ఆ ప్రాజెక్ట్ చూస్తామంటే కుదరదంటోన్న ఏపీ..!

ఓ ప్రాజెక్ట్‌ను చూడటానికి వస్తామని కృష్ణాబోర్డు అంటోంది. చూసేందుకు కూడా ఒప్పుకోబోమని.. ఏపీ సర్కార్ తేల్చి చెబుతోంది. కృష్ణా బోర్డు మాత్రం.. అదే పనిగా తాము వస్తున్నామని తేదీ ఖరారు చేసి ఏపీ సర్కార్‌కు సమాచారం ఇస్తోంది. ఎలాగైనా అడ్డుకుంటామని ఏపీ సర్కార్ సంకేతాలు పంపుతోంది. ఇది రెండు, మూడునెలలుగా సాగుతోంది. ఆ ప్రాజెక్ట్ రాయలసీమ ఎత్తిపోతల. సంగమేశ్వరం వద్ద నిర్మిస్తామని ప్రభుత్వం హడావుడి చేస్తున్న ప్రాజెక్ట్. నిజానికి ఈ ప్రాజెక్ట్‌కు ఇంత వరకూ పునాది కూడా పడలేదు. వేయవద్దని ఎన్జీటీతో పాటు కృష్ణాబోర్డు నుంచి ఆదేశాలు ఉన్నాయి. కానీ ఏపీ సర్కార్ అవేమీ పట్టించుకోకుండా నిర్మాణాలు చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే… పరిశీలన చేస్తామని కృష్ణాబోర్డు అంటూంటే.. వద్దే వద్దని ఏపీ సర్కార్ అంటోంది.

ప్రాజెక్ట్ పరిశీలనకు వస్తామని ఇప్పటికి మూడు సార్లు కృష్ణాబోర్డు లేఖ రాసింది. ఈ ఒక్కటి చూసేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేని ఏపీ సర్కార్.. ఆ ఒక్కటి కాదు.. తెలంగాణలోని అన్ని అక్రమ ప్రాజెక్టులు చూడాలని డిమాండ్ చేస్తోంది. ఆ మేరకు అధికారిక లేఖ పంపింది. అయితే కృష్ణాబోర్డు మాత్రం… మిగతా వాటి సంగతేమో కానీ సంగమేశ్వరం ప్రాజక్ట్‌ను చూసేందుకు 19, 20 తేదీల్లో వస్తామని, ప్రాజెక్టు గురించి అన్ని విషయాలు తెలిసిన అధికారిని అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. ఆ ప్రాజెక్టు నివేదికల్ని కూడా అందచేయాలని ఆదేశించింది. అయితే ఏపీ సర్కార్ బోర్డు చైర్మన్ వైఖరిని తప్పు పడుతూ మరో లేఖ రాసింది. కృష్ణాబోర్డు అంటే చైర్మన్ మాత్రమే కాదని.. ఏపీ సర్కార్ వాదన.

నిజానికి కృష్ణాబోర్డు రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాంతాన్ని పరిశీలించడానికి వస్తామని చెప్పడానికి అసలు కారణం.. అక్కడ అనుమతుల్లేకుండా నిర్మాణాలు ప్రారంభమయ్యాయని తెలంగాణ నుంచి ఫిర్యాదులు వెళ్లడమే. ఆ ఫిర్యాదులను పరిశీలించి వాస్తవాలు వెల్లడించడానికి కృష్ణాబోర్డు ప్రయత్నిస్తోంది. అక్కడ నిర్మాణాలేమీ జరగడం లేదని ఏపీ సర్కార్ చెబుతోంది. కానీ పరిశీలించడానికి మాత్రం అంగీకరించడం లేదు. దీంతో అక్కడ ఏపీ ప్రభుత్వం నిర్మాణాలు చేసేస్తోందన్న అనుమానాలు పెరిగిపోవడానికి కారణం అవుతున్నాయి. చూపించాల్సిన ప్రాజెక్ట్ చూపించేసి.. ఆ తర్వాత తెలంగాణ ప్రాజెక్టులను కూడా చూడాలని ఏపీ డిమాండ్ చేస్తే సముచితంగా ఉంటుందన్న అభిప్రాయం సాగునీటి రంగ నిపుణుల్లో వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close