కట్‌ చేసిన జీతాలు,పెన్షన్లను 12 శాతం వడ్డీతో చెల్లించాల్సిందే..!

కరోనా పేరు చెప్పి రెండు నెలల పాటు సగం సగం జీతాలే ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. జీతాలు, పెన్షన్‌ బకాయిలు చెల్లించాలని ఆదేశించింది.మార్చి, ఏప్రిల్ నెలల్లో బకాయిపడిన 50శాతం జీతాలు, పెన్షన్లను.. 12శాతం వడ్డీతో చెల్లించాలని స్పష్టం చేసింది. కరోనా, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా 50 శాతం మాత్రమే .. జీతాల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవోలను హైకోర్టు కొట్టి వేసింది. విశాఖకు చెందిన రిటైర్డ్ జడ్జి కామేశ్వరి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం కరోనా లాక్ డౌన్ ప్రకటించిన నెలలో మొత్తం జీతాలు ఇవ్వడానికి బిల్లులు సిద్ధం చేసుకున్నారు.

అయితే అప్పుడే కేసీఆర్ సగం జీతాలే ఇవ్వాలని నిర్ణయించడంతో జగన్ కూడా మనసు మార్చుకున్నారు. రెండు నెలల పాటు సగం సగం జీతాలే ఇచ్చారు. పెన్షన్లు కూడా సగమే ఇచ్చారు. అయితే.. అప్పుడే.. పెన్షనర్లు కోర్టును ఆశ్రయించారు. ఆపడానికి అవకాశం లేదని న్యాయనిపుణులు చెప్పడంతో.. ఆ నెల నుంచి మొత్తం జీతాలు, పెన్షన్లు ఇస్తున్నట్లుగా కోర్టుకు తెలిపారు. కానీ రెండు నెలల బకాయిల గురించి మాత్రం చెప్పలేదు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడినప్పుడు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి ప్రాతిపదిక ఏమిటో తెలియని పరిస్థితి.

దీంతో పలువురు ఉద్యోగులు, పెన్షనర్లు ఇబ్బందులు పడ్డారు. కొంత మంది కోర్టును ఆశ్రయించడంతో ఇప్పుడు జీతాలు చెల్లించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. రెండు నెలలకు కలిపి ఉద్యోగులకు దాదాపుగా ఐదు వేల కోట్ల వరకూ చెల్లించాల్సి రావొచ్చని అంచనా. అయితే.. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ ఆదేశాలను ఎంత మేర పట్టించుకుంటుందన్నది చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వెంకయ్యనాయుడికి కరోనా ..!

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా సోకింది. అతి స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆయన కరోనా పరీక్ష చేయించుకున్నారు. దాంతో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతానికి హోమ్ ఐసోలేషన్‌లోనే వెంకయ్యనాయుడు ఉన్నారు. లక్షణాలు పెరిగితే...

‘ఆదిపురుష్`’పై అనుష్క క్లారిటీ

ప్ర‌భాస్ న‌టిస్తున్న మ‌రో బ‌హుళ భాషా చిత్రం `ఆది పురుష్‌`. రావ‌ణుడి పాత్ర‌కు సైఫ్ అలీఖాన్‌ని ఎంచుకున్నారు. సీత పాత్ర కోసం చాలామంది క‌థానాయిక‌ల పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. అందులో అనుష్క పేరు...

గ్యాప్ రాలేదు.. తీసుకున్నా: అనుష్క

బాహుబ‌లి త‌ర‌వాత‌.. అనుష్క మ‌రీ న‌ల్ల‌పూస అయిపోయింది. `భాగ‌మ‌తి` త‌ప్ప మ‌రే సినిమా ఒప్పుకోలేదు. నిశ్శ‌బ్దం.. సినిమాకి దాదాపుగా రెండేళ్లు కేటాయించాల్సివ‌చ్చింది. అనుష్క‌కి సినిమా అవ‌కాశాలు లేవా? వ‌చ్చినా చేయ‌డం లేదా?...

సోనూసూద్‌కి ఐరాస పుర‌స్కారం

నటుడు సోనూసూద్ కు అరుదైన పురస్కారం ప్ర‌క‌టించింది ఐక్య‌రాజ్య స‌మితి. ఐరాస అనుబంధ సంస్థ‌ యునైటెడ్‌ నేషన్స్ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యుఎన్‌డిపి) స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ యాక్షన్ అవార్డుని ఈ యేట...

HOT NEWS

[X] Close
[X] Close