ఫ్లాప్ అయినా మ‌హేష్ న‌న్ను వ‌ద‌ల్లేదు: మురుగ‌దాస్‌

ఎందుకో స్ట్ర‌యిట్ తెలుగు సినిమా అనేస‌రికి మురుగ‌దాస్ కంగారు ప‌డుతున్నాడు. అప్పట్లో స్టాలీన్‌, మొన్న‌టి స్పైడ‌ర్ సినిమాలే ఇందుకు రుజువులు. స్పైడర్ విష‌యంలో మాత్రం మురుగ‌దాస్ చాలా విమ‌ర్శ‌లు ఎదుర్కున్నాడు. ముఖ్యంగా మ‌హేష్ ఫ్యాన్స్ నుంచి. ఆ సినిమా ఫ్లాప్ అటు మ‌హేష్‌నీ, ఇటు మురుగ‌దాస్‌నీ చాలా బాధ పెట్టింది. ఆ ఫ్లాప్‌గురించి మురుగ‌దాస్ ఇప్ప‌టికీ త‌ల‌చుకుంటూనే ఉన్నాడు.

“మ‌హేష్‌కి ఫ్లాప్ ఇచ్చాన‌న్న బాధ న‌న్ను వెంటాడుతూనే ఉంది. ఆ సినిమా విష‌యంలో ఏదో త‌ప్పు జ‌రుగుతుంద‌ని ముందు నుంచీ తెలుస్తూనే ఉంది. అదేమిట‌న్న‌ది క‌నిపెట్ట‌లేక‌పోయాను. దాంతో మా అంచ‌నాల‌న్నీ త‌ప్పేలా చేసింది. ఓ సినిమా హిట్ట‌యితేనే హీరో, ద‌ర్శ‌కుడి మ‌ధ్య అనుబంధం ఉంటుంది. లేదంటే లేదు. కానీ మ‌హేష్ మాత్రం వేరు. ఆయ‌న రూప‌మే కాదు. మ‌న‌సు కూడా బంగారం. స్పైడ‌ర్ ఫ్లాప్ అయిన త‌ర‌వాత కూడా ఆయ‌న త‌న స్నేహం కొన‌సాగించారు. ప‌ది రోజుల పాటు వ‌రుస‌గా ఫోన్లు చేస్తూ, మెసేజ్‌లు పెట్టేవారు. సినిమాల్లో ఇవ‌న్నీ మామూలే ప‌ట్టించుకోకండి.. అని భ‌రోసా ఇచ్చేవారు. అలాంటి హీరోని నేను చూడ‌లేదు” అని మ‌హేష్ గురించి చెప్పుకొచ్చాడు మురుగ‌దాస్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చ‌రిత్ర సృష్టించిన ధావ‌న్

ఐపీఎల్ లో మ‌రో రికార్డ్ న‌మోద‌య్యింది. ఈసారి శేఖ‌ర్ ధావ‌న్ వంతు. ఐపీఎల్ లో వ‌రుస‌గా రెండు సెంచ‌రీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ధావ‌న్ రికార్డు సృష్టించాడు. ఓ బ్యాట్స్‌మెన్ వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల‌లో...

జాతికి జాగ్రత్తలు చెప్పిన మోదీ..!

ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. మధ్యాహ్నం నుంచి ఉత్కంఠ రేపిన ఆరు గంటల ప్రసంగంలో కీలకమైన విధానపరమైన ప్రకటనలు ఏమీ లేవు. పండగల సందర్భంగా ప్రజలు స్వేచ్చగా తిరుగుతున్నారని.. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేందుకు...

ఏపీకి విరాళాలివ్వట్లేదా..! జగన్ అడగలేదుగా..?

సినీ స్టార్లు, పారిశ్రామికవేత్తలు తెలంగాణకు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ఇబ్బందుల్లో పడిన హైదరాబాద్‌ను.. అక్కడి ప్రజలను ఆదుకోవడానికి సీఎంఆర్ఎఫ్‌కు విరాళాలివ్వాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇలా పిలుపునిచ్చారో...

కేసీఆర్ పిలుపు… విరాళాల వెల్లువ..!

ముఖ్యమంత్రి సహాయనిధికి విరివిగా విరాళాలివ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. వరదల కారణంగా హైదరాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకోవడంతో పాటు పెద్ద ఎత్తన ధ్వంసం అయిన రోడ్లు, విద్యుత్...

HOT NEWS

[X] Close
[X] Close