పార్ట్ టైమ్ స్పీకర్.. ఫుల్‌టైమ్ అధికార ప్రతినిధి..!

రాజధాని విషయంలో.. ఉత్తరాంధ్రలో ఓ ఎమోషన్ ఉందని.. దాన్ని చంద్రబాబును తిట్టడం ద్వారానే.. హైలెట్ చేయవచ్చని.. వైసీపీ నేత తమ్మినేని సీతారాం గట్టిగా భావిస్తున్నారు. ఉత్తరాంధ్రలో అలాంటి వ్యూహాన్ని అమలు చేసే సమర్థులైన వైసీపీ నేతలు ఆయనకు కనిపించినట్లుగా లేరు. అందుకే.. తానే స్వయంగా.. తన రాజ్యాంగబద్ధ హోదాను పక్కన పెట్టేసి.. మైక్ అందుకుంటున్నారు. దాదాపుగా ప్రతీ రోజు.. శ్రీకాకుళంలో చంద్రబాబును చెడామడా తిట్టేస్తున్నారు. చంద్రబాబు ఓ మనిషా.. అని స్టార్ట్ చేసి.. అమరావతి రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులుగా అవమానకరంగా మాట్లాడేస్తున్నారు. అదే సమయంలో.. తమ ఉత్తరాంధ్ర ఆకలితో అలమటిస్తున్నదని.. జగన్ అన్నం పెట్టాలని చూస్తూంటే.. చంద్రబాబు తన్నేస్తున్నాడని.. సెంటిమెంట్ పెంచేందుకు తన వంతు సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేనా.. టీడీపీ నేతల్ని రెచ్చగొట్టేందుకు.. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలవి ఒక బతుకులేనా అంటూ.. హేళన చేస్తున్నారు.

తమ్మినేని సీతారం.. ఓ రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నారు. స్పీకర్‌గా ఆయన పార్టీలకు .. కుల, మత , ప్రాంత రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ సీతారాం మాత్రం.. వాటన్నింటినీ.. మొదటి నుంచి పరిగణనలోకి తీసుకోవడం లేదు. అసలు ఈ విశాఖ రాజధాని అంశం రాక ముందు నుంచే ఆయన చంద్రబాబుపై బూతులు లంకించుకుంటున్నారు. అగ్రిగోల్డ్ విషయంలో చంద్రబాబు బట్టలూడదీస్తామని… ఆయన వ్యాఖ్యానించారు. ఫలితంగా.. ఆయనపై… కూడా.. టీడీపీ నేతలు అదే రేంజ్‌లో ఫైరయ్యారు. చివరికి స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని కూడా ఆయన కాపాడలేకపోతున్నారన్న విమర్శలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి.

తమ్మినేని వ్యాఖ్యలను.. ఆయన సమీప బంధువు.. ఆముదాల వలస మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్.. సెటైరిక్‌గా ఎప్పటికిప్పుడు తిప్పికొడుతున్నారు. ఆయన పోతరాజులాగ… బయటకు వచ్చి.. తనను తాను కొట్టుకుంటున్నారని… విమర్శిస్తున్నారు. తమ్మినేనికి శ్రీకాకుళంపై.. ఉత్తరాంధ్రపై అంత అభిమానం ఉంటే… ఆముదాల వలసలో సెక్రటేరియట్ పెట్టించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. స్పీకర్ తమ్మినేని మాత్రం.. రివర్స్‌లో వచ్చే సవాళ్లను పట్టించుకోవడం లేదు. తన దారిలో తాను వెళ్తున్నారు. అందుకే్.. తమ్మినేని స్పీకర్ గా కంటే..అధికార ప్రతినిధిగానే తన బాధ్యతలు ఎక్కువగా నిర్వహిస్తున్నారని.. జనం సెటైర్లు వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇక రైతుల ఉద్యమంపై ఉక్కుపాదమేనా..!?

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులుచేస్తున్న ఉద్యమం హింసాత్మకమయింది. రిపబ్లిక్ డే రోజున రైతు సంఘాలు చేపట్టిన ర్యాలీ దారి తప్పింది. కొంత మంది ఎర్రకోటపైకి ఎక్కి సంబంధం లేని జెండాలు ఎగురేశారు. మరికొంత...

తెలంగాణ ఉద్యోగులకు అన్‌ ” ఫిట్‌మెంటే “

తెలంగాణ ఉద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న వేతన సవరణ నివేదిక వారికి షాకిచ్చింది. కేవలం 7.5శాతం ఫిట్‌మెంట్ మాత్రమే సిఫార్సు చేసింది. ఉద్యోగ సంఘాలు కనీసం 30 నుంచి 40శాతం...

కేరళ, బెంగాల్ గవర్నర్లు అలా.. .. ఏపీ గవర్నర్ ఇలా..!

గవర్నర్ రాజ్యాంగాధిపతి. రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగితే జోక్యం చేసుకోవాల్సింది ఆయనే. ఆయనకు అలాంటి అధికారాలు ఉన్నాయి కాబట్టే... బెంగాల్, కేరళ వంటి చోట్ల.. ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేస్తున్నారు. కేంద్రానికి ఫిర్యాదులు పంపుతున్నారు....

ద‌ర్శ‌కేంద్రుడి ఓల్డ్ స్కూల్ స్టైల్‌లో `ఓ బాబూ..`

రాఘ‌వేంద్ర‌రావు... న‌టుడిగా మేక‌ప్ వేసుకుని తొలిసారి కెమెరా ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే. త‌నికెళ్ల భ‌ర‌ణి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. `ఓ.. బాబూ` అనే పేరు ప‌రిశీల‌న‌లో వుంది. ఈ చిత్రానికి...

HOT NEWS

[X] Close
[X] Close