పీఆర్వోలుగా చేరినా… ఇప్పటికీ సాక్షి ఉద్యోగులే..!

పీఆర్వోలుగా చేసిన ఉద్యోగులతో.. తమ మీడియా సంస్థలో రాజీనామాలు చేయించడానికి సాక్షి యాజమాన్యం తంటాలు పడుతోంది. వారిలో చాలా మంది తాము ప్రభుత్వం తరపున కాంట్రాక్ట్ ఉద్యోగానికి వెళ్లడానికి సిద్ధంగా లేమని చెబుతున్నారు. వెళ్లడానికి సిద్ధమే కానీ.. సాక్షికి మాత్రం రాజీనామా చేసేది లేదంటున్నారు. ఇప్పుడీ పంచాయతీ సాక్షి యాజమాన్యంలో కొత్త కలకలం రేపుతోందని… మీడియా వర్గాలు చెబుతున్నాయి. సాక్షి ఉద్యోగులందర్నీ… ప్రభుత్వానికి సంబంధించి ఐ అండ్ పీఆర్ డిపార్ట్‌మెంట్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదిక నియమించారు. ఇలా పై స్థాయి నుంచి ఆఫీస్‌బాయ్ వరకూ.. కనీసం… రెండు వందల యాభై మంది వరకూ ఉంటారని చెబుతున్నారు. వీరందరికీ.. ప్రభుత్వం తరపున జీతాలు ఇవ్వడం కూడా ప్రారంభమయింది.

అయితే.. ఇప్పటికీ వీరిలో అత్యధికులు సాక్షి ఉద్యోగులుగానే కొనసాగుతున్నారు. అలా వద్దని.. సాక్షి ఉద్యోగానికి రాజీనామా చేయాలని.. యాజమాన్యం ప్రభుత్వం వద్ద చేరిపోయిన పీఆర్వోలను అడుగుతోందట. కానీ వారు మాత్రం ససేమిరా అంటున్నారు. కావాలంటే.. తాము సాక్షిలోనే పని చేస్తామని తెగెసి చెప్పేవారు ఎక్కువయ్యారని అంటున్నారు. కొంత మంది రాజీనామా లేఖలు ఇచ్చేందుకు సిద్ధమైనా.. చాలా మంది.. వ్యతిరేకిస్తూండటంతో వారు కూడా ఆగిపోయారు. దీంతో ఈ విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి వద్దకు తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. ఆయన ఏదో ఓ పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉందంటున్నారు. నిజానికి సాక్షిలో ఉన్న అనేక పవర్ సెంటర్ల వల్ల.. ఉద్యోగుల్ని… పరిమితికి మంచి అదనంగా నియమించుకోవాల్సి వచ్చింది. సాక్షిలో.. ప్రతి విభాగానికి ఉండే ఇన్చార్జ్.. అంతా తన ఇష్టప్రకారమే జరగాలనుకుంటారు.

ఉద్యోగుల్ని కూడా తన మాట వినేవారినే పెట్టుకుంటారు. అలా.. అన్ని డిపార్టుమెంట్లలోనూ… ఉద్యోగులు పెరిగిపోయారు. జీతభత్యాల ఖర్చు పెరిగిపోవడం… ఇప్పుడు ప్రభుత్వం రావడంతో.. చాలా మందిని… ప్రభుత్వం వైపు మళ్లించాలని నిర్ణయించుకుని.. ఆ దిశగా … అడుగులు వేశారు. అయితే.. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగం… తాత్కాలికమేనని చాలా మంది నమ్ముతున్నారు. రేపు ఏదైనా కోర్టు కేసు పడినా… తమ ఉపాధి ఊడిపోతుందని.. అప్పుడు మళ్లీ.. తాము రోడ్డున పడతామని.. సాక్షిలోకి రీ ఎంట్రీ ఉండదని అనుమానపడుతున్నారు. అందుకే వారు రాజీనామాలు చేయడానికి సిద్ధపడటం లేదంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close