రాజకీయ దొంగలు ఎంత తెలివి మీరిపోయారో ఇదే ఉదాహరణ. లిక్కర్ స్కాంలో వేల కోట్లు దోచుకుని అందులో కొంత మొత్తం ఎన్నికల్లో ఖర్చు పెట్టారు కాబట్టి.. ఆ ఎన్నికలను రద్దు చేయాలని వైసీపీ సానుభూతిపరుడొకరు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇలా కూడా చేయవచ్చా అని ఆశ్చర్యపోయే రీతిలో వ్యవస్థల్ని వాడుకోవడం వైసీపీ నైజం. ఇప్పుడు మరోసారి ఈ పిటిషన్ తో తమ వికృత రూపం చూపించారు.
లిక్కర్ స్కామ్ సొమ్ములతో ఎన్నికల ఖర్చులు
లిక్కర్ స్కామ్‌లో ఐదు సంవత్సరాల పాటు ప్రజల రక్త మాంసాలను పిండుకున్న వారు.. అందులో కొద్ది మొత్తం మళ్లీ ఓట్లను కొనేందుకు ఉపయోగించారు. వందల కోట్లు ఇలా రవణా చేశారు. ఒక్క సారి ఎనిమిదిన్నర కోట్లు దొరికాయి. దొరకకుండా ఎన్ని వందల కోట్లు నియోజకవర్గాలకు చేరిపోయాయో చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే యంత్రాంగం అంతా వారి చేతుల్లోనే ఉండేది. వందల కోట్లను ఇలా వైసీపీ అభ్యర్థులు ఎన్నికల్లో పంచారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఇదే సాకుగా ఎన్నికలు రద్దు చేయాలని పిటిషన్
సిట్.. ఇదే విషయాన్ని చెబుతోంది. అందుకే.. తెలివిగా వైసీపీ.. అలా అయితే ఎన్నికలు రద్దు చేయాలని ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించింది. వైసీపీ దొంగ తెలివి ప్రకారం.. అయితే లిక్కర్ స్కామ్ లో డబ్బులు ఎన్నికలకు వాడలేదని చెబుతారని లేకపోతే ఎన్నికలు రద్దు అవుతాయని ఆశపడుతున్నారు. దొంగలకే ఇన్ని తెలివితేటలు ఉంటే.. ఇక వారిని లోపల వేయాల్సిన వ్యవస్థలకు ఇంకెన్ని తెలివితేటలు ఉండాలి. ఈ చిన్న లాజిక్‌ను మిస్సవుతున్న వారు అడ్డగోలు తెలివిని ప్రదర్శిస్తున్నారు.
మరి లిక్కర్ స్కామ్ చేసిన వాళ్లకు ఏం శిక్ష వేయాలి ?
లిక్కర్ స్కామ్ చేసింది వాళ్లే.. ఆ ఎన్నికల్లో పంచింది వాళ్లే…. ఎన్నికలను రద్దు చేయడం సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు ముందుగా చేయాల్సిది ఆ లిక్కర్ స్కామ్ చేసిన వాళ్లకు శిక్ష విధిండం. ఇంత ఘోరానికి పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. శిక్షలు వేయకుండా.. వారు అలా చేశారని ఎన్నికల్ని రద్దు చేయాలని అడగడంలోనే వారి దొంగ తెలివితేటలు ఉన్నాయి. ఇలాంటి వారిని ఏ మాత్రం ఉపేక్షించినా మొత్తం వ్యవస్థల్ని భ్రష్టుపట్టించేస్తారు.