ఏపీ లిక్కర్ స్కామ్లో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా సాగిన ఈ స్కాంలో.. వైసీపీ నేతల్లో కొంత మందికి వాటాలు పంచారు. తయారీ నుంచి రవాణా వరకూ మొత్తం తమ గుప్పిట్లోనే పెట్టుకుని.. వైసీపీ నేతలకు అందులో వ్యాపార అవకాశాలు కల్పించారు. రవాణా, హోలోగ్రామ్, ప్యాకింగ్ ఇలా వివిధ రంగాల్లో వైసీపీ నేతలతో కంపెనీలు పెట్టించి.. కమిషన్లు ఇచ్చారు. ఇలా ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకూ వారెవరూ బయటపడలేదు. కానీ సిట్ పేర్లు బయటకు తెచ్చే సరికి గతుక్కుమంటున్నారు.
మద్యం రవాణా చేసిన వారిలో ఐదుగురు కీలక నేతలు
మద్యం రవాణా కాంట్రాక్టును పొందిన వారిలో ఏరియాల వారీగా నలుగురు కీలక నేతలు ఉన్నారు. యూట్యూబ్ స్టార్ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, అంబటి రాంబాబు, మజ్జి శ్రీనివాసరావు, విజయానందరెడ్డి, “బుజ్జి కన్నా” కారుమూరి కుమారుడు సునీల్ ఉన్నారు. వీరు ఐదు శాతం కమిషన్ తీసుకుని ఇతరులకు ఆ పని అప్పగించారు ఇచ్చారు. అంటే లిక్కర్ స్కాం పాపంలో వీరికి కొంత ముట్టచెప్పేందుకు ఈ మార్గం అనుసరించారన్నమాట. ఇక ప్యాకింగ్, హోలోగ్రామ్స్ వంటి వాటిలోనూ ఇలాంటి దందానే నడిచింది.
తిలాపాపం తలా పిడికెడు
డబ్బులు వస్తున్నాయి కదా చాలా మంది వైసీపీ నేతలు ఇందులో భాగస్వామ్యం అయ్యారు. ఐదు సంవత్సరాల పాటు ఎంతో కొంత వెనకేసుకున్నారు. కానీ అసలు జరిగినస్కామ్కు తమకు వచ్చిన చిల్లరకు సంబంధం లేదు. పైగా తాము చేసేది వ్యాపారం అనుకున్నారు.కానీ ఇలా ఇరికిస్తారని వారు కూడా ఊహించి ఉండరు. కానీ దొరికిపోతున్నారు. లిక్కర్ స్కామ్లో సింహభాగం.. బిగ్ బాస్ తన ఖాతాలకు మళ్లించుకున్నా… ఇలా పార్టీ నేతలు కొంత మందికి చిల్లర పడేసి.. వారిని కూడా పాపంలో భాగం చేశారు.
అసలు మోసపోయింది క్యాడరే !
వైసీపీ హయాంలో కీలక నేతలందరూ అడ్డగోలుగా దోచుకున్నారు. పార్టీ హైకమాండ్ చెప్పినట్లుగా బూతులు తిట్టి.. ఇతర పనులు చేసిన వారందరికీ అంతో ఇంతో ఆర్థిక సాయం కల్పించారు. కానీ పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి అదే పనిగా శ్రమించి.. ఏళ్లకు ఏళ్లుకు.. పని చేసిన కార్యకర్తలే పూర్తి స్థాయిలో దివాలా తీశారు. వారే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కార్యకర్తలను వాలంటిర్ల పేరుతో పనికి రాకుండా చేశారు. చోటా నేతలు పనులు చేసి అప్పుల పాలయ్యారు. సోషల్ మీడియా కార్యకర్తలు కేసుల పాలయ్యారు. కానీ ఆర్థికంగా లాభపడింది మాత్రం.. పిడికెడు మందే.