అపెక్స్ కౌన్సిల్‌ భేటీకి మరోసారి ముహుర్తం..!

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి కేంద్రం మరో ప్రయత్నం చేస్తోంది. అపెక్స్ కౌన్సిల్ భేటీని వచ్చే నెల ఆరో తేదీన ఏర్పాటు చేస్తూ ఇరు రాష్ట్రాలకు సమాచారం పంపింది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ సీఎస్‌లకు కేంద్ర జలశక్తిశాఖ లేఖలు వెళ్లాయి. కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఏపీ, తెలంగాణ సీఎంలు కూడా హాజరవుతారు. ఇప్పటికి రెండు సార్లు అపెక్స్ కౌన్సిల్ భేటీ వాయిదా పడింది. మొదట ఆగస్ట్‌ 5నే సమావేశం జరగాల్సి ఉంది. కానీ కేసీఆర్ వాయిదా కోరారు. ఆ తర్వాత కూడా సమావేశం తేదీని ఖరారు చేశారు.

కానీ రెండు రోజుల ముందు గజేంద్ర షెకావత్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో ఆ సమావేశమూ వాయిదా పడింది. ఇప్పుడు షెకావత్ కోలుకున్నారు. సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మరే అడ్డంకులు రాకపోతే.. ఈ సారి సమావేశం జరిగే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను నిర్మించాలని నిర్ణయించడంతో వివాదం ప్రారంభమయింది. ఆ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు నీటి కష్టాలు వస్తాయంటున్న కేసీఆర్..కేంద్రానికి ఫిర్యాదులు చేశారు.

ఇలా ఒక్క ప్రాజెక్టుతో ప్రారంభమై రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్మితమవుతున్న అన్ని ప్రాజెక్టులపై ఒకరినొకరు ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లింది. అదే సమయంలో కేసీఆర్ … జల వివాదాలను కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శలు చేయడంతో… నేరుగా కేంద్ర జలశక్తి మంత్రినే రంగంలోకి దిగారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారానికి భేటీ ఏర్పాటు చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాప్ ద‌ర్శ‌కుల వెంట ప‌డుతున్న మెగా అల్లుడు

`విజేత‌`తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు క‌ల్యాణ్ దేవ్‌. రెండో సినిమా `సూప‌ర్ మ‌చ్చీ`. ఇది సెట్‌లో ఉండ‌గానే.. రెండు మూడు సినిమాలు సెట్ చేసుకున్నాడు. ఇప్పుడు త‌న ఖాతాలో మ‌రో సినిమా...

ఇన్‌సైడ్ టాక్‌: ‘ఉప్పెన’ పాట ‘వెర్ష‌న్‌’ల గోల‌

ఓ పాట‌కు ఒక‌డ్రెండు వెర్ష‌న్లు రాయించుకోవ‌డం ఇది వ‌ర‌కు ఉండేది. ఒకే ట్యూన్ ఇద్ద‌రు ముగ్గురికి ఇచ్చి, ఎవరి అవుట్ పుట్ బాగుంటే.. వాళ్ల పాట ఓకే చేయ‌డం జ‌రిగేది. అయితే.. ఇప్పుడు...

ప్రభుత్వ పెద్దల సన్నిహితుల చానల్‌లో మంత్రి వ్యతిరేకత వార్తల అర్థమేంటి..?

తెలంగాణకు చెందిన ఓ మంత్రి రాసలీలలంటూ తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అధీనంలో ఉన్న న్యూస్ చానల్ హంగామా ప్రారంభించడం టీఆర్ఎస్‌లో కలకలం రేపుతోంది.కొద్దీ రోజులుగా ఆ...

కళ్ల ముందు కనిపిస్తున్న ఇళ్లతో టీడీపీ రాజకీయం..!

పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలిస్తామంటూ హడావుడి చేసిన వైసీపీ సర్కార్... ఏడాదిన్నర గడిచిపోయినా ఆ దిశగా కనీసం అడుగులు వేయలేకపోయింది. ఆ పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న అభిప్రాయం...

HOT NEWS

[X] Close
[X] Close