ప‌డ్డార‌ని ధ‌ర్మారెడ్డిపై అభియోగాలున్నాయి. అంతేకాదు టీటీడీ ఏటా నిర్మాణాల కోసం కొంత బ‌డ్జెట్ కేటాయిస్తుంది. అది 700కోట్ల లోపే ఉండేది. కానీ దాన్ని 1500కోట్ల‌కు పైగా తీసుకెళ్లి… అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌న్న ఆరోప‌ణ‌లు కూడా ఆయ‌న‌పై ఉన్నాయి. ఈ మొత్తం అంశాల‌పై విచార‌ణ చేయాల‌ని, స్వామి వారిని మోసం చేయాల‌నుకున్న ఏ ఒక్క‌రూ బాగుప‌డలేద‌న్న డిమాండ్స్ చాలా కాలంగానే ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ ఉద్యోగ సంఘం నేతలు ఎక్కడ ?

వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు వాయిస్ లేకుండా చేసింది. ఉద్యోగ సంఘం నేతల్ని ఉద్యోగుల వాయిస్ కాకుండా తమ వాయిస్ వినిపించేలా చేయడంతో ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వారికి నోరు పెగలడం...

తననూ లెక్కేసుకోవాలంటున్న రమణదీక్షితులు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి రమణదీక్షితులుఓ విన్నపం చేశారు. సోషల్ మీడియాలో ఈ విన్నపం చేసుకున్నారు. గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నింటినీ లిస్టవుట్ చేసుకుని తీసేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి.. ఆ...

ఫ్లాష్ బ్యాక్‌: జ‌మున‌ని ఎందుకు బ్యాన్ చేశారు?

కొన్నేళ్ల క్రితం ప్ర‌కాష్‌రాజ్‌ని 'మా' అసోసియేష‌న్ బ్యాన్ చేసిన సంగ‌తి ఇప్ప‌టికీ ఏదో ఓ సంద‌ర్భంలో త‌ల‌చుకొంటుంటాం. ఆ త‌ర‌వాత ఏ న‌టుడ్నీ అలా బ్యాన్ చేయ‌లేదు. కానీ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే......

టీడీపీ క్యాడర్‌పై కేసుల ఎత్తివేత !

జగన్ రెడ్డి జమానాలో ఎఫ్ఐఆర్‌ల విప్లవం నడిచింది. నిజమైన రౌడీలు, ఖునీకోరులు హాయిగా తిరుగుతూంటే... టీడీపీ కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియాపోస్టులు పెట్టినా వేధింపులు ఎదుర్కొన్నారు. కేసుల పాలయ్యారు. టీడీపీ అధికారంలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close