భలే షార్ట్ కట్ కనిపెట్టావయ్యా రఘువీరా!

గతేడాది జరిగిన ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ మాట తప్పారు. మళ్ళీ ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్రానికి ఏకంగా రూ.1.65 లక్షల కోట్లు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ ఇస్తానని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. ఆయన ఏపీ ప్రజలను మోసగించినట్లే బీహార్ ప్రజలను కూడా మోసగిస్తారని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. తాము స్వయంగా బీహార్ వెళ్లి అక్కడి ప్రజలకు నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఏవిధంగా మోసగించింది వివరిస్తామని పీసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ప్రకటించారు. బీహార్ ప్రజలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలలాగే నరేంద్ర మోడీ మభ్యపెట్టి వారి ఓట్లు రాబట్టుకొని రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని, కానీ ఈ ఎన్నికలలో బీజేపీ గెలిచినా, ఓడిపోయినా బీహార్ కి ఆయన ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజీ ఇవ్వరని, ప్రత్యేక హోదాపై ఆయన ఇచ్చిన మాట తప్పడమే అందుకు చక్కటి ఉదాహరణ అని రఘువీరా రెడ్డి వాదిస్తున్నారు.

ఇదే విషయం బీహార్ ప్రజలకు అర్ధమయ్యేలా విడమరిచి చెపుతామని అన్నారు. త్వరలోనే ఆయనతో సహా పల్లం రాజు, జేడి శీలం, కెవిపి రామచంద్రరావు తదితరులు బీహార్ బయలుదేరడానికి సిద్దం అవుతున్నారు. అయితే తీరా చేసి అంతదూరం వెళ్ళి వచ్చీరాని హిందీ బాషలో బీహారీ ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పగలమా…లేదా? అనే ధర్మసందేహం వారికి కలిగినట్లుంది. అందుకే రఘువీరా రెడ్డి ఒక మంచి ఐడియా కనిపెట్టారు.

బీహార్ కి వెళుతున్న పాట్నా ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకొన్నప్పుడు రఘువీరా రెడ్డి తదితర కాంగ్రెస్ నేతలు ఆ రైలులో ప్రయాణిస్తున్న బీహారీ ప్రయాణికులకు నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలని ఏవిధంగా మోసం చేసింది వివరించి వారికి కరపత్రాలు కూడా పంచిపెట్టారు. రైల్వే స్టేషన్లో అటువంటి రాజకీయ ప్రచారాలకు అనుమతించరు కనుక రైల్వే పోలీసులు వారిని అరెస్ట్ చేసి తరువాత విడుదల చేసారు. శ్రమపడి బీహార్ వెళ్లి ఆయాసపడటం కంటే, ఉన్న ఊళ్లోనే ఈవిధంగా పని కానిచ్చేసారు రఘువీరా రెడ్డి. అయినా అధికారంలో ఉన్నప్పుడయితే వెనుకా ముందు చూసుకోనవసరం ఉండదు కానీ ఇప్పుడు మళ్ళీ ఎప్పటికయినా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందో లేదో చూసుకోకుండా విచ్చల విడిగా డబ్బులు ఖర్చు చేస్తే కష్టం కదా? బహుశః అందుకే రఘువీరా రెడ్డి ఈ షార్ట్ కట్ కనిపెట్టి సింపుల్ గా పనిముగించేసినట్లున్నారు. కానీ తామంతా తప్పకుండా బీహార్ వెళ్లి మోడీ చేసిన మోసం గురించి అక్కడి ప్రజలకు వివరిస్తామని రఘువీరా రెడ్డి అంటున్నారు. వచ్చే నెల 5వ తేదీతో అక్కడ ఎన్నికలు పూర్తయిపోతాయి. మరి రఘువీరుడు ఇంకా ఎప్పుడు బయలుదేరుతారో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హోదా ఇస్తేనే విభజన చట్టం అమలు..! హైకోర్టుకు ఏపీ సర్కార్ అఫిడవిట్..!

అమరావతి మార్పు గురించి ప్రస్తావన లేని పిటిషన్‌పై వేసే అఫిడవిట్లలో అటు కేంద్రం..ఇటు ఏపీ...రాజధాని మార్పు గురించి తమ విధానానని హైకోర్టులో చెప్పడం... ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2018 మార్చి 29న విభజన...

ఆహా ప్లానింగ్ : చిరుతో వెబ్ సిరీస్… 42 షోస్‌

తొట్ట తొలి ఓటీటీ సంస్థ ఆహా.. భారీ ప్లానింగ్ తో రాబోతోంది. వ‌రుస‌గా సినిమాలు కొంటూ, వెబ్ సిరీస్ లు రూపొందిస్తూ.. కంటెంట్ బ్యాంక్ ని పెంచుకుంటోంది ఆహా. రాబోయే రోజుల్లో ఆహా...

170 కోట్ల‌తో ఓటీటీ సినిమానా?

ఓటీటీ.. ప‌రిధి పెరుగుతోంది. చిత్ర‌సీమ‌ని మెల్ల‌మెల్ల‌గా ఓటీటీ ఆక్ర‌మించుకుంటోంది. నిర్మాత‌ల‌కు ఇదో ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా మారింది. థియేట‌ర్ల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఓటీటీ త‌న రూపాన్ని మార్చుకుంటోంది. ఓటీటీ సంస్థ‌లే... భారీ పెట్టుబ‌డితో సినిమాలు...

ఫ్లాప్ హీరోతో.. యూవీ సినిమా

ద‌ర్శ‌కుడు శోభ‌న్ గుర్తున్నాడా? వ‌ర్షం సినిమా ద‌ర్శ‌కుడు. ప్ర‌తిభావంత‌మైన ద‌ర్శ‌కుడు... చాలా త‌క్కువ వ‌య‌సులోనే క‌న్నుమూశాడు. త‌న త‌న‌యుడే సంతోష్. త‌ను నేను, పేప‌ర్ బోయ్ సినిమాల‌లో హీరోగా క‌నిపించాడు. ఆ...

HOT NEWS

[X] Close
[X] Close