ఇష్టం వచ్చినట్లుగా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న వారిపై ఏపీ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. బస్సు ప్రమాదం విషయంలో అదే పనిగా తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. మొదటగా బస్సు ఫిట్ నెస్ గురించి.. తర్వాత బైక్ ప్రమాదం గురించి.. చివరిగా.. బైకర్ తాగిన మద్యం గురించి తప్పుడు ప్రచారాలు చేశారు. బెల్ట్ షాపులో కొనుగోలు చేశారని.. అధికార ప్రతినిధి శ్యామల ఆరోపించారు.
కానీ వారు లైసెన్స్డ్ మద్యం షాపులోనే కొనుగోలు చేశారని సీసీ ఫుటేజీ వెలుగులోకి వచ్చింది. అదే సమయంలో ఫ్యాక్ట్ చెక్ కూడాఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేసే వారిపై కేసులు పెడతామని హెచ్చరించింది. అయినా వారు కరెక్ట్ చేసుకోలేదు. వైసీపీ నేతలతో పాటు సోషల్ మీడియా కూడా అదే ఫేక్ న్యూస్ ను ప్రచారం చేసింది. అధికారికంగా మీడియా ముందు బెల్ట్ షాపులని ఆరోపణలు చేసిన శ్యామల వివరణ ఇవ్వకపోవడంతో కేసు నమోదు చేశారు.
ఏపీలో ఏం జరిగినా తప్పుడు ప్రచారాలు చేయడమే రాజకీయం అన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తోంది. ఈ విషయంలో ఉపేక్షిస్తే.. తొండ ముదిరి ఉసరవెల్లి అయిన చందంగా మారుతుందన్న ఉద్దేశంతో పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. శ్యామలకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. మళ్లీ మళ్లీ ఇలా తప్పుడు ప్రచారం చేస్తే సీరియల్ అఫెండర్ గా పరిగణించే అవకాశాలు ఉన్నాయి.
 
                                                 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
                                               
                                               
                                               
                                               
                                               
                                                   
                                                   
                                                   
                 
                 
                 
                 
                