ఏపీ పోలీసులకు “ఫ్యాక్ట్ చెక్” బాధ్యతలు..!

ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల బాధ్యతల్లో కొత్తగా ఫ్యాక్ట్ చెక్ కూడా చేరింది. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ప్రచారం అంశానికి సంబంధించి ఫ్యాక్ట్ చెక్ పేరుతో పోలీసులు ఇక పోస్టింగ్‌లు పెడతారన్నమాట. ఇందు కోసం ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌ వెబ్‌సైట్‌, ట్విట్టర్‌ అకౌంట్‌ రూపొందించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా వీటిని కంప్యూటర్ మీట నొక్కి ప్రారంభించారు. మీడియాలో, సోషల్ ‌మీడియాలో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వీటిని ఆధారాలతో సహా ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌ వేదికలుగా ప్రభుత్వం ఖండిస్తుందని సీఎంచ ెప్పుకొచ్చారు.

నిజానికి ఫ్యాక్ట్ చెక్ పేరుతో పోలీసులు ఎప్పుడో రాజకీయ విమర్శలు చేయడం ప్రారంభించారు. గతంలో గుంటూరు అర్బన్ అమ్మిరెడ్డి.. ఓ టీడీపీ కార్యకర్తను అదుపులోకి తీసుకున్న అంశంపై లోకేష్ ట్వీట్ పై ఫ్యాక్ట్ చెక్ పేరుతో ట్వీట్లు చేశారు. లోకేష్‌ తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే పోలీస్ స్టేషన్ ఫుటేజీ బయటపెట్టాలని లోకేష్ డిమాండ్ చేయడంతో అరెస్ట్ చేయలేదని ప్రశ్నించడానికి తీసుకొచ్చామని.. ఫ్యాక్ట్ చెక్ అమ్మిరెడ్డి కవర్ చేసుకున్నారు. తర్వాత కూడా… అదే విధంగా ఏపీ పోలీసు శాఖ స్పందించింది. విశాఖపట్నంలో టీడీపీ కార్యాలయంపై దాడికి వచ్చిన వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో.. వైసీపీ కార్యకర్తలు పోలీసులతో దుందుడుకుగా ప్రవర్తించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాక్ట్ చెక్ పేరుతో పోలీస్ శాఖ స్పందించింది. వైసీపీ కార్యకర్తలుదాడులు చేయలేదని మసార్ చేశారని ఫ్యాక్ట్ చెక్ చేసి చెప్పింది.

బహుశా.. ఆ ఫ్యాక్ట్ చెక్ స్ఫూర్తితోనే కావొచ్చు… ఈ వెబ్ సైట్‌ను.. ట్విట్టర్ అకౌంట్‌ను రూపొందించినట్లుగా తెలుస్తోంది. కేవలం.. ఫ్యాక్ట్ చెక్ పోస్టులు చేయడమే కాకుండా.. కేసులు కూడా పెట్టాలని.. అధికారులకు సీఎం జగన్ సూచించారు. ప్రచారం మొదట ఎక్కడనుంచి మొదలయ్యిందో దాన్ని గుర్తించి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. ఒక వ్యక్తి ప్రతిష్టను, ఒక వ్యవస్థ ప్రతిష్టను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే హక్కు ఏ ఒక్కరికీ లేదని చెప్పుకొచ్చారు. పోలీసులు అందరి పోస్టులను పరిశీలించి.. ఫ్యాక్ట్ చెక్‌ను నడిపితే బాగానే ఉంటుంది. కానీ వైసీపీ సోషల్ మీడియాలో వచ్చే అన్ని పోస్టులు ఫ్యాక్టేనని అనుకుని.. కేవలం వైసీపీ సోషల్ మీడియా చేసే ఫిర్యాదులను మాత్రమే చెక్ చేస్తేనేసమస్య వస్తోంది. ఇప్పటి వరకూ అదే జరుగుతోంది. ఈ ఫ్యాక్ట్ చెక్‌తోనూ అదే జరుగుతుంది. అంతకు మించి ఎక్కువగా విపక్షాలు… కూడా ఆశించడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారిని ఒక్క సారీ దర్శించుకోని వైసీపీ అభ్యర్థి..!

తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తిపై భారతీయ జనతా పార్టీ నేతలు కొత్త కొత్త విషయాలు ప్రసారం చేస్తున్నారు. తిరుపతి ఎంపీ అభ్యర్థి ఇంత వరకూ ఒక్క సారంటే ఒక్క సారి కూడా తిరుమల...

కోల్‌కతా ఓడిపోవడానికే ఆడినట్లుందే..!?

ఎవరైనా మ్యాచ్‌లు ఎందుకు ఆడతారు..? గెలవడానికే ఆడతారు. కానీ ఓడిపోవడానికే ఆడితే ఎలా ఉంటుంది..?. నిజంగా ఓడిపోవడానికి ఎవరూ ఆడరు..కానీ మంగళవారం నాటి ముంబై, కోల్‌కతా మ్యాచ్ చూస్తే రెండు జట్లు ఓడిపోవడానికి...

ఆ ప్రాజెక్ట్ చూస్తామంటే కుదరదంటోన్న ఏపీ..!

ఓ ప్రాజెక్ట్‌ను చూడటానికి వస్తామని కృష్ణాబోర్డు అంటోంది. చూసేందుకు కూడా ఒప్పుకోబోమని.. ఏపీ సర్కార్ తేల్చి చెబుతోంది. కృష్ణా బోర్డు మాత్రం.. అదే పనిగా తాము వస్తున్నామని తేదీ ఖరారు చేసి ఏపీ...

ఏపీలోనే ధరలెక్కువ..! ఎందుకని..?

సాధారణంగా నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి..? పట్టణాల్లో .. నగరాల్లో ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో దేశంలో అన్ని ప్రాంతాల్లో ఉన్న సాధారణ రేట్లే ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం.. నిత్యావసర...

HOT NEWS

[X] Close
[X] Close