కరోనా సాకులు – చేతులెత్తేసిన ఏపీ ప్రభుత్వం !

ఏపీ ప్రభుత్వం తనకు చేత కావడం లేదని నేరుగానే చెబుతోంది. అయితే దానికి కరోనా కారణంగా చెబుతోంది. ఏపీ ప్రభుత్వం ప్రతి ఆర్థిక సమస్యకూ కరోనా కారణంగా చెబుతోంది. ఉద్యోగులకు సమయానికి జీతాలు ఎందుకివ్వడం లేదంటే కరోనా అంటోంది. బిల్లులు ఎందుకు చెల్లించడం లేదంటే కరోనా అంటోంది. రాష్ట్రాన్ని ఒక్క అభివృద్ధి పని ఎందుకు చేయడం లేదంటే విభజన సమస్యలు అంటున్నారు. ఇలా ప్రతీ దానికి సాకులు చెబుతూ..మది చేతకాని ప్రభుత్వమని.. చేవ చచ్చిన ప్రభుత్వమని.. ఏమీ చేయలేమని నేరుగా సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటున్న వైనం ఇప్పుడు అందర్నీ నివ్వెర పరుస్తోంది.

కరోనా ఒక్క ఏపీకే వచ్చిందా ?

కరోనా అనేది ప్రపంచం అంతా వచ్చింది. ప్రజలకూ వచ్చింది. ప్రభుత్వాలకు లెక్కలకు మిక్కిలిగా అప్పులు చేసుకునే అవకాశం లభించింది. ఆ ప్రకారం తీసుకున్నారు. బయటపడ్డారు. ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో పడిన వాళ్లకే తెలుసు. అప్పులతో కాలం గడిపేసిన ప్రభుత్వానికేం కష్టం లేదు. కానీ ఇప్పుడు సామాన్య ప్రజలకు లేని చాయిస్.. ప్రభుత్వానికి వచ్చింది. నీకేమి చేతకావడం లేదెందుకు అంటే… కరోనా కారణం అనే వెసులుబాటులభించింది. దాన్ని విపరీతంగా వాడేస్తున్నారు. ఒక్క ఏపీకేనా తెలంగాణకు లేదా… తమిళనాడుకు లేదా.. మొత్తం ప్రపంచానికి కరోనా లేదా.. అంటే.. సమాధానం ఉండదు. అందరికీ పాండమిక్ వచ్చింది .. కానీ తమ చేతకాని తనానికి అసమర్థతకు.. దాన్ని కారణంగా చూపించడం లేదు. ఒక్క ఏపీలోనే అలా చూపిస్తున్నారు.

విభజన జరిగిన ఐదేళ్లు లేని కష్టాలు ఇప్పుడెందుకు. వస్తున్నాయి ?

ఏదైనా కారణం చెబితే అతికినట్లు ఉండాలి. విభజన సమస్యల వల్లకూడా తాము అభివృద్ధి చెందలేకపోతున్నామని జీతాలివ్వలేకపోతున్నామని చెబితే.. వింతగా ఉంటుంది. ఎందుకంటే ఏపీ విడిపోయిన ఐదేళ్ల వరకూ ఓ ప్రభుత్వం నడిచింది. ఆ ప్రభుత్వం పన్నులేయలేదు. పాలన సజావుగా నడిచింది. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు పెరిగాయి. పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ఏపీలో దరిద్రం రాజ్యమేలడానికి విభజనే కారణం అని చెబితే.. ఎంత కామెడీగా ఉంటుంది. అయినా చెబుతున్నారు. విభజన కన్నా ఎక్కువగా తమ నిర్ణయాలు, పాలన … దారుణంగా దెబ్బకొట్టిందని కవర్ చేసుకోవడానికి విభజన కష్టాలంటున్నారు.

చేతకాని.. చేవ చచ్చిన పాలన చేస్తున్నట్లుగా నేరుగా ఒప్పుకుంటున్నారా ?

నాలుగేళ్లుగా ఒక్క పనీ చేయలేదు. పోలవరం ఆగిపోయింది. అమరావతిని చంపేశారు. రాష్ట్రంలో ఒక్క రోడ్డు బాగోలేదు. ఏపీలో అక్రమ ఇసుక, జూదం, అక్రమ మద్యం వ్యాపారాలు మినహా మరే వ్యాపారమూ సవ్యంగా సాగడం లేదు. తాగుబోతుల దగ్గర్నుంచి ఏటా రూ. 30వేల కోట్లు పిండేస్తున్నారు. కానీ ఉద్యోగులకు జీతాలివ్వడం లేదు… బిల్లులు చెల్లించడం లేదు.. ప్రతీ వర్గం రోడ్డెక్కే పరిస్థితి. వీటన్నింటినీ పరిష్కరించలేక.. కరోనా, విభజన సమస్యలు అని కారణం చెప్పి.. తమకు చేతకాదని నిరూపించుకుంటున్న ప్రభుత్వం.. నిజంగా ఏపీ ప్రజల దురదృష్టమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉండవల్లి ఆగయా – ఏం తెలివి బాసూ !

స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో రూపాయి అవినీతి చూపించలేక .. తప్పుడు ప్రచారాలతో కాలం వెళ్లదీస్తున్న సీఐడీని కాపాడేందుకు అప్రకటిత స్వయం మేధావి ఉండవల్లి అరుణ్ కుమార్ రంగంలోకి దిగారు....

హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం – నిజమేనా ?

హైదరాబాద్ ఇప్పుడు ఏపీ విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండాలని చట్టంలో ఉంది. మరి ఆ తర్వాత తెలంగాణకు రాజధానిగా ఉంటుందా లేదా అన్నదానిపై...

ఎడిటర్స్ కామెంట్ : ఆంధ్ర – ఉత్తరకొరియాను మించి !

చట్టం, న్యాయం, ధర్మం, ప్రజాస్వామ్యం ఏమీ ఉండవు. పాలకుడు ఎవరిపై కక్ష కడితే వాడి అంతం చూడాల్సిందే. ఎవరు నచ్చకపోతే వాడ్ని సాగనంపాల్సిందే. ఎవడు ప్రశ్నిస్తే వాడు ఎందుకు బతికి ఉన్నానురా...

చంద్రబాబు – జైలు – వాయిదాలు !

ఎఫ్ఐఆర్ కూడా లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కానీ న్యాయం కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్లపై తీర్పులు మాత్రం.. అంత వేగంగా రావడం లేదు. ఎప్పుడొస్తాయో తెలియదన్నట్లుగా సీన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close