ఫ్యాక్ట్ చెక్ ఏపీ.. నిజాలు చెప్పలేక తంటాలు !

ఏపీ పోలీసులు ఫ్యాక్ట్ చెక్ చేస్తామంటూ ప్రత్యేకంగా ఫ్యాక్ట్ చెక్ ఏపీ అంటూ కొత్త విభాగాన్ని చాలా కాలం కిందట ప్రారంభించారు. ఇందులో సామాన్యులు తప్పుడు సమాచారం వల్ల నష్టపోయే అంశాలపై నిజనిర్దారణ చేసి అవగాహన కల్పిస్తారేమో అనుకున్నారు. ఎందుకంటే ఆన్ లైన్ ప్రపంచంలో చిన్న మెసెజులను పంపి సర్వం దోచుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఏపీ పోలీసుల ఈ ఫ్యాక్ట్ చెక్ మాత్రం అలాంటి చిన్న విషయాల గురించి పట్టించుకోదు. పూర్తి స్థాయిలో రాజకీయాలకే పరిమితమైంది. అదీ కూడా నిజాలను .. అది నిజం కాదనిచెప్పడానికన్నట్లుగా మారిరిపోయింది.

రెండు రోజులుగా వైసీపీకి ఇబ్బ్ందికరంగా మారిన రెండు అంశాలపై ఫ్యాక్ట్ చెక్ చేశారు. ఆవి చూసిన తర్వాత అందరికీ… వాళ్లు చెప్పింది నిజం కాదు.. అని అనిపించి ఉంటాయి. మొదట తిరుపతిలో గోడులకు దేవుడి బొమ్మలు తొలగించి వైసీపీ రంగులు వేశారు. దానిపై సోషల్ మీడియాలో దుమారం రేగడంతో ఫ్యాక్ట్ చెక్ చేశారు. అబ్బే అవి వైసీపీరంగులు కాదు… దేవుడి బొమ్మలు తీసేయలేదు అని కవర్ చేసుకున్నారు.కానీ అసలు నిజాల్ని నెటిజన్లు వీడియో రూపంలో బయట పెట్టేశారు.

ఇక ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఏపీ నెంబర్ వన్ అని తేలింది. దీన్ని కవర్ చేసుకోవడానికి.. చేసిన ప్రయత్నం ఏపీ ఫ్యాక్ట్ చెక్‌ను వైసీపీ హ్యాండిల్ అన్నఅనుమానం వచ్చేలా చేసింది. అసలు న్యూస్ ను పక్కన పెట్టి ఫోటో పాతది వాడారంటూ ఫ్యాక్ట్ చెక్ చేశారు. దీంతో ఫోటోనే తప్పు.. న్యూస్ కరెక్టేగా అని అందరూ ట్రోల్ చేశారు. ఈ కారణంగా పోలీసులు గంజాయి నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై మరో పోస్ట్ చేశారు. వీరి తీరు చూసి చాలా మంది.. వివేకా కేసులో హత్య గురించి ఫ్యాక్ట్ చెక్ చేయాలంటూ ట్యాగ్ చేస్తున్నారు.

మొత్తం పోలీసు వ్యవస్థ ప్రజల కోసం కాకుండా పార్టీ కోసం పని చేస్తున్నట్లుగా ఉందన్న అభిప్రాయం ఇలాంటి ఫ్యాక్ట్ చెక్ ఏపీ వంటి పోలీసులు నడుపుతున్న వ్యవస్థల వల్ల మరింత బలపడుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close