లిక్కర్ స్కాంలో మాజీ ఎక్సైజ్ మంత్రి, డిప్యూటీ సీఎంగా పేరుకు మాత్రం ఉన్న నారాయణ స్వామి సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎన్ని సార్లు విచారణకు రావాలని పిలిచినా ఆయన రాలేదు. ఆరోగ్యం బాగోలేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇటీవల కూడా ఆయనకు నోటీసులు పంపితే.. తనకు హెల్త్ బాగోలేదని వాట్సాప్ లో దర్యాప్తు అధికారులకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో దర్యాప్తు అధికారులు నేరుగా పుత్తరుజిల్లాలోని ఆయన ఇంటికి వెళ్లారు. ప్రశ్నిస్తున్నారు.
గతంలోనే ఆయన తనకు ఎలాంటి సమాచారం లేదని .. కేవలం మంత్రిగా తాను అవసరమైతే సంతకాలు మాత్రమే చేసేవాడినని నారాయణ స్వామి వీడియో కాల్ ద్వారా విచారణ చేసినప్పుడు చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు నేరుగా ప్రశ్నిస్తున్నారు. ఎక్సైజ్ పాలసీ మార్పు గురించి .. నారాయణ స్వామి తీసుకున్న నిర్ణయాల గురించి ప్రశ్నిస్తున్నారు. ఆయన విచారణకు సహకరించకపోవడంతో అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
నారాయణ స్వామి ఎక్సైజ్ మంత్రే కానీ.. ఆయన ఎప్పుడూ ఒక్కరోజు అయిన సమీక్ష నిర్వహించినట్లుగా మీడియాకు సమాచారం రాలేదు. ఆయన పూర్తిగా తన నియోజకవర్గానికే పరిమితమయ్యేవారు. కల్తీ లిక్కర్ స్కాం ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఆయన మీడియా ముందుకు వచ్చేవారు. కేవలం ఆయన కులాల పేరుతో రాజకీయ విమర్శలు చేయడానికి మాత్రమే ఆయన మీడియా ముందుకు వచ్చేవారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన ఆయనను కేవలం ఓ పదవిలో కూర్చోబెట్టారు కానీ.. ఎలాంటి పవర్స్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఆయన జైలుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.