చంద్రబాబు, భువనేశ్వరిలకు క్షమాపణపలు : వల్లభనేని వంశీ

చంద్రబాబును మానసికంగా హింసించాలని.. ఆయన భార్య, ఎన్టీఆర్ కుమార్తెపై దారుణమైన అభాండాలు వేసి రచ్చ రచ్చ చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీరిగ్గా టీవీ9 డిబేట్‌లో మొహం కనిపించకుండా ఫోన్ లైన్‌లోకి వచ్చి భువనేశ్వరికి భేషరతుగా క్షమాపణ చెబుతున్నానని స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఎమోషన్‌లో ఓ పదం తప్పుగా దొర్లిన మాట నిజమేనని అందుకే క్షమాపణ చెబుతున్నానన్నారు. చంద్రబాబును కూడా క్షమాపణ అడుగుతున్నానని చెప్పుకొచ్చారు. భువనేశ్వరిని తాను అక్కా అని పిలుస్తానని చెప్పుకొచ్చారు. కులం నుంచి వెలివేస్తారనే భయంతో చెప్పడం లేదని.. మనస్ఫూర్తిగా సారీ చెబుతున్నానన్నారు. తప్పు జరిగినందుకు పశ్చాత్తాపపడుతున్నానని..మరోసారి ఇలాంటి తప్పు జరగబోదని అన్నారు. ఈ వివాదంలో అందరూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ఓ సందర్భంగా సాక్షి మీడియాను పిలిపించుకుని మరీ వల్లభనేని వంశీ లోకేష్ పుట్టుకపై వ్యాఖ్యలు చేశారు. ఆయనలో మాధవరెడ్డి పోలికలు ఉన్నాయంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అసలు లోకేష్ పుట్టినప్పుడు మాధవరెడ్డి గ్రామ స్థాయి రాజకీయాల్లో కూడా లేరు. ఆ విషయం తెలిసి కూడా ప్రజల్లో భువనేశ్వరి క్యారెక్టర్‌పై ఓ తప్పుడు ముద్ర వేయడం ద్వారా.. అటు చంద్రబాబును.. ఇటు లోకేష్‌ను మానసికంగా హింసించాలన్న ఓ ప్లాన్ ప్రకారమే వంశీ అధికార పార్టీమీడియా ను పిలిపించి వ్యాఖ్యలు చేశారు. తర్వాత వాటిని సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యూలేట్ చేశారు. అసెంబ్లీలో అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కొడాలి నాని అదే మాటలు రన్నింగ్ కామెంటరీగా మాట్లాడారు. దీంతో చంద్రబాబు మానసికంగా ఇబ్బంది పడ్డారు. కన్నీరు పెట్టుకున్నారు.

వైఎస్ఆర్‌సీపీ నేతల వ్యవహారాశైలిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మహిళలపై ఇంత దారుణంగా వ్యాఖ్యానించడం ఏమిటన్న చర్చలు గ్రామాల్లోనూ జరుగుతున్నాయి. టీడీపీ.. మహిళల ఆత్మగౌరవసభలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో టీవీ9 డిబేట్ నిర్వహించి వంశీని ఫోన్‌లైన్‌లో క్షమాపణలు చెప్పించడం.. డ్యామేజ్ కంట్రోల్లో భాగంగానే వ్యూహాత్మకంగా చేసినట్లుగా భావిస్తున్నారు. అదే డిబేట్లో మరో మంత్రి కొడాలి నాని ఫోన్‌లైన్‌లోకి తీసుకుని ఈ వివాదానికి కులం కోణం జోడించే ప్రయత్నం చేయడం కూడా వ్యూహాత్మకంగా జరిగిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

ఖమ్మం జిల్లాలోని పాలేరు నగర పంచాయతీకి చెందిన ఓ కౌన్సిలర్ మల్లాది విష్ణు చంద్రబాబును దూషించిన కొడాలి నాని, వల్లభనేని వంశీలను అంత మొందిస్తే.. రూ. యాభై లక్షల బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఆయన టీఆర్ఎస్ పార్టీకి చెందినవారు. ఈ అంశాన్ని కూడా టీవీ9 డిబేట్‌లోకి తీసుకువచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గురివిందలు : కడపకు వైఎస్ పేరు పెట్టినప్పుడు జగన్, విజయమ్మ స్పందించారా!?

కృష్ణా జిల్లాను రెండు మక్కలు చేసి ఒక దానికి ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అని పేరు పెడుతున్నట్లుగా ప్రభుత్వం చెబుతోంది. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించింది. చట్టపరమైన అడ్డంకులు అన్నింటినీ అధిగమించి జిల్లా...

విడాకుల‌పై నేనేం మాట్లాడ‌లేదు: నాగార్జున‌

నాగ‌చైత‌న్య - సమంత విడాకుల‌పై నాగార్జున స్పందించార‌ని, స‌మంత కోరిక మేర‌కే నాగ‌చైత‌న్య విడాకులు ఇచ్చాడ‌ని, ఇందులో చై చేసిందేం లేద‌న్న‌ట్టు... ఈరోజు సోష‌ల్ మీడియాలో వార్త‌లు గుప్పుమ‌న్నాయి. దాంతో... ఈ విడాకులకు...

హిందూపురం జిల్లా కోసం బాలకృష్ణ పోరాటం తప్పదు !

కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడాన్ని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎప్పటి నుండో సమర్థిస్తున్నారు. అయితే ఆయన డిమాండ్ ఒక్కటే హిందూపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయడం. కానీ ప్రభుత్వం మాట...

తెలంగాణ ఐఏఎస్ కూతురి పెళ్లికి “మేఘా” ఖర్చులు !?

తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి, ఇరిగేషన్ బాధ్యతలు చూస్తున్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్‌కుమార్‌పై తీవ్రమైన ఆవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల రజత్ కుమార్ కుమార్తె పెళ్లి అత్యంత జరిగింది. హైదరాబాద్‌లోని పలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close