హైకోర్టులో రఘురామరాజుకు షాక్..!

హైకోర్టులో రఘురామకృష్ణరాజుకు షాక్ తగిలిగింది. తన అరెస్ట్ అక్రమం అంటూ ఆయన తరపు న్యాయవాదులు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. బెయిల్ కోసం.. సీఐడీ కోర్టుకే వెళ్లాలని సూచించింది. రఘురామకృష్ణరాజు దాఖలు చేసుకునే బెయిల్ పిటిషన్‌పై వెంటనే నిర్ణయం తీసుకోవాలని.. కింది కోర్టుకు హైకోర్టు సూచించింది. అదే సమయంలో.. రఘురామకృష్ణరాజుకు మూడు నెలల కిందటే బైపాస్ సర్జరీ జరిగిందని.. పిటిషనర్ తరపు న్యాయవాదులు విన్నవించడంతో.. ఆయన ఆరోగ్యానికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి సూచించారు. దీంతో రఘురామకృష్ణరాజు.. కొన్ని రోజుల పాటు జైల్లో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.

అంతకు ముందు రఘురామకృష్ణరాజుపై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో రఘురామకృష్ణరాజు ప్రతీ రోజూ మీడియాతో మాట్లాడటాన్ని ప్రసారం చేసిన ఏబీఎన్, టీవీ 5 చానళ్లను కూడా కుట్రదారులుగా సీఐడీ అధికారులు పేర్కొన్నారు. వ్యూహాత్మకంగా ప్రభుత్వంపై అసంతృప్తి పెంచేలా.. రఘురామకృష్ణరాజు మాట్లాడుతూంటే… ఈ రెండు చానళ్లు ప్రసారం చేస్తున్నాయని అది కుట్ర అని సీఐడీ అధికారులు చెబుతున్నారు. ఆ చానళ్లు స్లాట్స్ కేటాయించారని … కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడుతున్నారని వారు కుట్రలో భాగస్వాములని సీఐడీ చెబుతోంది. కులం, మతం ప్రాతిపదికన విభజన తెచ్చేందుకు ప్రయత్నించారని సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.

సీఐడీ ఎఫ్ఐఆర్ మొత్తం చూస్తే.. రఘురామకృష్ణరాజు ప్రతీ రోజూ రచ్చ బండ పేరుతో మాట్లాడేవాటిని ప్రసారం చేయడమే అసలు కేసుకు మూలం అన్నట్లుగా ఉంది. ప్రతీ రోజూ ఆయన ప్రభుత్వాన్ని అనేక అంశాలపై విమర్శిస్తూ ఉంటారు. అయితే… సీఐడీ…ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి ఎవరూ ఫిర్యాదులు చేయలేదు. సుమోటోగా తీసుకుని దర్యాప్తు చేసి.. ప్రాథమిక ఆధారాలుఉన్నాయని నిర్ధారించుకుని కేసు పెట్టేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో యూఎస్‌లో బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ షోను ఏర్పాటు చేసిన హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌

త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో యూఎస్‌లో  'అలా అమెరికాపురములో..` పేరుతో బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ షోను ఏర్పాటు చేసిన  హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌. సెన్సేష‌న‌ల్ కాన్స‌ర్ట్స్ ఏర్పాటుచేయ‌డంలో అగ్రగామిగా ఉన్న హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ఈ సంవత్సరం టాలీవుడ్ మ్యూజిక్...

శ్రీ‌నువైట్ల మ‌ల్టీస్టార‌ర్… ‘డ‌బుల్స్‌’

వ‌రుస హిట్లు ఇచ్చిన శ్రీ‌నువైట్ల‌.. ఇప్పుడు వ‌రుస ఫ్లాపుల‌ను మోస్తున్నాడు. అయినా స‌రే, మళ్లీ త‌న‌దైన ముద్ర వేయ‌డానికి త‌ప‌న ప‌డుతున్నాడు. అందులో భాగంగా `ఢీ అండ్ ఢీ` తీస్తున్నాడు. `డ‌బుల్ డోస్‌`...

జనసేనను మరోసారి కించ పర్చిన ఏపీ బీజేపీ..!

పవన్ కల్యాణ్‌కు కేంద్రంలో మంత్రి పదవి అని ఢిల్లీ నుంచి బీజేపీ లీకులు ఇస్తూ గిలిగింతలు పెడుతోంది కానీ.. అసలు విషయం మాత్రం అసలు జనసేనను లెక్కలోకి తీసుకోవడం లేదు. ముఖ్యంగా ఏపీ...

ఏపీ సర్కార్‌ను అప్పులు చేయనివ్వొద్దని మోడీకి రఘురామ లేఖ..!

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అప్పుల మీద నడుస్తోంది. నెలకు రూ. ఆరేడు వేల కోట్లు అప్పులు ఎలాగోలా తెచ్చుకోకపోతే.. ఆ నెల దివాలా ప్రకటించాల్సిన పరిస్థితి. ఆ అప్పులు కూడా రాకుండా చేయాలని...

HOT NEWS

[X] Close
[X] Close