ఆంధ్రప్రదేశ్‌కు దేశంలోనే అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి ఢిల్లీలో 14వ తేదీన ఒప్పందం జరగనుంది. కేంద్రమంత్రి అశ్వని వైష్ణవ్ సమక్షంలో ఏపీ ప్రభుత్వం , గూగుల్ ప్రతినిధుల మధ్య ఒప్పందాలు జరగనున్నాయి. ఇందు కోసం పదమూడో తేదీన చంద్రబాబు, లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. సీఆర్డీఏ భవనం ప్రారంభోత్సవం పదమూడో తేదీన ఉంటుంది. ఆ కార్యక్రమం అయిన తర్వాత ఢిల్లీకి వెళ్తారు.
గూగుల్ తో పాటు గూగుల్ సబ్సిడరీ అయిన రిడెన్ కూడా పది బిలియన్ డాలర్ల వరకూ పెట్టుబడులు పెట్టనుంది. ఇది పూర్తిగా విశాఖ పెట్టుబడుల ముఖచిత్రం మారనుంది. మరో వైపు మెటా కూడా త్వరలో విశాఖకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తన వాటర్ వర్త్ కేబుల్ ప్రాజెక్టులో భాగంగా విశాఖ, ముంబైని ఎంచుకున్నట్లుగా ఇప్పటికే ప్రకటించింది. వచ్చే మూడేళ్లలో ఇది కూడా కార్యరూపంలోకి రానుంది.
గూగుల్ తో పాటు ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ , యాక్సెంచర్, టీసీఎస్ వంటి సాప్ట్ వేర్ కంపెనీలతో ఉత్తరాంధ్ర దశ మారబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ముంబై తరహాలో విశాఖపట్నం అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు.