ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో ఈడీ ఒక్క సారిగా పలు రాష్ట్రాల్లో సోదాలు చేయడంతో వైసీపీ పెద్దలు ఉలిక్కి పడ్డారు. ఇంత కాలం సిట్ మాత్రమే విచారణ జరుపుతోందని.. తమ స్కామ్ ఇంటర్నేషనల్ కాబట్టి భయం లేదని.. ఎక్కడో చోట తీగ తెగిపోతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈడీ పూర్తి స్థాయిలో హడావుడి లేకుండా చేయాలనుకున్న పనులన్నీ చేస్తోందని క్లారిటీ వచ్చాక.. వారంతా కంగారు పడిపోతున్నారు. తమ దాకా ఎప్పుడు వస్తారా అని బితుకుబితుకు మంటున్నారు.
అన్నీ ఆధారాలతో ఈడీ సోదాలు !
ఈడీ టార్గెటెడ్‌గా సోదాలు చేసింది. అంటే పక్కా సమాచారంతోనే సోదాలు చేసింది. లిక్కర్ స్కాముల్లో డబ్బులు ఎవరెవరి దగ్గరకు చేరాయి.. వారు ఎలా వైట్ చేశారు.. దానికి ఎన్ని షెల్ కంపెనీలు పెట్టారు..ఇలా మొత్తం సమాచారం ఉండటంతో.. ఆయా చోట్ల సోదాలు చేశారు. పక్కా ఆధారాలతో చేసిన సోదాల్లో.. ఆ లావాదేవీల సమాచారం అంతా వారికి లభించింది. ఈడీ ఇప్పటికే చాలా సైలెంటుగా విచారణ చేస్తూ.. అన్ని డీటెయిల్స్ తెలుసుకుంది. ఒక్క లక్ష రూపాయలు అక్రమంగా చేతులు మారినా ఈడీ సులువుగా గుర్తించగలదు. అలాంటిది వేల కోట్లు వైట్ చేసుకుంటే గుర్తించలేరా?
నేక్ట్స్ వైట్ రిసీవర్లపై గురి
ఈడీ అధికారులు మొత్తం సూత్రధారికి నగదు ఎలా చేరిందన్నది కూడా గుర్తించారు. హవాలా చేసిన నగదు ఎలా విదేశాలకు వెళ్లింది అన్నది ఇప్పుడు సోదాల్లో తేల్చారు. మళ్లీ తిరిగి ఏ రూపంలో వచ్చింది.. ఎవరి దగ్గరకు చేరిందన్నది కూడా ఇప్పటికే లెక్కలు తీశారు. తదుపరి రౌండ్ ఇదే అంశంపై సోదాలు నిర్వహించే అవకాశం ఉంది. సిట్ విచారణ కీలక దశకు చేరనుంది. సూత్రధారి వద్దకు కేసు చేరినప్పుడు ఈడీ కూడా ఒకే సారి ఎటాక్ చేసి.. పని పూర్తి చేసే అవకాశం ఉంది. లిక్కర్ స్కామ్ సూత్రధారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు పక్కా స్కెచ్ వేసినట్లుగా కనిపిస్తోంది.
తాడేపల్లిలో లాయర్ల హడావుడి
లిక్కర్ స్కామ్ కంగారు పెడుతోంది. జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ .. లాయర్లతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎక్కువగా బెంగళూరులోనే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఇవి తాడేపల్లికి చేరాయి. రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డిని ఈ వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలని జగన్ సూచించినట్లుగా చెబుతున్నారు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుగా వైసీపీ పెద్దలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.