ఏపీ లిక్కర్ స్కామ్లో ప్రజల రక్తమాంసాలను పిండేసిన వారి బెదిరింపులు రోజు రోజుకు శృతి మించుతున్నాయి. చట్ట, న్యాయ వ్యవస్థలను బెదిరించడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఆదివారం జైలు వద్ద వారు చేసిన హంగామా, బెదిరింపులు, అరుపులు చూస్తే అసలు వారు ఎంత ఘరానా దొంగలే సులువుగా అర్థం చేసుకోవచ్చు. అడ్డంగా దోచుకుని తెగ సంపాదించిన అహంకారం ఎక్కువగా కనిపిస్తోంది. దోచుకున్న వారికే అంత ఉంటే.. వారిని పట్టుకున్న చట్టానికి, న్యాయానికి ఇంకెంత ఉండాలి ?
దొరికిన దొంగల బెదిరింపులు
ఐదు ఏళ్ల పాటు ఏపీ ప్రజలను లిక్కర్ పేరుతో ఎలా దోచుకున్నారో అందరికీ తెలుసు. లిక్కర్ స్కామ్ చేయలేదని ఒక్కరూ నమ్మరు. చెప్పరు కూడా. తాము వ్యాపారం చేశామని వారు అంటారు. అది వ్యాపారం కాదు.. దోపిడీ అని వారికీ తెలుసు. కానీ సమర్థించుకోవడం .. తేడా వస్తే ఇలా బెదిరించడం వారి నైజం. వారి చేతుల్లో ఐదు సంవత్సరాల పాటు వ్యవస్థలు ఉన్నాయంటే.. ఎన్నెన్ని ఘోరాలు జరిగి ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు కూడా వారి ధీమా అదే. అందుకే బెదిరింపులకు పాల్పడుతున్నారు.
వ్యవస్థలు భయపడతాయా ?
లిక్కర్ స్కామ్ నిందితులు బెదిరిస్తున్నది వ్యవస్థల్ని. జైలులో వారు చేసిన హంగామా చూసిన తర్వాత.. చట్ట, న్యాయవ్యవస్థలంటే వారికి ఏ మాత్రం గౌరవం లేదని.. బెదిరించి..భయపెట్టి లొంగదీసుకోవచ్చని గట్టిగా నమ్ముతున్నారని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ వారికి అర్థం కానిదేమిటంటే.. ఎంత పెద్ద పుడింగులైనా.. చట్టం ముందు.. న్యాయం ముందు మరుగుజ్జులే. తప్పు చేస్తే.. కాస్త ఆలస్యంగానైనా శిక్ష అనుభవించాల్సిందే. అధికారంలోకి వచ్చాక అంతు చూస్తామని బెదిరించి చట్ట, న్యాయవ్యవస్థల్ని భయపెడితే.. పరిస్థితులు మరింత తీవ్రమవుతాయి.
ఈ కేసులో బెయిల్స్ వస్తే వారి అరచకానికి హద్దే ఉండదు !
కల్తీ లిక్కర్ లో అడ్డగోలుగా దోచుకుని.. సూత్రధారి వ్యవహారం బయటపడే సమయానికి కుట్రదారులు అసలు టాక్టిక్స్ ప్రదర్శిస్తున్నారు. అడ్డగోలుగా దొరికిపోయిన తర్వాత కూడా వీరు చేస్తున్న అతి చూస్తే.. మన దేశంలో చట్టాలు, వ్వస్థలంటే పలుకుబడి ఉన్న నేరస్తులకు ఎంత చులకున అనేది సులువుగా అర్థమవుతుంది. రాజకీయ కుట్రలని చెప్పి.. మొత్తంగా తమ దోపిడీకి ఆమోద ముద్ర వేసుకునే కుట్రలు చేస్తున్నారు. వీరిని ఇలా వదిలేస్తే.. ఇక రాజకీయంగాదోచుకునేవారిని ఎవర్నీ ఏ వ్యవస్థలూ ఏమీ చేయలేవన్న ఆందోళన వ్యక్తమవుతోంది.