లిక్కర్ స్కాంలో ఏడెనిమిది మంది నిందితులు దుబాయ్లో తలదాచుకున్నారు. నెల్లూరులో కాకాని, అనిల్ కుమార్ కలిసి దోచుకున్న క్వార్ట్జ్ దోపిడీలో నిందితులు కూడా దుబాయ్ లోనే తలదాచుకున్నారు. వారు దొరికితే తాము దొరికిపోతామని పెద్దలు అనుకుంటే.. వారిని సేఫ్ గా దుబాయ్ కు తరలించి అక్కడ షెల్టర్ ఇస్తున్నారు. ఈ దుబాయ్ లింకులు చూసి దర్యాప్తు చేస్తున్న అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు.
లిక్కర్ స్కాంలో పాత్రధారులకు ఎంత మొత్తం అందిందో తెలియదు కానీ.. వారు మాత్రం కేసుల పాలవుతున్నారు. పరారవుతున్నారు. మాకెందుకు ఈ బాధ .. లొంగిపోయి అప్రూవర్లుగా మారి అంతా నిజాలు చెప్పేస్తే సరిపోతుదంని అనుకుంటారని.. వారిని సేఫ్ గా దేశం దాటించేశారు నిందితులు. దుబాయ్ లో షెల్టర్ ఇస్తూ రాకుండా చూసుకుంటున్నారు. లిక్కర్ కేసులోనే కాదు.. క్వార్ట్జ్ కేసులో కూడా అనిల్ కుమార్ పీఏ, డబ్బులను వసూలు చేసిన వాళ్లు కూడా అదే పని చేశారు. దుబాయ్ చెక్కేశారు.
లిక్కర్ స్కాం నిందితులకు దుబాయ్ లో ఆశ్రయం ఇచ్చిన శ్రవణ్ రావు చెందిన ఫ్లాట్ లోనే వారు ఉన్నారు. వారి ఆచూకీ తెలిసింది కాబట్టి అక్కడి నుంచి మకాం మార్చి మరో చోట ఉండి ఉండవచ్చు కానీ.. కావాలనే అలా దాక్కుంటున్నారని మాత్రం స్పష్టమవుతోంది. వారిని తీసుకు రావడం పెద్ద విషయం కాదు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇన్వాల్వ్ అయితే చాలు. అందుకే వారిని తీసుకు వచ్చేందుకు అన్ని ప్రయత్నాలను సీఐడీ సిట్ అధికారులు చేస్తున్నారు.