మగోడైనా దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకోపోతే చితక్కొట్టుడే !

పోలీసులు ఏం చేయాలి ? . ఏపీ పోలీసులు ఏం చేస్తున్నారు ? . ఏపీ ప్రభుత్వం దిశయాప్ అనే ఓ యాప్ ను రూపొందించింది. ఆపదలో ఉన్న అమ్మాయిలు రెండు సార్లు అలా ఊపితే పోలీసులు వచ్చేస్తారని ఉదరగొట్టింది. ఆ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని మహిళల్ని కోరింది. ఇదిగో ఇలా స్పందిస్తామంటూ రెండు, మూడు సార్లు పీఆర్ స్టంట్లు కూడా చేశారు. కానీ ఏపీ పోలీసులపై ఎవరికీ నమ్మకం లేదేమో కానీ డౌన్ లోడ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో పోలీసులు లాఠీ పట్టుకుని వచ్చి బెదిరించి మరీ డౌన్ లోడ్ చేయడం ప్రారంభించారు. కామెడీ ఏమిటంటే… డౌన్ లోడ్స్ కోసం పురుషులతోనూ ఆ యాప్ ను ఇన్ స్టాల్ చేయించడం.

ఇలా విశాఖలో ఓ బస్ స్టాప్‌లో బస్ కోసం వెయిట్ చేస్తున్న సైనికుడితో పోలీసులు వాదన పెట్టుకున్నారు. మొదట ఫోన్ చూపించమన్నారు. దిశ యాప్ లేదంటే… బలవంతంగా డౌన్ లోడ్ చేశారు. ఓటీపీ వచ్చాక.. వాళ్లకు చెప్పమన్నారు. అదేంటి ఓటీపీ ఎందుకు చెప్పమంటున్నారు .. మీ ఐడీ కార్డులేవి అని అడిగితే… మా డ్రస్స్ కనిపించడం లేదా అని.. ఆ సైనికుల్ని మక్కెలిరగతన్నారు. ఇద్దరు సరిపోరని మరో ఇద్దర్ని పిలిపించి అందరి ముందు తన్నారు. ఆ వ్యక్తి సైనికుడు అని తెలిసి .. ఐడీ కార్డు తీసుకుని వెళ్లారు. ఏపీలో ఇలాంటివి కోకొల్లలు. ఎవరో వీడియో తీసి వైరల్ చేస్తే తప్ప చర్యలుతీసుకోలేరు. ఈ వీడియో వైరల్ అయ్యే సరికి.. పోలీసు ఉన్నతాధికారులు సైనికులపై దాడి చేసిన నలుగుర్ని వీఆర్‌కు పంపారు.

అసలు తన్నడం వరకూ పోలీసులు ఎందుకు వచ్చారనేది అసలు కథ. దిశ యాప్ ను ఇలా బెదిరించి మరీ డౌన్ లోడ్ చేయించాల్సిన అవసరం ఏమిటి ? . డౌన్ లోడ్ చేసుకోకపోతే కేసులు పెట్టి కొట్టేస్తారా ? . మహిళల ఫోన్లలో ఉండాల్సిన యాప్ పురుషుల ఫోన్లలో ఎందుకు డౌన్ లోడ్ చేయిస్తున్నారు ?. ఫోన్ డేటా మొత్తాన్ని కొట్టేయడానికి ప్రభుత్వం ఇలా పోలీసులతో ప్లాన్ చేయిస్తోందా ?

పోలీసులు అంటే సహజంగా దొంగలు, దుండగలు , రౌడీలు భయపడతారు. కానీ ఏపీలో అలాంటి వారంతా హాయిగా ఉంటారు. పోలీసుల తో భాయి భాయి అన్నట్లుగా ఉంటారు. కానీ సామాన్యప్రజలు మాత్రం వణికిపోతూంటారు. ఆహా.. క్రిమినల్ పాలన అని అనుకోకుండా ఉండలేని పరిస్థితి.

https://x.com/Telugu360/status/1722081689013199060?s=20

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు బెయిల్ రద్దు కాలేదు సరి కదా సర్కార్‌కు సుప్రీం షరతు !

చంద్రబాబు జనాల్లోకి వస్తే తమ పరిస్థితి ఏమి అయిపోతుందోనని కంగారు పడిపోతున్న జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ సుప్రీంకోర్టులోనూ దాని కోసమే ప్రయత్నించారు. చంద్రబాబు రాజకీయ ర్యాలీలు, సమావేశాల్లో పాల్గొనకుండా షరతులు విధించాలని...

గెలిపించకపోతే చచ్చిపోతా : బీఆర్ఎస్ అభ్యర్థి

ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులు చివరి ప్రయత్నంగా ఆత్మహత్య చేసుకుంటామని ఓటర్లను బెదిరిస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ పై పోటీ చేస్తున్న కౌశిక్ రెడ్డి చివరి ప్రయత్నంగా ఓటర్లను బెదిరించడం...

యానిమ‌ల్ మిషన్ గ‌న్ @ రూ.50 ల‌క్ష‌లు

ఈమ‌ధ్య యాక్ష‌న్ సినిమాల్లో పెద్ద పెద్ద మిష‌న్ గ‌న్‌ల‌తో హీరోలు శ‌త్రు శంహారానికి పూనుకొంటున్న సీన్లు చూస్తూనే ఉన్నాం. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, ఖైదీ, విక్ర‌మ్, మార్క్ ఆంటోనీ చిత్రాల్లో హీరోలు...
video

క‌థంతా దాచేసి.. ట్రైల‌ర్ క‌ట్ చేశారు!

https://www.youtube.com/watch?v=GnO4cOx_wFQ నితిన్ - వ‌క్కంతం వంశీ సినిమా `ఎక్ట్రా ఆర్డిన‌రీ మెన్‌` ట్రైల‌ర్ వ‌చ్చింది. ట్రైల‌ర్ అంతా స‌ర‌దా స‌ర‌దాగా సాగిపోయింది. నితిన్ లుక్ క్లాస్ గా ఉన్నా, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివ‌రీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close