షార్ట్ లిస్ట్ ప్రకారమే మంత్రులు టార్గెట్ అయ్యారా..!?

ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో టైంలో ఒక్కో మంత్రి వార్తల్లోకి వస్తున్నారు. ఎందుకలా వస్తున్నారో వైసీపీ నేతలకు మాత్రమే కాస్త లీలగా తెలుస్తోంది. జరుగుతున్నదంతా.. ఖచ్చితంగా అధికార పార్టీ పెద్దల ప్రోద్భలంతోనేనని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. కానీ ఆ మంత్రులు ఏమీ చేయలేని పరిస్థితి. కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి గుమ్మనూరు జయరాం కొన్నాళ్ల కిందట వార్తల్లోకి వచ్చారు. ఆయన అవినీతి వ్యవహారాలంటూ… ప్రతీ రోజూ అనేక వివరాలు బయటకు వచ్చాయి. పేకాట క్లబ్బుల దగ్గర్నుంచి భూకబ్జాల వరకూ సీరియల్‌గా వచ్చాయి. వివాదాస్పదం అయ్యారు. ఆయన సైలెంటయ్యారు. ఇప్పుడు ఆయన పదవి ఉంటుందని గ్యారంటీ లేదు. పంచాయతీ ఎన్నికల్లో కీలక గ్రామాల్లో టీడీపీ గెలిచింది.

ఆ తర్వాత కొంత కొడాలి నాని వివాదాస్పదమయ్యారు. ఆయన నోటిని అదే పనిగా ఉపయోగించుకున్న వైసీపీ చివరికి.. పేకాట క్లబ్బుల వ్యవహారంలో బుక్ చేసేసింది. చివరికి చట్టాన్ని ధిక్కరించినట్లగా పేకాట క్లబ్‌లు నడుపుతాం… ఫైన్లు కడతామని ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఆయన పదవిపైనా డౌటనుమానం వైసీపీలో ప్రారంభమయింది. ఇక ఇప్పుడు మంత్రి వెల్లంపల్లిది అదే పరిస్థితి. దుర్గగుడిలో అవినీతి మొత్తం ఆయన చలువేనని చూపించడానికి ఏసీబీ సోదాలు జరిగాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏసీబీ నివేదిక ఆ తరహాలోనే ఉందని.. త్వరలోనే బయట పెడతారని అంటున్నారు. వెల్లంపల్లిని పదవి నుంచి తప్పించడానికి కారణాలు వెదుక్కుంటున్నారని అంటున్నారు.

యాక్టివ్ గా ఉండే మంత్రులపై ఇలాంటి వివాదాలు వస్తున్నాయి. సైలెంట్ గా ఉండి.. అసలు మంత్రులుగా ఉన్నారా లేదా.. అన్నట్లుగా ఉన్న వారిపై ఎలాంటి వివాదాలు లేవు. దీనికి కారణం రేపు మంత్రి పదవి నుంచి వారిని తప్పించినా సైలెంట్ గా ఉంటారే తప్ప హడావుడి చేయరు. కానీ మంత్రి పదవి ఉందని హైలెట్ అవ్వాలని ప్రయత్నించిన వాళ్లకే సమస్య వస్తోందని వైసీపీ వర్గాలు విశ్లేషిస్తున్నారు. సీఎం జగన్ పదవి చేపట్టినప్పుడే చాలా స్పష్టంగా చెప్పారు.. రెండున్నరేళ్లే మంత్రి పదవులు అని. ఇప్పుడు ఆ గడువు ముంచుకొస్తోంది. హైకమాండ్ ఎవరెవర్ని తప్పించాలో షార్ట్ లిస్ట్ చేసుకుని వారిని టార్గెట్ చేసుకుని వివాదాల్లోకి నెడుతోందని… అంటున్నారు. ఇప్పుడు వివాదాల్లోకి వస్తున్న వారందరికీ రేపు పదవులు ఉండవని సంకేతాలని అంటున్నారు. మొత్తానికి వైసీపీలో అంతర్గత రాజకీయం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. దాన్ని అంచనా వేయడం ఆ పార్టీ నేతలకు కూడా సాధ్యం కాకపోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అచ్చెన్నపై స్టింగ్ ఆపరేషన్..!

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రైవేటు సంభాషణలను స్టింగ్ ఆపరేషన్ పేరుతో కొంత మంది సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఆ వీడియోలను వైసీపీ అనుకూల మీడియా విస్తృతంగా సర్క్యూలేట్ చేస్తోంది. ప్రధానంగా...

కర్ణాటక డ్రగ్స్ కేసులో తెలంగాణ ఎమ్మెల్యేలు – రాజకీయ కుట్ర ఉందా ?

తెలంగాణ రాజకీయ నేతలపై బెంగళూరు పోలీసులు మీడియాకు ఇస్తున్న లీకులపై తెలంగాణ రాజకీయ నేతల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఖచ్చితంగా రాజకీయం ఉందని అనుమానిస్తున్నారు. బెంగళూరులో అధికారంలో ఉన్న బీజేపీనే .... డ్రగ్స్...

టాలీవుడ్ కి ఉగాది శోభ‌

పోయిన ఉగాది... `క‌రోనా` పుణ్యాన రుచీ ప‌చీ లేకుండా చ‌ప్ప‌గా సాగిపోయింది. ఈసారి క‌రోనా భ‌యాలు ఉన్నా... టాలీవుడ్ లో శోభ క‌నిపించింది. ప్ర‌తీ ఉగాదికీ.. టాలీవుడ్ లో కొత్త సినిమాలు మొద‌లు...

బాల‌య్య టైటిల్ `అఖండ`

బోయ‌పాటి శ్రీ‌ను షాకిచ్చాడు. బాల‌కృష్ణ సినిమా కోసం ఓ కొత్త టైటిల్ ప్ర‌క‌టించి, అంద‌రినీ ఆశ్చ‌ర్య‌పరిచాడు. బాల‌కృష్ణ - బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ...

HOT NEWS

[X] Close
[X] Close