ఎస్ఈబీ పెట్టే అక్రమ మద్యం కేసులు చెల్లవా..?

ఏ రాష్ట్రంలో అయినా పోలీసు, ఎక్సైజ్ డిపార్టుమెంట్లు ఉంటాయి. అవి చట్ట నిర్ణయాల ద్వారా ఏర్పడ్డాయి. వాటికి ప్రత్యేకంగా చట్టాలు ఉన్నాయి. ఆ డిపార్టుమెంట్లు పెట్టే కేసులను… వాటిని ఏర్పాటు చేసిన చట్టాల ప్రకారం పెడతారు. విచారణ..శిక్షలు కూడా వేస్తారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. ఏపీలో కొత్తగా.. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో.. ఎస్ఈబీ అనే దాన్ని ముఖ్యమంత్రి జగన్ ఏర్పాటు చేశారు. దీని కోసం జీవో 41ను విడుదల చేశారు. ఆ తర్వాత ఎక్సైజ్‌లో ఉన్న వారిలో 70 శాతం మందిని ఆ శాఖకు బదిలీ చేశారు. అయితే.. ఇప్పుడు అందరికీ ఓ అనుమానం వచ్చింది. ఎస్ఈబీ పెట్టే కేసులు ఏ చట్టం ప్రకారం పెడతారు.. అనేదే.

అక్రమ మద్యం, ఇసుక అక్రమాల నివారణ లక్ష్యంగా ఎస్ఈబీని ఏర్పాటు చేశారు. పెద్దఎత్తున మద్యం రవాణను కేసుల్ని నమోదు చేస్తున్నారు. ఈ సమయంలో.. అసలు ఎస్ఈబీ అనేదే చట్ట విరుద్ధమని ఆరోపిస్తూ.. ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి ఏపీ పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఆర్డర్‌ 1975, ఏపీ ఎక్సైజ్‌ చట్టం 1968, రాష్ట్ర ప్రభుత్వ బిజినెస్‌ రూల్స్‌ 2018కి విరుద్ధంగా ఎస్ఈబీని ఏర్పాటు చేశారని.. పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎస్ఈబీకి న్యాయబద్ధ అనుమతి లేదని, అలాంటప్పుడు వారు నమోదు చేసిన కేసులు న్యాయపరీక్షకు నిలబడవని ఆయన అంటున్నారు.

ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఏ నిబంధనల ప్రకారం ఎస్ఈబీని ఏర్పాటు చేశారో చెప్పాలని.. ఆరుగురు అధికారులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. సీఎస్‌, స్పెషల్‌ సీఎస్‌, డీజీపీ సహా మరో ముగ్గురికి నోటీసులు వెళ్లాయి. తదుపరి విచారణ హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. ప్రభుత్వం చట్టాలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా పాలన చేస్తోందని వస్తున్న విమర్శల నేపధ్యంలో… ఈ ఎస్ఈబీ ఏర్పాటు కూడా.. న్యాయపరీక్షకు వెళ్లింది. ఏ చట్టం ప్రకారం.. ఎస్ఈబీని ఏర్పాటు చేశారో.. అధికారులు హైకోర్టుకు చెప్పలేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్‌: ఈనాడులో గంద‌ర‌గోళం

తెలుగు మీడియా రంగంలో రారాజు.. ఈనాడు. భ‌విష్య‌త్ అవ‌స‌రాల్ని దృష్టిలో ఉంచుకుని, త‌న‌ని తాను మ‌ల‌చుకోవ‌డంలో ఈనాడుకి తిరుగులేదు. ప‌దేళ్ల ముందుకెళ్లి ఆలోచించుకుని, అందుకు త‌గ్గ‌ట్టుగా స‌ర్వ‌స‌న్న‌ద్ధం అవ్వ‌డం ఈనాడు ప్ర‌త్యేక‌త‌. అయితే...

ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికే ” అనంత పద్మనాభుని” బాధ్యతలు..!

దేశంలో అత్యంత ధనిక ఆలయంగా పేరు తెచ్చుకున్న కేరళలోని అనంతపద్మనాభ స్వామి ఆలయం బాధ్యత ట్రావెన్‌కోర్ రాజ కుటుంబానిదేనని.. సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తుది తీర్పు వెలువరించింది. అలాగే త్రివేండ్రం...

జగన్ పార్టీకి ” వైఎస్ఆర్” నోటీసులొచ్చాయ్..!

జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని యువజన శ్రామిత రైతు కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరును ఎలా వాడుకుంటున్నారంటూ.. ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలా...

పవన్ కి మద్దతివ్వను, జగన్ ని ప్రశ్నించను, కేంద్రంపై నెట్టేస్తా, తప్పుకుంటా: ముద్రగడ లేఖ

ముద్రగడ పద్మనాభం తమ జాతిని ఉద్దేశించి మరొకసారి సుదీర్ఘమైన లేఖ రాశారు. 2 వారాల క్రితం ముద్రగడ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి రాసిన లేఖ సొంత సామాజిక వర్గం నుండే విమర్శలు పొందడం...

HOT NEWS

[X] Close
[X] Close